ETV Bharat / sports

అప్పుడు అలా- ఇప్పుడు ఇలా- వరల్డ్​ కప్​నకు ముందు టీమ్ఇండియా జర్నీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 19, 2023, 7:45 AM IST

Team India Journey Before World Cup : మూడోసారి వరల్డ్​ కప్ టైటిల్​ సాధించి చరిత్ర సృష్టించాలని టీమ్ఇండియా ఉవ్విళ్లూరుతోంది. ఫైనల్​లో కంగారూలను చిత్తుచేయాలను ఆరాటపడుతోంది. అయితే టీమ్​ఇండియా ఈ స్థాయికి అంత సులభంగా రాలేదు. గడిచిన ఏడాది కాలంలో భారత జట్టు ఎన్నో అడ్డంకులను దాటింది. జట్టు నిలకడ లేమితో అనేక విమర్శలు ఎదుర్కొంది. గాయాల కారణంగా ప్లేయర్లు దూరమయ్యారు. టీమ్ఇండియా వరల్డ్​ కప్​నట్టుకు సిద్ధమయ్యే నాటికి.. జపై ఆశలు వదులుకోవాలని విశ్లేషణలు వెలువడ్డాయి. ఇలా ఎన్నో సందేహాలు, మరెన్నో అనుమానాల మధ్య వరల్డ్​కప్ ప్రారంభించింది. ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ.. ఫైనల్​కు దూసుకెళ్లింది. ​ఇక ఇప్పటికే 10 మ్యాచ్​లు నెగ్గిన టీమ్ఇండియా.. 11వ మ్యాచ్​లనూ గెలిచి.. మూడోసారి విశ్వ విజేతగా నిలవాలని ఆకాంక్షిస్తోంది.

Team India Journey Before World Cup
Team India Journey Before World Cup

Team India Journey Before World Cup : 2023 వరల్డ్​ కప్​ ఫైనల్​లో ఆస్ట్రేలియాను చిత్తుచేసి ముచ్చటగా మూడోసారి జగజ్జేతగా నిలిచింది టీమ్ఇండియా. ప్రపంచ వేదికపై 140 కోట్ల మంది ఆకాంక్షలను భారత క్రికెట్ జట్టు సగర్వంగా నిలబెట్టింది. ఈ వరల్డ్​ కప్​లో అప్రతిహతంగా దూసుకెళ్లిన టీమ్ఇండియా.. అన్​స్టాపబుల్​గా అన్ని మ్యాచ్​లు గెలించింది. అయితే వరల్డ్​ ప్రారంభానికి ముందు అనిశ్చితిలో ఉన్న టీమ్ఇండియా ఈ స్థాయికి చేరుకోడానికి చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చింది. గతేడాది జరిగిన టీ20 వరల్డ్​ కప్​లో టీమ్ఇండియా సెమీస్​లోనే ఇంటిముఖం పట్టింది.

ఇక ఈ ఏడాది జూన్​లో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్​లోనూ భారత్​కు నిరాశ ఎదురైంది. ఆస్ట్రేలియా చేతిలో 209 పరుగులతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్​లో 444 పరుగులతో బరిలోకి దిగిన భారత్.. 234 పరుగులకే ఆలౌట్​ అయింది. ఈ మ్యాచ్​లో అటు బ్యాటర్లు.. ఇటు బౌలర్లు తేలిపోయారు. ఇక వరల్డ్​ కప్​నకు ముందు టీమ్ఇండియా ఆసియా కప్​ ఫైనల్​లో శ్రీలంకపై విజయం సాధించింది. ఎనిమిదో సారి ఆసియా కప్​ టైటిల్​ను గెలిచి ఔరా అనిపించింది. అయితే భారత్​ కప్పు గెలిచింది కానీ.. తమ జట్టు ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.

డబ్ల్యూటీసీ ఫైనల్​లో తేలిపోయి..!
డబ్ల్యూటీసీ ఫైనల్​లో ఆడిన జట్టు కూర్పు సరిగ్గా లేదు. స్పిన్​కు అనుకూలించే పిచ్​పై ఆడుతున్న మ్యాచ్​లో కనీసం పార్ట్​టైమ్​ స్నిన్నర్​ లేకుండా టీమ్​ఇండియా బరిలోకి దిగింది. బౌలర్లు షమీ, సిరాజ్​ భారీగా పరుగులు సమర్పించారు. ఇక బ్యాటింగ్​లో అజింక్య రహానె మినహా మిగతా వారు తేలిపోయారు. ఫలితం వరుసగా రెండో సారి డబ్ల్యూటీసీ ఫైనల్​లో వెనుదిరగడం. ఇక ఇదే అనిశ్చితితో టీమ్ఇండియా ఈ ఏడాది ఆగస్టులో జరిగిన ఆసియా కప్​నకు సిద్ధమైంది.

ఆసియా కప్​లో అనిశ్చితి!
2023 ఆసియా కప్​ టోర్నీలోనూ జట్టు పట్లు కొంత ఆందోళన. సూపర్ - 4 మ్యాచ్‌లో భీకరమైన పేసర్లు.. దూకుడుగా ఆడే బ్యాటర్లు ఉన్న పాకిస్థాన్​ని అలవోకగా చిత్తు చేశారు. కానీ, మరుసటి రోజు అదే మైదానంలో శ్రీలంకతో మ్యాచ్​.. ఈసారి మాత్రం విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి. చివరగా ఆసియా కప్‌ ఫైనల్‌ చేరింది. ఇక ఫైనల్​లో టీమ్‌ఇండియా బ్యాటింగ్​లో పెద్దగా శ్రమించాల్సిన పనిలేకుండానే కప్పు గెలిచింది.

గతేడాది నుంచి ఆయా జట్లతో ఆడిన, ద్వైపాక్షిక సిరీస్​లు గెలిచినా.. టీమ్​ఇండియా నిలకడలేమితో సతమతమైంది. అదే సమయంలో గాయాలు టీమ్​ఇండియాను వెంటాడాయి. వరల్డ్​ కప్​నకు ముందు గాయంతో జట్టుకు దూరమైన బుమ్రా.. ఈ మెగా టోర్నీ​ ఆడతాడా లేదా అన్న సందేహాలు మొదలయ్యాయి. హార్దిక్​ పాండ్య, షమీ కూడా గాయాలతో ఓ దశలో జట్టుకు దూరమయ్యారు. 2023 వరల్డ్ కప్​ ముంగిట జరిగిన​ ఈ పరిణామాల వల్ల.. భారత్​ మూడోసారి వరల్డ్​ కప్​ కొడుతుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. యువరాజ్​ వంటి మాజీ క్రికెటర్ ఈసారి టీమ్ఇండియా వరల్డ్​ కప్​ గెలవడం కష్టమే అని చెప్పిన సందర్భాలూ ఉన్నాయి.

పడిలేచిన కెరటంలా..!
అయితే చివరకు వరల్డ్​ కప్​ జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయినా జట్టుపై అనిశ్చితి, నిలకడ లేమిపై విమర్శలు, గాయాల నుంచి తిరిగొచ్చిన ప్లేయర్ల రాణిస్తారో లేదో అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ పరిణామాల మధ్య టీమ్ఇండియా.. 2023 అక్టోబర్ 8 ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్​ ఆడింది. ఈ మెగా టోర్నీ మొదటి మ్యాచ్​లోనే టీమ్ఇండియా అదరగొట్టింది ఆస్ట్రేలియాను 6 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. ఇక అప్పుడు మొదలైన ఆట.. వరల్డ్​ ఫైనల్​ వరకూ అప్రతిహతంగా కొనసాగింది. భారత జట్టు రెక్కల గుర్రంలా ఎదురులేకుండా దూసుకెళ్లింది. బ్యాటింగ్​ విఫలమైనప్పుడు బ్యాటర్లు తామున్నాం.. అంటూ మ్యాచ్​ను విజయ తీరాలకు నడిపించారు. బౌలింగ్​ గాడితప్పినప్పుడు బ్యాటర్లు విజృంభించారు. అలా పడిలేచిన కెరటంలో టీమ్ఇండియా మళ్లీ ఫామ్​లోకి వచ్చింది.

అందరూ.. ఎవరికి వారే!
ఈ వరల్డ్​ కప్​లో టీమ్ఇండియా బ్యాటర్లు శుభ్​మన్​ గిల్​, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, విరాట్​ కోహ్లీ తమ అద్భుతమైన ఫామ్​ను కొనసాగించారు. ఆల్​రౌండర్లు రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్​ తమ ఆల్​రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో గాయం కారణంగా మరో ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో వచ్చిన స్టార్ పేసర్ మహ్మద్​ షమీ.. అన్​స్టాపబుల్​ ప్రదర్శన చేశాడు. ఆడిన ఆరు మ్యాచ్​లో మొత్తం 23 వికెట్లు తీసి.. టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్​గా నిలిచాడు. అందులో మూడు సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశాడు.

బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్​ వేస్తూ ప్రత్యర్థులకు చెమటలు పట్టించారు. మహ్మద్​ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్​ సైతం తమ ఫామ్​ను కొనసాగించారు. అలా లీగ్​ స్టేజ్​లో ఆడిన తొమ్మిది మ్యాచ్​ల్లో టీమ్ఇండియా విజయం సాధించింది. ఆ తర్వాత సెమీ ఫైనల్​ న్యూజిలాండ్​పై ఘన విజయం సాధించింది ఫైనల్​లో ప్రవేశించింది. అలా అహ్మదాబాద్​.. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరగనున్న ఫైనల్​లో తలపడుతోంది.

ఫైనల్​ పోరుకు సిద్ధంగా ఉన్నాం- ఆసీస్​ను తక్కువ అంచనా వేయకూడదు : రోహిత్ శర్మ

'టీమ్ఇండియా అన్ని విభాగాల్లో బాగుంది- షమీ మాకు పెద్ద సవాల్!' : ప్యాట్ కమిన్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.