ETV Bharat / sports

యూసఫ్ పఠాన్ సునామీ ఇన్నింగ్స్‌.. 14 బంతుల్లో 61 రన్స్.. థ్రిల్లింగ్​గా వీడియో!

author img

By

Published : Jul 29, 2023, 10:53 AM IST

యూసఫ్ పఠాన్ సునామీ ఇన్నింగ్స్‌
యూసఫ్ పఠాన్ సునామీ ఇన్నింగ్స్‌

yusuf pathan T10 league : యూఏఈ క్రికెట్ బోర్డు నిర్వహిస్తున్న టీ10 లీగ్‌లో యూసఫ్ పఠాన్ సునామీ ఇన్నింగ్స్‌తో అదరగొట్టేశాడు. అతడి ఇన్నింగ్స్ వీడియో చూశారా?

UAE T10 league 2023 : యూఏఈ క్రికెట్ బోర్డు నిర్వహిస్తున్న టీ10 లీగ్‌లో యూసఫ్ పఠాన్ సునామీ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. జోబర్గ్ బఫ్పాలోస్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు 26 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లతో 80 అజేయ పరుగులు చేశాడు. ఒంటి చేత్తో తన జట్టును ఫైనల్​కు చేర్చాడు.

శుక్రవారం డర్బన్ ఖలాండర్స్ - జోబర్గ్ బఫ్పాలోస్ మధ్య క్వాలిఫయర్ 1 మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన డర్బన్ ఖలాండర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. ఆండ్రీ ఫ్లెచర్(39), ఆసిఫ్ అలీ(32*) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. ఆ తర్వాత 141 పరుగల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన జోబర్గ్ జట్టు ఒక బంతి మగిలి ఉండగానే.. 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 142 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

yusuf pathan T10 league : యూసఫ్ పఠాన్​ సునామీ ఇన్నింగ్స్​.. ఓ దశలో 57 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో వెళ్లింది జోబర్గ్ జట్టు. ఆ సమయంలో ఎంట్రీ ఇచ్చిన యూసఫ్ పఠాన్ జట్టును ఆదుకున్నాడు. ముష్ఫికర్ రహీమ్(14 *) సాయంతో జట్టుకు అదిరేటి విజయాన్ని అందించాడు. జోబర్గ్ జట్టు విజయానికి చివరి 18 బంతుల్లో 64 పరుగులు అవసరమయ్యాయి. ఆ సమయంలో యూసఫ్.. 14 బంతుల్లోనే 61 పరుగులు చేసి ఔరా అనిపించాడు.

వరుసగా 6,6,0,6,WD,2,4,6,1,6,4,6,4,6,4 బౌండరీలు బాది సునామీ సృష్టించాడు. పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్​ బౌలింగ్​లో రెచ్చిపోయి ఆడాడు. అమీర్ వేసిన 6 బంతులను 6,6,0,6,2,4 బాది 24 పరుగులు ఖాతాలోకి వేసుకున్నాడు. దీంతో సోషల్​మీడియా అంతా యూసఫ్ పఠాన్‌ ఇన్నింగ్స్ గురించే చర్చించుకుంటూ.. అతడి ఆటకు సంబంధించిన వీడియోలను నెట్టింట్లో ట్రెండ్ చేస్తున్నారు. అవి క్రికెట్​ అభిమానులను బాగా అలరిస్తున్నాయి.

  • Yusuf Pathan smashed 6,6,0,6,2,4 in an over against Mohammad Amir.

    The Madness of Yusuf Pathan - This is Brutal. pic.twitter.com/dE9t5ihZ6i

    — CricketMAN2 (@ImTanujSingh) July 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి :

Eng vs Aus fourth test : రసవత్తరంగా రెండో టెస్ట్​.. స్మిత్​, కమిన్స్​ జోరు.. ఆధిక్యంలో ఆసీస్

Arjun Tendulkar Six Pack : సీనియర్ల బాటలోనే అర్జున్.. సిక్స్​ప్యాక్​తో మిర్రర్​ సెల్ఫీకి పోజునిస్తూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.