ETV Bharat / sports

TeamIndia: ఇంగ్లాండ్​ పర్యటనకు షా, పడిక్కల్​ నో

author img

By

Published : Jul 7, 2021, 11:01 PM IST

గాయపడిన ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌(Subhaman Gill) స్థానంలో.. పృథ్వీ షా, దేవదత్​ పడిక్కల్​ను(Devadutt Padikkal, Prithvi shah) ఇంగ్లాండ్​కు పంపించేది లేదని స్పష్టం చేశారు ఓ బీసీసీఐ అధికారి. వారు శ్రీలంక సిరీసే ఆడతారని తెలిపారు.

shah
షా

ఇంగ్లాండ్‌ పర్యటనలో గాయపడిన యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌(Subhaman Gill) స్థానంలో.. శ్రీలంక పర్యటనలో ఉన్న పృథ్వీ షా, దేవదత్​ పడిక్కల్​ను(Devadutt Padikkal, Prithvi shah) పంపించనున్నారంటూ కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు ఈ విషయమై బీసీసీఐ(BCCI), సెలక్షన్​ కమిటీ(Selection committee), జట్టు యాజమాన్యం(Team management) మధ్య సఖ్యత కనిపించట్లేదని అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన ఓ బీసీసీఐ అధికారి.. షా, పడిక్కల్​ను ఇంగ్లాండ్​కు పంపించట్లేదని స్పష్టం చేశారు. వారిద్దరూ శ్రీలంక సిరీస్​ ఆడతారని తెలిపారు.

"పృథ్వీ షా శ్రీలంకలోనే ఉండి ఆరు మ్యాచ్​ల సిరీస్​ను ఆడతాడు. అతడిని ఆ సిరీస్​ కోసమే ఎంపిక చేశాం. అతడు తన కమిట్​మెంట్​ను పూర్తి చేస్తాడు. శ్రీలంక పర్యటన ముగిసిన తర్వాత ఏమైన అవకాశాలు ఉంటే పరిశీలిస్తాం. ప్రస్తుతమైతే ఏ ఆలోచన లేదు." అని సదరు అధికారి అన్నారు.

గిల్​ గాయపడిన తర్వాత తమకు ఇద్దరు ఓపెనర్లు కావాలని టీమ్ ​మేనేజ్​మెంట్​.. సెలక్షన్​ కమిటీకి విజ్ఞప్తి చేసింది. అయితే ఈ ప్రతిపాదనను చేతన్‌ శర్మ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ తిరస్కరించిందని తెలిసింది. ఇప్పటికే అక్కడ అభిమన్యు ఈశ్వరన్‌, కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌ ఉండగా మరో ఇద్దరు ఎందుకన్న ఉద్దేశంలో విజ్ఞప్తిని పట్టించుకోలేదని క్రికెట్​ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఇంగ్లాండ్​ సిరీస్​కు అభిమన్యు ఈశ్వరన్​ను ఎంపిక చేయడంపై విమర్శలు వచ్చాయి. దీనిపై మాట్లాడిన సదరు అధికారి.. ఈశ్వరన్​ ​అనుకున్న స్థాయిలో రాణిస్తాడనే నమ్మకం లేక ఇద్దరు ఓపెనర్లను కోరినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: Teamindia: ద్రవిడ్​ అసహనం.. కోహ్లీసేన అసంతృప్తి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.