ETV Bharat / sports

ఆ రికార్డ్​కు నాకు ఏడాది పట్టింది నువ్వు త్వరగా చేయగలవా? - కోహ్లీ 49వ సెంచరీపై సచిన్ ట్వీట్

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2023, 7:34 PM IST

Updated : Nov 5, 2023, 8:43 PM IST

Virat Kohli 49th Century
Virat Kohli 49th Century

Virat Kohli 49th Century : స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. వరల్డ్​కప్​లో సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్​లో 49వ వన్డే సెంచరీ సాధించాడు. దీంతో అతడిపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది.

Virat Kohli 49th Century : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. కెరీర్​లో అరుదైన మైలురాయి అందుకున్నాడు. ప్రపంచకప్​లో సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్​లో శతకంతో (101 పరుగులు) అదరగొట్టాడు. ఈ క్రమంలో విరాట్ వన్డేల్లో అత్యధిక సెంచరీలు బాదిన సచిన్ తెందూల్కర్ (49) రికార్డును సమం చేశాడు. దీంతో అతడిపై పలువురు మాజీ క్రికెటర్లు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఎవరెవరు ఏమన్నారంటే?

త్వరగా బ్రేక్ చెయ్.. విరాట్ వన్డేల్లో 49వ సెంచరీ సాధించిన సందర్భంగా.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ ట్విట్టర్​ వేదికగా అతడిని ప్రశంసించాడు. వెల్​ ప్లే విరాట్.. " నాకు 49 నుంచి 50 చేరుకోడానికి (వయసును ఉద్దేశిస్తూ) 365 రోజులు పట్టింది. కానీ, నువ్వు త్వరలోనే 49 నుంచి 50కి (వన్డేల్లో సెంచరీలు ఉద్దేశించి) చేరుకొని నా రికార్డు బ్రేక్ చెయ్యాలి" అని తెందూల్కర్ ట్వీట్ చేశాడు.

  • Well played Virat.
    It took me 365 days to go from 49 to 50 earlier this year. I hope you go from 49 to 50 and break my record in the next few days.
    Congratulations!!#INDvSA pic.twitter.com/PVe4iXfGFk

    — Sachin Tendulkar (@sachin_rt) November 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • విరాట్ కోహ్లీ తన బర్త్​ డే రోజు లెజెండరీ సచిన్ తెందూల్కర్ రికార్డును సమం చేశాడు. వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్​గా సచిన్​తోపాటు నిలిచాడు. - ఐసీసీ
  • విరాట్ సతీమణి అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ విరాట్ సెంచరీ ఫొటోను షేర్ చేసింది. 'పుట్టిన రోజు నాడు ప్రత్యేక బహుమతిని నీకు నువ్వే ఇచ్చుకున్నావు' - నటి అనుష్క శర్మ.
  • 'క్లాస్‌ ఇన్నింగ్స్‌. విరాట్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. ఇంతకుమించిన బర్త్‌డే సెలబ్రేషన్స్‌ ఉండవు' - హీరో విక్టరీ వెంకటేశ్.

ఈ మ్యాచ్​లో విరాట్ నమోదు చేసిన రికార్డులు..

  • వరల్డ్​కప్​లో విరాట్ ఇప్పటివరకు 34 మ్యాచ్​ల్లో కలిపి.. 1573 పరుగులు చేశాడు. ఈ క్రమంలో సచిన్ (2278), రికీ పాంటింగ్ (1743), మాత్రమే విరాట్ కంటే ముందున్నారు.
  • సౌతాఫ్రికాపై అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్​గా సచిన్​ (5)ను విరాట్ సమం చేశాడు. అయితే సచిన్ 57 మ్యాచ్​ల్లో ఈ ఘనత సాధించగా.. విరాట్ 31 మ్యాచ్​ల్లోనే అందుకున్నాడు.
  • స్వదేశంలో వన్డేల్లో విరాట్ 6000+ పరుగులు నమోదు చేశాడు. ఈ జాబితాలో విరాట్ (6046) కంటే ముందు.. సచిన్ (6796) మాత్రమే ఉన్నాడు. వీరిద్దరి తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ (4590) మూడో స్థానంలో ఉన్నాడు.

విరాట్​ బర్త్​ డే మేనియా - లండన్​ నుంచి ఈడెన్​ గార్డెన్​కు ఫ్యాన్స్​​ - 20 రెట్లు ఎక్కువకు టికెట్లు కొనుగోలు

సెంచరీల రారాజు - విరాట్​ కోహ్లీ స్పెషల్​ రికార్డుల గురించి మీకు తెలుసా ?

Last Updated :Nov 5, 2023, 8:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.