ETV Bharat / sports

Vaughan: వివాదాస్పద ట్వీట్లపై విచారణ ఆపేయాలి

author img

By

Published : Jun 10, 2021, 8:25 PM IST

పాత(వివాదాస్పద) ట్వీట్లపై చేపట్టిన విచారణను నిలిపివేయాలని ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డుకు సూచించాడు ఆ దేశ మాజీ క్రికెటర్​ మైఖేల్​ వాన్​. ఇదంతా చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందని అభిప్రాయపడ్డాడు.

Vaughan
వివాదస్పద

ఇంగ్లాండ్​ క్రికెట్​లో వివాదాస్పద ట్వీట్ల వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. ఈ విషయమై ఇంగ్లాండ్ క్రికెట్​ బోర్డు చేస్తోన్న విచారణకు కొంతమంది మద్దతు ఇస్తుండగా.. గడిచిపోయిన గతాన్ని గురించి ప్రస్తుతం మళ్లీ లేవనెత్తడం సరికాదంటూ మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో దీనిపై స్పందించిన ఆ దేశ మాజీ సారథి మైఖేల్​ వాన్​.. ఈసీబీ చేస్తున్న విచారణను తప్పుబట్టాడు. తక్షణమే ఆ ప్రక్రియ ఆపివేయాలని సూచించాడు.

"మోర్గాన్​, బట్లర్​, అండర్సన్​.. ట్వీట్స్​ చేసిన సందర్భంలో ఎవరూ పట్టించుకోలేదు, బాధపడలేదు. కానీ ఇప్పుడు మాత్రం అవి ఎందుకు ప్రతికూలంగా కనిపిస్తున్నాయో? ఆశ్చర్యంగా ఉంది. ఇదంతా హాస్యస్పదంగా కనిపిస్తోంది. ఈ విచారణను ఆపివేయాలి." అని వాన్​ ట్వీట్​ చేశాడు.

ఇదీ జరిగింది

ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు.. వివాదాస్పద ట్వీట్లపై క్రమశిక్షణ ఉల్లంఘన చర్యల కింద చేపట్టిన విచారణను ఇటీవల వేగవంతం చేసింది. ఇందులో భాగంగా వరుసగా ఆటగాళ్లను విచారించడం ప్రారంభించింది. ఈ నేషథ్యంలోనే ఎనిమిదేళ్ల క్రితం స్త్రీ వివక్ష, జాత్యంహకార సందేశాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​లు చేశాడని యువ బౌలర్​ ఒల్లీ రాబిన్​సన్ (Ollie Robinson)​ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఇటీవల సస్పెండ్ చేసింది. ఈ క్రమంలోనే ప్రస్తుత కెప్టెన్ ఇయాన్​ మోర్గాన్(Eoin Morgan)​​, వికెట్​కీపర్​-బ్యాట్స్​మన్​ జాస్ ​బట్లర్​(Jos Buttler) గతంలో భారతీయులను అపహాస్యం చేస్తూ చేసిన ట్వీట్ల స్క్రీన్​షాట్లు సోషల్​మీడియాలో వైరల్​ అయ్యాయి. దీంతో వారిని కూడా విచారిస్తోంది.

ఇదీ చూడండి: Tweet controversy: వివాదంలో మరో ఇద్దరు క్రికెటర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.