ETV Bharat / sports

'టీమ్ఇండియా అన్ని విభాగాల్లో బాగుంది- షమీ మాకు పెద్ద సవాల్!' : ప్యాట్ కమిన్స్

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 18, 2023, 3:46 PM IST

Updated : Nov 18, 2023, 4:06 PM IST

IND Vs AUS World Cup Final 2023 Cimmins Shami : ఆదివారం భారత్​తో జరగనున్న ఫైనల్​ మ్యాచ్​లో టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్​ షమీ.. తమకు సవాల్​గా మారబోతున్నాడని ఆసీస్​ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. ఈ వరల్డ్​ కప్​లో షమీ ప్రదర్శనను కొనియాడాడు. ఇంకా ఏమన్నాడంటే?

IND Vs AUS World Cup Final 2023 Cummins Shami
IND Vs AUS World Cup Final 2023 Cummins Shami

IND Vs AUS World Cup Final 2023 Cummins Shami : 2023 వరల్డ్ కప్​లో భాగంగా ఆదివారం జరిగే​ ఫైనల్​ సమరంలో భారత్​, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్​కు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు- బీసీసీఐ కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్​ షమీ తమకు సవాలుగా మారే అవకాశం ఉందని ఆసీస్​ కెప్టెన్​ ప్యాట్ కమిన్స్ అన్నాడు. అంతేకాకుండా ఈ వరల్డ్ కప్​లో షమీ చేసిన ప్రదర్శనను కొనియాడాడు. ఈ మేరకు ప్రీ మ్యాచ్​ కాన్ఫరెన్స్​లో కమిన్స్ మాట్లాడాడు.

"టీమ్ఇండియా అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉంది. టోర్నమెంట్​ ప్రారంభంలో ఆడని ఓ ప్లేయర్ ఆ తర్వాత అద్భుత ప్రదర్శన చేశాడు. రైట్​, లెఫ్ట్ ఆర్మ్​ బ్యాటర్లకు షమీ ఒక క్లాస్​ బౌలర్. కాబట్టి అతడు మాకు సవాలు కాబోతున్నాడు. అయితే మా బ్యాటర్లందరూ ఈ బౌలర్లను ఆల్రెడీ ఫేస్​ చేసి మంచి ప్రదర్శన చేశారు. ఇండియా టీమ్​లో ఐదుగురు బౌలర్లు ఉన్నారు. వారు ప్రతి మ్యాచ్​లో 10 ఓవర్ల చొప్పున బౌలింగ్ చేశారు. అందులో ముఖ్యంగా మిడిల్​ ఓవర్లలో స్పన్నర్లు బాగా రాణించారు. ఇక ఎప్పటిలాగే కుల్దీప్, జడేజా నుంచి మాకు కఠినమైన సవాలు ఎదురుకాబోతోంది. వారు (టీమ్​ఇండియా) ఈ వరల్డ్​ కప్​లో ప్రతి గేమ్​ గెలిచి ఆకట్టుకున్నారు"
--పాట్ కమిన్స్​, ఆస్ట్రేలియా కెప్టెన్

Mohammed Shami 5 Wicket Haul : మహ్మద్ షమీ ఈ వరల్డ్​ కప్​లో మొదటి నాలుగు మ్యాచ్​లు ఆడలేదు. అక్టోబర్ 22న ధర్మశాల వేదికగా న్యూజిలాండ్​తో జరిగిన మ్యాచ్​లో మెగా టోర్నీలోకి అడుగుపెట్టాడు. ఆ మ్యాచ్​లో 5 వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన చేశాడు. ఇక అప్పటినుంచి ప్రతి మ్యాచ్​లోనూ తన బంతితో సునామీలు సృష్టించాడు షమీ. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్​ల్లో షమీ మూడు సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. ఐదు మ్యాచ్​ల్లో 23 వికెట్లతో టోర్నమెంట్​లోనే అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్​గా రికార్డు నెలకొల్పాడు.

కోహ్లీని ఊరిస్తున్న మరిన్ని రికార్డులు- సచిన్​ను అధిగమించగలడా?

ఫైనల్ ఫీవర్​- జెర్సీలు ధరించి హోమాలు, క్రికెట్​ గణేశ్​కు పూజలు- భారత్​ గెలవాలని ఫ్యాన్స్​ తీరొక్క మొక్కులు!

Last Updated : Nov 18, 2023, 4:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.