ETV Bharat / sports

IPL​ ఎఫెక్ట్: ఆసీస్ స్టార్ క్రికెటర్లు ఆ సిరీస్​లకు దూరం

author img

By

Published : Jun 16, 2021, 2:14 PM IST

ఐపీఎల్​లో ఆడిన ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు కొందరు.. త్వరలో వెస్టిండీస్, బంగ్లాదేశ్​తో జరగాల్సిన​ పరిమిత ఓవర్ల సిరీస్​కు దూరమయ్యారు. వీరిలో కమిన్స్, స్మిత్, వార్నర్ తదితరులు ఉన్నారు.

Australia
ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు.. వివిధ కారణాలతో వెస్డిండీస్​, బంగ్లాదేశ్​తో జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్​కు దూరమయ్యారు. దీంతో జూనియర్లతోనే కంగారూ జట్టు ఈ పర్యటనకు వెళ్లనుంది. ఆటగాళ్లు తప్పుకోవడానికి గల కారణాలు వెల్లడించకపోయినా.. బయోబబుల్​లో ఉండటం ఇష్టం లేకపోవడం వల్లే ఇలా చేసినట్లు తెలుస్తోంది.

విండీస్, బంగ్లాతో సిరీస్ నుంచి స్టార్ ఆటగాళ్లు పాట్ కమిన్స్, మ్యాక్స్​వెల్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, స్టోయినిస్, జే రిచర్డ్​సన్, కేన్ రిచర్డ్​సన్ వైదొలిగారు. ఇందులో స్మిత్ మోచేతి గాయం కారణంగా తప్పుకోగా, మిగతా వారు బోర్డుకు తమను ఈ పర్యటనకు దూరంగా ఉంచమని బోర్డును కోరినట్లు సమాచారం.

ఈ పర్యటన నుంచి తప్పుకొన్న ఆసీస్ ఆటగాళ్లు అందరూ ఐపీఎల్​లో ఆడుతున్న వాళ్లే. కరోనా కారణంగా లీగ్ వాయిదా పడటం వల్ల గత నెలలో స్వదేశానికి చేరుకున్నారు. ఆ తర్వాత సిడ్నీలో మళ్లీ క్వారంటైన్​లో ఉన్నారు. దీంతో వీరికి కుటుంబంతో గడిపే సమయం ఎక్కువగా లేకపోవడం వల్ల ఈ టూర్​ నుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది.

వచ్చే నెలలో వెస్టిండీస్​తో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్​తో ఆస్ట్రేలియా తిరిగి మైదానంలో అడుగుపెట్టనుంది. ఇందులో భాగంగా ఇరుజట్లు ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనున్నాయి. అనంతరం ఆగస్టులో బంగ్లాదేశ్​తో 5 టీ20లు ఆడనుంది. అక్టోబర్​లో టీ20 ప్రపంచకప్ ఉన్న దృష్ట్యా ఈ పర్యటనలను అందుకు ప్రాక్టీసుగా పనికొస్తాయని కంగారూ జట్టు భావిస్తోంది. మెగాటోర్నీకి ముందు యువకుల సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఈ మ్యాచ్​లు ఉపయోగపడతాయని బోర్డు అనుకుంటోంది.

ఆస్ట్రేలియా జట్టు

ఫించ్ (కెప్టెన్). ఆస్టన్ అగర్, వెస్ అగర్, బెహ్రండాఫ్, అలెక్స్ కారే, క్రిస్టియన్, హెజిల్​వుడ్, హెన్రిక్స్, మిచెల్ మార్ష్, బెన్ మెక్​డర్మోట్, రిలే మెరిడిత్, జోష్ ఫిలిప్, మిచెల్ స్టార్క్, మిచెల్ స్వీప్​సన్, ఆస్టన్ టర్నర్, ఆండ్రూ టై, మాథ్యూ వేడ్, ఆడం జంపా

రిజర్స్ ఆటగాళ్లు: నాథన్ ఎల్లిస్, తన్వీర్ సంఘా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.