ETV Bharat / sports

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న గబ్బర్​.. ప్రముఖ బాలీవుడ్ బ్యానర్​లో!

author img

By

Published : May 17, 2022, 1:09 PM IST

Shikhar Dhawan: టీమ్​ఇండియా ఓపెనర్​ శిఖర్ ధావన్ కొత్త వృత్తిలోకి అడుగుపెడుతున్నాడు. ప్రముఖ బాలీవుడ్​ బ్యానర్​లో నటుడిగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ కూడా ఇప్పటికే పూర్తయిందని సమాచారం.

shikhar-dhawan
సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న గబ్బర్

Shikhar Dhawan Acting Debut: క్రికెట్​ మైదానంలో ఫోర్లు, సిక్సర్లు బాది అభిమానులను అలరిస్తున్న టీమ్ఇండియా ఓపెనర్​ శిఖర్ ధావన్.. త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఓ ప్రముఖ బాలీవుడ్ బ్యానర్ రూపొందిస్తున్న​ చిత్రంలో ధావన్ కీలక పాత్ర పోషిస్తున్నారట. ఇందుకు సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయిందట. ఇది పూర్తి స్థాయి పాత్ర అని, గెస్ట్ రోల్​ కాదని తెలుస్తోంది. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల అవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ చిత్రం పేరు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

shikhar-dhawan
సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న గబ్బర్

Shikhar Dhawan News: శిఖర్ ధావన్​ గతేడాది అక్టోబర్​లో అక్షయ్​ కుమార్​, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న రామసేతు సినిమా సెట్​లో కన్పించాడు. అయితే ధావన్ నటిస్తున్నది ఈ సినిమాలో కాదని తెలుస్తోంది. అక్షయ్​ కుమార్​, ధావన్ మంచి స్నేహితులు. సరదాగా షూటింగ్ చూసేందుకే ధావన్ రామసేతు సెట్​కి వెళ్లినట్లు సమాచారం. అంతేకాదు బాలీవుడ్ స్టార్​ హీరో రణ్​వీర్​ సింగ్​తోనూ ధావన్​కు సన్నిహిత సంబంధాలున్నాయి. గతేడాది డిసెంబర్​లో రణ్​వీర్​ను కలిసిన ఫొటోను షేర్ చేశాడు ధావన్. చాలా కాలం తర్వాత కలవడం ఆనందంగా ఉందన్నాడు. అప్పుడు విడుదలైన '83' సినిమా అద్భుతంగా ఉందని, సినిమా హిట్ అయినందుకు రణ్​వీర్​కు అభినందనలు తెలిపాడు.

shikhar-dhawan
సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న గబ్బర్

Shikhar Dhawan Bollywood: శిఖర్ ధావన్ ప్రస్తతం ఐపీఎల్​లో పంజాబ్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ అదరగొడుతున్నాడు. ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తిస్తున్నాడు. మైదానంలోనే కాదు సోషల్ మీడియాలనో ధావన్ చురుగ్గా ఉంటాడు. ఇన్​స్టాగ్రాంలో సరదా రీల్స్​తో అభిమానులను తరచూ అలరిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు వెండితెరపై తన నటనలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. మరి యాక్టర్​గా ధావన్​ ఏమేరకు రాణిస్తాడో చూడాలి.

shikhar-dhawan
సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న గబ్బర్

ఇదీ చదవండి: ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోర్లు ఇవే.. నాలుగు సార్లు ఆ జట్టే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.