ETV Bharat / sports

ICC Rankings: శ్రేయస్​ 8 స్థానాలు పైకి.. టాప్​-10లో లేని కోహ్లీ

author img

By

Published : Mar 2, 2022, 4:05 PM IST

Updated : Mar 2, 2022, 4:31 PM IST

icc rankings
ఐసీసీ ర్యాకింగ్స్

ICC RANKINGS: ఐసీసీ తాజాగా టీ20,టెస్ట్​, వన్డే ర్యాకింగ్స్​ను విడుదల చేసింది. భారత బ్యాటర్​ శ్రేయస్​ అయ్యర్​ 8 స్థానాలు మెరుగపడగా.. మాజీ కెప్టెన్ విరాట్​ కోహ్లీ 5 స్థానాలు కోల్పోయి 15వ స్థానంలో స్థిరపడ్డాడు.

ICC RANKINGS: భారత బ్యాటర్​ శ్రేయస్​ అయ్యర్​ ఐసీసీ టీ20 ర్యాకింగ్స్​లో దూసుకుపోయాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన జాబితాలో 8 స్థానాలు ఎగబాకి 18వ స్థానం సంపాదించుకున్నాడు. మాజీ కెప్టెన్​ విరాట్ కోహ్లీకి టాప్​ 10లో కూడా చోటు దక్కలేదు.​ శ్రీలంకతో సిరీస్ విశ్రాంతి తీసుకున్న కోహ్లీ 5 స్థానాలు పడిపోయి 15వ స్థానంలో ఉన్నాడు.

t20 batting rankings
టీ20 బ్యాటింగ్​ ర్యాకింగ్స్​

శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్​లో అయ్యర్​ అద్భతమైన ప్రదర్శన చేయడం వల్ల మెరుగైన స్థానానికి చేరుకున్నాడు. భారత్​ ఈ సిరీస్​ను 3-0 తేడాతో గెలిచింది. అయ్యర్ 3 మ్యాచుల్లో 174 స్ట్రైక్​ రేట్​తో 204 పరుగులు సాధించాడు.

శ్రీలంక ఆటగాడు పాతుమ్​ నిస్సాంక 9వ స్థానాన్ని సంపాదించాడు. ఇండియాతో జరిగిన రెండో మ్యాచ్​లో 75 పరుగులు చేశాడు. యుఏఈ ఆటగాడు మహ్మద్ వసీమ్​ 12వ స్థానంలో నిలిచాడు. ఆ దేశం తరఫున టీ20ల్లో అత్యుత్తమ ర్యాంక్​ను సాధించాడు. అంతకుముందు శమీన్​ అన్వర్ 2017లో 13 ర్యాంకు సాధించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్​ క్వాలిఫైయర్​లో భాగంగా ఐర్లాండ్​తో మ్యాచ్​లో అజేయమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. ​ శ్రీలంక పేసర్​ లహిరు కుమార ఇండియాతో సిరీస్​లో 5 వికెట్లు సాధించి తొలిసారిగా టాప్​ 40లోకి ఎంట్రీ ఇచ్చాడు.

టెస్టు ర్యాంకుల్లో రబాడ పైకి..

టెస్ట్​ ర్యాకింగ్స్​లో దక్షిణాఫ్రికా బౌలర్​ కగిసో రబడ మూడో స్థానానికి ఎగబాకాడు. న్యూజిలాండ్​తో 2 మ్యాచ్​ల సిరీస్​లో 5/60 అద్భుత ప్రదర్శనతో పాటు 10 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. కివీస్​ ద్వయం కైల్​ జేమిసన్​, టిమ్​ సౌథీలు తమ స్థానాలను కోల్పోయారు. జేమిసన్​ రెండు స్థానాలు జారి 5 స్థానంలో, టిమ్​ సౌథీ ఒక స్థానం కోల్పోయి 6 స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా కెప్టెన్​ పాట్​ కమిన్స్​ అగ్రస్థానంలో, భారత స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. బ్యాటింగ్​ జాబితాలో మార్నస్​ లబుషేన్ అగ్రస్థానంలో ఉన్నాడు.

test bowling rankings
టెస్ట్​ బౌలింగ్​ ర్యాకింగ్స్​

టాప్​లోనే బాబర్​..

వన్డే ర్యాకింగ్స్​లో బ్యాటర్ల జాబితాలో పాకిస్థాన్​ ఆటగాడు బాబర్​ అజామ్​, బౌలర్ల జాబితాలో న్యూజిలాండ్​ పేసర్​ ట్రెంట్​ బౌల్ట్​ ప్రథమ స్థానంలో కొనసాగుతున్నారు.

odi bowling rankings
వన్డే బౌలింగ్​ ర్యాకింగ్స్​

ఇదీ చదవండి: నాలుగేళ్ల తర్వాత ఐర్లాండ్ టూర్​కు టీమ్​ఇండియా రోహిత్, కోహ్లీ దూరం!

Last Updated :Mar 2, 2022, 4:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.