ETV Bharat / sports

ISPL టోర్నీలో హీరోల సై!- 'టీమ్ చెన్నై'తో సూర్య రెడీ

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 27, 2023, 12:30 PM IST

Updated : Dec 27, 2023, 12:58 PM IST

Etv Bharat
Etv Bharat

Suriya ISPL T10 League : కోలీవుడ్ స్టార్ హీరో ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ టీ-10 టోర్నీలో భాగస్వాములయ్యారు. టోర్నీలో 'టీమ్ చెన్నై' జట్టును కొనుగోలు చేసినట్లు ఆయన ట్విట్టర్​ ద్వారా తెలిపారు.

Suriya ISPL T10 League : ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) టీ-10 టోర్నీలో భాగస్వామ్యం అయ్యేందుకు స్టార్ హీరోలు ఆసక్తి కనబరుస్తున్నారు. లోకల్ టాలెంట్​​ను ప్రోత్సహించేందుకు ఇదొక ప్లాట్​ఫామ్​లా ఉపయోగపడుతుందని భావిస్తున్న హీరోలు, టోర్నీలో ఆయా ఫ్రాంజైజీలకు యజమానులుగా మారుతున్నారు. స్టార్ హీరోలు రామ్​చరణ్, అమితాబ్​ బచ్చన్, హృతిక్ రోషన్​ టోర్నీలో ఇప్పటికే ఆయా జట్లను కొనుగోలు చేయగా తాజాగా ఈ లిస్ట్​లో కోలీవుడ్ హీరో సూర్య చేరారు.

హీరో సూర్య ఐఎస్​పీఎల్​ టీ10లో 'టీమ్ చెన్నై' (తమిళనాడు) జట్టును కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ (ట్విట్టర్) ద్వారా తెలిపారు. 'నమస్కారం చెన్నై! ఐఎస్​​పీఎల్ టీ10లో మన టీమ్ చెన్నై జట్టును కొనుగోలు చేశానని తెలియజేస్తున్నా. మనం అందరం కలిసి క్రీడా స్ఫూర్తిని, క్రికెట్ వారసత్వాన్ని క్రియేట్ చేద్దాం' అని ట్వీట్ చేశారు. ఇక లీగ్​లో రిజిస్టర్ చేసుకునేందుకు ఓ లింక్​ను కూడా ఆయన యాడ్ చేశారు.

ఈ టోర్నీలో హీరోలు కొనుగోలు చేసిన జట్లు

  • రామ్​చరణ్- హైదరాబాద్
  • అమితాబ్​ బచ్చన్- ముంబయి
  • హృతిక రోషన్- శ్రీ నగర్
  • సూర్య- చెన్నై

ISPL 2023 : ఈ టోర్నీ తొలి ఎడిషన్ వచ్చే ఏడాది మార్చి 2 నుంచి 9 వరకు జరగనుంది. ఈ టోర్నీలో ఆరు మహానగరాలు హైదరాబాద్, ముంబయి, కోల్​కతా, శ్రీ నగర్, బెంగళూరు, చెన్నై టీమ్​లు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. లీగ్​లో ప్రతీ మ్యాచ్​ 10 ఓవర్ల ఫార్మాట్​లో జరుగుతుంది. ఈ మ్యాచ్​లను టెన్నిస్ బాల్​తో నిర్వహిస్తారు. అయితే టోర్నీలో పాల్గొనాలనుకునే వారు ముందుగా ISPL వెబ్​సైట్​లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత అభ్యర్థులకు ఎంట్రీ పాస్​లు జారీ చేసి, ట్రయల్స్ పోటీలు నిర్వహిస్తారు. ఈ ట్రయల్స్​లో అత్యత్తమ ప్రదర్శన కనబర్చిన ప్లేయర్లు టోర్నీలో ఆడేందుకు అర్హత సాధిస్తారు. ఇక ఈ టోర్నీకి ప్లేయర్ల ఎంపిక మాజీ క్రికెటర్‌ ప్రవీణ్‌ ఆమ్రే నేతృత్వంలో జరగనుంది. టీమ్ఇండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఈ టోర్నీకి మెంటార్​గా వ్యవహరిస్తున్నారు.

తెలుగు కుర్రాళ్లకు గోల్డెన్ ఛాన్స్- చరణ్ క్రికెట్​ టీమ్​లోకి ఆహ్వానం- రిజిస్టర్ చేసుకోండిలా!

గల్లీ క్రికెటర్లకు మహత్తర అవకాశం- మార్చిలో ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్​ లీగ్, ప్లేయర్ల ఎంపిక అప్పుడే!

Last Updated :Dec 27, 2023, 12:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.