ETV Bharat / sports

విరాట్​ బర్త్​ డే స్పెషల్​ - 49వ సెంచరీ బాదేశాడోచ్​ - సచిన్​ను సమం చేసిన కింగ్

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2023, 5:45 PM IST

Updated : Nov 5, 2023, 8:23 PM IST

Virat Kohli 49th Century
Virat Kohli 49th Century

Virat Kohli 49th Century : 2023 వరల్డ్​కప్​లో భాగంగా జరుగుతున్న భారత్ -సౌతాఫ్రికా మ్యాచ్​లో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. అదరగొడుతున్నాడు. ఈ క్రమంలో తన వన్డే కెరీర్​లో విరాట్ 49వ సెంచరీ నమోదు చేశాడు.

Virat Kohli 49th Century : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. కెరీర్​లో అద్భుతమైన మైలురాయి అందుకున్నాడు. వరల్డ్​కప్​లో భాగంగా కోల్​కతా వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్​లో విరాట్ (100 పరుగులు ; బంతుల్లో 10x4) శతకంతో అదరగొట్టాడు. ఈ క్రమంలో అతడు తన వన్డే కెరీర్​లో 49వ సెంచరీ నమోదు చేశాడు. దీంతో వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ సరసన చేరాడు. తన బర్త్ డే రోజున ఈ ఘనత సాధించడం వల్ల విరాట్ ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు అతడిపై ప్రశంసం జల్లు కురిపిస్తున్నారు.

సచిన్ తెందూల్కర్ ట్వీట్.. వెల్​ ప్లే విరాట్.. " నాకు 49 నుంచి 50 చేరుకోడానికి (వయసును ఉద్దేశిస్తూ) 365 రోజులు పట్టింది. కానీ, నువ్వు త్వరలోనే 49 నుంచి 50కి (వన్డేల్లో సెంచరీలు ఉద్దేశించి) చేరుకొని నా రికార్డు బ్రేక్ చెయ్యాలి" అని తెందూల్కర్ ట్వీట్ చేశాడు.

  • Well played Virat.
    It took me 365 days to go from 49 to 50 earlier this year. I hope you go from 49 to 50 and break my record in the next few days.
    Congratulations!!#INDvSA pic.twitter.com/PVe4iXfGFk

    — Sachin Tendulkar (@sachin_rt) November 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వన్డేల్లో అత్యధిక సెంచరీలు

  • విరాట్ కోహ్లీ 49 (277 ఇన్నింగ్స్​)
  • సచిన్ తెందూల్కర్ 49 (452 ఇన్నింగ్స్​)
  • రోహిత్ శర్మ 31 (251 ఇన్నింగ్స్​)
  • రికీ పాంటింగ్ 30 (365 ఇన్నింగ్స్​)
  • సనత్ జయసూర్య 28 (433 ఇన్నింగ్స్​)

పుట్టినరోజున సెంచరీలు బాదిన క్రికెటర్లు..

  • వినోద్ కాంబ్లి 100 vs ఇంగ్లాండ్ (1993)
  • సచిన్ తెందూల్కర్ 134 vs ఆస్ట్రేలియా (1998)
  • సనత్ జయసూర్య 130 vs భారత్ (2008)
  • రాస్ టేలర్ 131 vs పాకిస్థాన్ (2011)
  • మిచెల్ మార్ష్ 121 vs పాకిస్థాన్ (2023)
  • విరాట్ కోహ్లీ 101 vs సౌతాఫ్రికా (2023)

ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో.. ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో.. వన్డేల్లో విరాట్ ఇప్పటివరకు 49 సెంచరీలు బాదాడు. మరొక్క శతకం నమోదు చేస్తే వన్డేల్లో 50 సెంచరీలు బాదిక ఏకైక క్రికెటర్​గా విరాట్ చరిత్ర సృష్టిస్తాడు. అయితే ఈ అరుదైన ఘనతకు కేవలం ఒకే సెంచరీ దూరంలో ఉండడం వల్ల.. విరాట్ ఈజీగా సాధించే ఛాన్స్ ఉంది. ఇక ఇప్పటివరకు విరాట్ తన కెరీర్​లో 289 వన్డే మ్యాచ్​లు ఆడాడు. 58.48 సగటుతో 13626 పరుగులు సాధించాడు. ఇందులో 49 శతకాలు, 70 అర్ధ శతకాలు ఉన్నాయి.

ఆ రికార్డ్​కు నాకు ఏడాది పట్టింది నువ్వు త్వరగా చేయగలవా? - కోహ్లీ 49వ సెంచరీపై సచిన్ ట్వీట్

7అడుగుల ఎత్తు, 5టన్నుల ఇసుక- విరాట్​ కోహ్లీ సైకత శిల్పం అదుర్స్​!

Last Updated :Nov 5, 2023, 8:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.