ETV Bharat / sports

కామెంట్రీ బాక్స్​లోకి రవిశాస్త్రి రిటర్న్.. రైనా అరంగేట్రం...

author img

By

Published : Mar 22, 2022, 6:39 PM IST

IPL 2022: ఈసారి ఐపీఎల్​లో సురేశ్ రైనా ఆటను చూడలేకపోయినప్పటికీ.. అతడిని టీవీలో వీక్షించొచ్చు. అతడి మాటలను వినొచ్చు. వేలంలో అన్​సోల్డ్ ప్లేయర్​గా మిగిలిపోయిన అతడు.. ఐపీఎల్​ వ్యాఖ్యాతగా మారనున్నాడు. మాజీ కోచ్ రవిశాస్త్రి సైతం కామెంట్రీ బాక్స్​లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

Ravi Shastri and Suresh Raina
Ravi Shastri and Suresh Raina

Suresh Raina IPL commentary: టీవీలలో రవిశాస్త్రి కామెంట్రీ మళ్లీ వినిపించనుంది. ఈ ఐపీఎల్ సీజన్​లో హిందీ కామెంట్రీ ప్యానెల్​లో రవిశాస్త్రి పేరు ఖరారైంది. ఐపీఎల్ ప్రసారదారు స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసిన వివరాల్లో ఈ విషయం స్పష్టమైంది. శాస్త్రితో పాటు సురేశ్ రైనా సైతం.. ఆటను తన మాటలతో వివరించనున్నాడు. ఐపీఎల్​లో అన్​సోల్డ్ ప్లేయర్​గా మిగిలిపోయిన రైనాకు.. కామెంట్రీ డెబ్యూ ఇదే కానుండటం విశేషం. హిందీ కామెంట్రీకి అతడిని ఎంపిక చేసుకుంది స్టార్ స్పోర్ట్స్.

Ravi Shastri IPL commentary

ఇండియన్ క్రికెట్ టీమ్ కోచ్​ పదవి నుంచి దిగిపోయాక.. రవిశాస్త్రి కామెంట్రీ వినాలని చాలా మంది అభిమానులు ఆశించారు. ఇన్ని రోజుల తర్వాత మళ్లీ అతడు కామెంట్రీ చెప్పనుండటంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక రైనా లేని ఐపీఎల్​ను జీర్ణించుకోలేకపోతున్న అతడి అభిమానులు.. కనీసం కామెంటర్​గానైనా టీవీలో చూసుకోవచ్చని అనుకుంటున్నారు. వీరిద్దరితో పాటు మాజీ క్రికెటర్లు, వ్యాఖ్యాతలు ఆకాశ్ చోప్రా, పార్థివ్ పటేల్, నిఖిల్ చోప్రా, ఇర్ఫాన్ పఠాన్​లు హిందీ కామెంట్రీ ప్యానెల్​లో ఉన్నారు.

ఇంగ్లిష్ కామెంట్రీలో సైతం పలువురు దిగ్గజాలు ఉన్నారు. లిటిల్ మాస్టర్ సునీల్ గావస్కర్, హైదరాబాదీ లెజెండ్ వీవీఎస్ లక్ష్మణ్, ఇయాన్ బిషప్, హర్ష భోగ్లే, మాథ్యూ హేడెన్​లు ఇంగ్లిష్​ కామెంట్రీతో అభిమానులను అలరించనున్నారు. లక్ష్మణ్ శివరామకృష్ణన్, మురళీ కార్తిక్, కెవిన్ పీటర్సన్ వంటి ప్రముఖులు సైతం ఇంగ్లిష్ ప్యానెల్​లో ఉన్నారు.

ఇదీ చదవండి: IPL 2022: ఫ్యాన్స్ సంగతేంటి? ఎంత మందిని అనుమతిస్తారు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.