ETV Bharat / sports

ఇర్ఫాన్​ పఠాన్ కుమారుడితో సచిన్​ కన్వర్సేషన్​.. వీడియో వైరల్​

author img

By

Published : Oct 1, 2022, 3:54 PM IST

టీమ్​ఇండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్​.. మరో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కుమారుడితో మాట్లాడిన మాటలు సోషల్​మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు సచిన్ ఏం మాట్లాడడంటే?

irfan pathan sachin
ఇర్ఫాన్​ పఠాన్​ కుమారుడితో సచిన్​

రోడ్‌సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌-2022లో భాగంగా జరిగిన సెమీ ఫైనల్లో అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు టీమ్​ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌. ఈ లీగ్‌లో ఇండియా లెజెండ్స్‌ తరఫున బరిలోకి దిగిన ఇర్ఫాన్‌.. కీలక మ్యాచ్‌లో రాణించి జట్టును ఫైనల్‌లో చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే దీనిపై లెజెండ్స్​ కెప్టెన్​ సచిన్​.. ఇర్ఫాన్​పై ప్రశంసలు కురిపించాడు. అలాగే ఇర్ఫాన్ కుమారుడిని ముద్దాడుతూ సరదాగా గడిపాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్​మీడియాలో వైరల్​ అవుతోంది.

మీ నాన్న వల్లే గెలిచాం.. 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా లెజెండ్స్‌పై గెలుపొంది ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్‌ పఠాన్‌ షేర్‌ చేసిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో సచిన్‌.. ఇర్ఫాన్‌ కుమారుడు ఇమ్రాన్‌తో సరదాగా ముచ్చటిస్తూ.. "మేము ఈరోజు మ్యాచ్‌ ఎలా గెలిచామో తెలుసా? ఆయనెవరో తెలుసు కదా! ఆయన టప్‌ టప్‌మని సిక్స్‌లు కొట్టాడు. అలా మేము గెలిచాం" అంటూ బుడ్డోడిని ముద్దు చేశాడు. ఈ వీడియో సచిన్‌ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. లెజెండ్‌ .. చిన్న పిల్లలతో కూడా బాగా కలిసిపోతారు. ముద్దు చేయడంలో ముందుంటారు అని సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

ఇక సెమీఫైనల్​ మ్యాచ్​లో ఓపెనర్‌ నమన్‌ ఓజా 90 పరుగులతో అజేయంగా నిలవగా.. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఇర్ఫాన్‌ పఠాన్‌ ఆఖర్లో మెరుపులు మెరిపించాడు. 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 308కి పైగా స్ట్రైక్‌రేటుతో 37 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్‌ కారణంగా సచిన్‌ టెండుల్కర్‌ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్‌ మరో నాలుగు బంతులు ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఇక ఫైనల్​ మ్యాచ్​ మరి కొన్ని గంటల్లో ప్రారంభంకానుంది.

ఇదీ చూడండి: 'వరల్డ్​కప్​నకు ఇంకా సమయం ఉంది.. బుమ్రా జట్టుకు దూరం కాలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.