ETV Bharat / sports

TeamIndia World Cup Squad : అక్షర్​ ఔట్​.. అశ్విన్ ఇన్​.. టీమ్ఇండియా వరల్డ్​ కప్​ జట్టులో మార్పులు ఇవే

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 28, 2023, 8:03 PM IST

Updated : Sep 28, 2023, 8:57 PM IST

TeamIndia World Cup Squad 2023 Axar Patel : టీమ్ఇండియా ఆల్​రౌండర్​ అక్షర్​ పటేల్ గాయం కారణంగా..​ రానున్న ప్రపంచకప్​​ కోసం భారత జట్టు​లో మార్పులు జరిగాయి. ఇప్పుడు అతని స్థానంలో సీనియర్ స్పిన్నర్​ అశ్విన్​ను తీసుకున్నారు.

Axar Patel World Cup 2023 :  అక్షర్​ ఔట్​.. అశ్విన్ ఇన్​.. టీమ్​ ఇండియా వరల్డ్​ కప్​ జట్టు ఇదే
Axar Patel World Cup 2023 : అక్షర్​ ఔట్​.. అశ్విన్ ఇన్​.. టీమ్​ ఇండియా వరల్డ్​ కప్​ జట్టు ఇదే

TeamIndia World Cup Squad 2023 Axar Patel : వరల్డ్ కప్‌ సందడి షురూ అయింది. కొన్ని జట్లు ఇప్పటికే భారత్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. మరో వారం రోజుల్లో మొదటి మ్యాచ్‌ జరగనుంది. శుక్రవారం నుంచి వార్మప్‌ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. అలానే ప్రపంచకప్ కోసం బరిలోకి దిగే స్క్వాడ్‌లో మార్పులు చేసుకొనే అవకాశం కూడా నేటితో ముగిసింది.

అక్షర్​ ఔట్​.. అశ్విన్ ఇన్.. అయితే టీమ్​ఇండియా ప్రపంచ కప్‌ టీమ్​లో అందరూ ఊహించినట్లుగానే కీలక మార్పు జరిగింది. బీసీసీఐ... వరల్డ్ కప్​ కోసం భారత జట్టులో నెలకొన్న సందిగ్ధతపై స్పష్టత ఇచ్చినట్లు ఐసీసీ ట్వీట్ చేసింది. గాయం వల్ల ఇంకా కోలుకోని అక్షర్ పటేల్​ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్​ను తీసుకున్నట్లు అనౌన్స్ చేసింది. ఇదొక్క మార్పు మినహా టీమ్​ ఇండియా తన స్క్వాడ్‌ను యథాతథంగానే ప్రకటించడం విశేషం.

కాగా, వరల్డ్​ కప్​ కోసం మొదట ప్రకటించిన టీమ్​ ఇండియాలో అశ్విన్‌కు చోటు దక్కలేదు. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో ప్రపంచ కప్​ టీమ్​కు సెలెక్ట్ అయిన అక్షర్‌ పటేల్‌ గాయపడటం, దీంతో ఆస్ట్రేలియాతో సిరీస్‌కు అశ్విన్‌‌ జట్టులోకి తిరిగి రావడం, వచ్చీ రాగానే 2 మ్యాచ్‌ల్లో 5 వికెట్లతో రెచ్చిపోవడం, గాయం నుంచి పూర్తిగా కోలుకోని అక్షర్‌కు అశ్విన్‌ ప్రత్యామ్నాయంగా మారడం.. వంటివి ఒకదాని తర్వాత మరొకటి చకచకా జరిగిపోయాయి.

ఇకపోతే సెప్టెంబర్ 30, అక్టోబర్ 3న రెండు వార్మప్‌ మ్యాచ్‌లను టీమ్​ ఇండియా ఆడనుంది. ఈ మెగా టోర్నీలో అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో తొలి పోరు జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే దాయాదుల పోరు (ODI World Cup IND vs PAK) అక్టోబర్ 14న నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే.

టీమ్​ఇండియా వరల్డ్​ కప్ జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్య, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్​ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.

Asian Games 2023 Medal List : చైనాకు చేరుకున్న టీమ్ఇండియా.. ఆ ఈవెంట్​లో తొలిసారి భారత్​కు మెడల్​

2023 World Cup Warm Up Matches : శుక్రవారం నుంచి వార్మప్ మ్యాచ్​లు షురూ.. లైవ్ స్ట్రీమింగ్, పూర్తి వివరాలు ఇవే!

Last Updated : Sep 28, 2023, 8:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.