ETV Bharat / sports

MI పై రోహిత్ ఎఫెక్ట్!- గంటలో 4లక్షల మంది అన్​ఫాలో- సూర్య హార్ట్​ బ్రేక్ స్టోరీ

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 16, 2023, 11:01 AM IST

Updated : Dec 16, 2023, 11:49 AM IST

Rohit Effect On MI Instagram Account
Rohit Effect On MI Instagram Account

Rohit Effect On MI Instagram Account : ముంబయి ఫ్రాంచైజీ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యను కెప్టెన్​గా ప్రకటించిన తర్వాత, గంటల వ్యవధిలోనే ఎమ్​ఐ (MI) సోషల్ మీడియాలో 4 లక్షల ఫాలోవర్లను కోల్పోయింది. ఈ నిర్ణయాన్ని రోహిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వ్యతిరేకిస్తున్నారు.

Rohit Effect On MI Instagram Account : ముంబయి ఇండియన్స్​ ​కెప్టెన్ బాధ్యతల నుంచి రోహిత్​ శర్మను తప్పించడం, హిట్​మ్యాన్​ ఫ్యాన్స్​తోపాటు, ఎమ్​ఐ (MI) అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో రాత్రికి రాత్రే దాదాపు 4 లక్షల మంది రోహిత్ ఫ్యాన్స్, ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) అధికారిక సోషల్ మీడియా అకౌంట్​ను అన్​ఫాలో కొట్టేశారు. ​అయితే ఫ్రాంచైజీ, రోహిత్​తో సంప్రదించే ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని ఉంటుందని పలువురు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ జట్టుకు 5 టైటిళ్లు అందించిన సక్సెస్​ఫుల్ కెప్టెన్​కు దక్కాల్సిన గౌరవం ఇది కాదంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అసహనం వ్యక్తపరుస్తున్నారు. వారు ఫ్రాంచైజీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాగా, తాజా పరిణామంతో చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ఫ్రాంచైజీగా నిలిచింది. ఇంతకాలం ముంబయి టాప్​లో ఉండేది.

  • From 13.2 M to 13 M
    Lost 2 Lakh On Instagram

    From 8.6 M to 8.2 M
    Lost 400k on Twitter

    Whatever Mumbai Indians is today is because of Rohit, he has been the face of Rohit, without Rohit MI is nothing.

    Well done Rohitians, keep showing the level this Mc MI. #ShameOnMI pic.twitter.com/Ei7OZ1n5Rv

    — Jyran (@Jyran45) December 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మరోవైపు హార్దిక్​ పాండ్యను కెప్టెన్​గా ప్రకటించిన తర్వాత ముంబయి ఇండియన్స్, తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్​లో రోహిత్​కు సానుకూలంగా ఓ వీడియో పోస్ట్ చేసింది. '2013లో నువ్వు నాయకత్వ బాధ్యతలు తీసుకొని నాపై నమ్మకం ఉంచమని కోరావు. గెలుపు, ఓటముల్లో ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలన్నావు. ఈ పదేళ్లలో ఆరు టోఫ్రీలు (5 ఐపీఎల్​, 1 ఛాంపియన్స్​ లీగ్) అందించావు. ఎప్పటికీ నువ్వు మా కెప్టెన్​వే. ముంబయి ఇండియన్స్ ​పై నీ ముద్ర చెరగనిది. థాంక్యూ, కెప్టెన్ రోహిత్. ముంబయి కా రాజా' అంటూ ఎమోషనల్​గా రాసుకొచ్చింది.

సూర్య హార్ట్ బ్రేక్ : ఇదిలా ఉండగా టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తాజాగా 'హార్ట్ బ్రేక్' ఇమేజ్ ఇన్​స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. రోహిత్​ను కెప్టెన్సీ నుంచి తప్పించినందుకే సూర్య ఇలా రియాక్ట్ అయ్యాడని ఫ్యాన్స్ అంటున్నారు. కాగా, గతనెల హార్దిక్​ను ముంబయి ట్రేడ్ చేసుకున్నాక జస్ప్రీత్ బుమ్రా 'సైలెన్స్' అని ఇన్​స్టా స్టోరీ పోస్ట్ చేశాడు. బహుషా ఇలా జరుగుతుందని బుమ్రా అప్పుడే ఊహించాడా అని చర్చ నడుస్తోంది.

ఓ శకం ముగిసింది !: ముంబయి నిర్ణయం పట్ల ఫ్యాన్స్ తీవ్ర అంసతృప్తి వ్యక్తపరుస్తున్నారు. 'నేను ముంబయి ఫ్యాన్​గా రిటైరయ్యాను' అని ఓ నెటిజన్ అనగా, 'ఇది అస్సలు ఊహించలేనిది' అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇక ఐపీఎల్​ హిస్టరీలో రోహిత్ అనే సక్సెస్​ఫుల్​ కెప్టెన్ శకం ముగిందని ఓ ఫ్యాన్ పోస్ట్ చేశాడు.

'ముంబయిపై నీ ముద్ర చెరగనిది- ఎప్పటికీ నువ్వే మా కెప్టెన్​'

ముంబయి ఫ్రాంచైజీ సంచలన నిర్ణయం- MI కెప్టెన్​గా హార్దిక్ పాండ్య

Last Updated :Dec 16, 2023, 11:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.