ETV Bharat / sports

ఐపీఎల్​లో ఆ జాబితాలోకి నరైన్​.. రెండో విదేశీ ఆటగాడిగా​ రికార్డ్​!

author img

By

Published : Dec 15, 2021, 9:21 PM IST

Sunil Narine KKR: ఐపీఎల్​లో కోల్​కతా నైట్​ రైడర్స్ ఆటగాడు సునీల్ నరైన్ సరికొత్త రికార్డు సాధించాడు. రూ. 100 కోట్లు సంపాదించిన రెండో విదేశీ ఆటగాడిగా నిలిచాడు.

sunil narine
సునీల్ నరైన్

Sunil Narine KKR: వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్, కోల్​కతా నైట్​ రైడర్స్​ ఆటగాడు సునీల్​ నరైన్​ ఐపీఎల్​లో సరికొత్త రికార్డు సాధించాడు. వచ్చే ఏడాది ఐపీఎల్​ సీజన్​తో కలిపి 11 సార్లు కేకేఆర్​ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న నరైన్​.. రూ. 100 కోట్ల శాలరీ మార్క్​ను అందుకున్న రెండో విదేశీ ఆటగాడిగా నిలిచాడు.

ఐపీఎల్​ సీజన్​ 15 నేపథ్యంలో కేకేఆర్ ఫ్రాంఛైజీ​ సునీల్​ నరైన్​ను రిటైన్ చేసుకుంది. అయితే.. ఈ జాబితాను ప్రకటించకముందే.. 10 సీజన్లు కలిపి సునీల్ నరైన్ రూ. 95.6 కోట్ల శాలరీ పొందాడు. వచ్చే సీజన్​ సంపాదన రూ. 6 కోట్లతో కలిపి నరైన్ రూ. 100 కోట్లు పొందిన క్లబ్​లో చేరాడు.

2012లో కేకేఆర్​ తరఫున అరంగేట్రం చేసిన నరైన్​ 134 మ్యాచ్​లు ఆడాడు. 143 వికెట్లు తీశాడు. 958 పరుగులు చేసి అనేక సందర్భాల్లో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

తొలి ప్లేయర్ ఏబీనే..

ఐపీఎల్​లో రూ. 100 కోట్లు సంపాదించిన తొలి విదేశీ ప్లేయర్​గా దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్​మన్ ఏబీ డివిలియర్స్​ రికార్డు సృష్టించాడు.

ఐదుగురే..

ఐపీఎల్​లో అత్యధికంగా సంపాదించిన వారిలో నరైన్​ కంటే ముందు ఐదుగురు ఆటగాళ్లే ఉన్నారు.

  1. మహేంద్ర సింగ్ ధోనీ- సీఎస్కే- రూ. 152.8 కోట్లు
  2. రోహిత్ శర్మ- ముంబయి ఇండియన్స్ - రూ. 146.6 కోట్లు
  3. విరాట్ కోహ్లీ- ఆర్సీబీ - రూ. 143.2 కోట్లు
  4. సురేశ్ రైనా- సీఎస్కే - రూ. 110 కోట్లు
  5. ఏబీ డివిలియర్స్ - ఆర్సీబీ - రూ. 102 కోట్లు.

కేకేఆర్​ రిటెన్షన్ ప్లేయర్స్..

మెగా వేలానికి ముందు జరిగిన రిటెన్షన్ ప్రక్రియలో కేకేఆర్​ నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. సునీల్ నరైన్, ఆండ్రూ రసెల్, వరుణ్ చక్రవర్తి, వెంకటేష్ అయ్యర్​ను అట్టిపెట్టుకుంది.

ఇదీ చదవండి:

'డర్టీ పాలిటిక్స్'.. బీసీసీఐపై అభిమానుల ఆగ్రహం

'సరైన సమాచారం లేకుండా కెప్టెన్సీ నుంచి తొలగించారు'

ముదురుతున్న టీమ్​ఇండియా వన్డే కెప్టెన్సీ వ్యవహారం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.