ETV Bharat / sports

'కష్టకాలంలో భారత్​కు అండగా యావత్​ అఫ్గాన్'

author img

By

Published : Apr 30, 2021, 3:35 PM IST

కొవిడ్​తో పోరాడుతున్న భారత దేశానికి మద్దతు ప్రకటించాడు అఫ్గానిస్థాన్ క్రికెటర్​ రషీద్ ఖాన్. యావత్​ అఫ్గానిస్థాన్​ భారత్​కు అండగా ఉంటుందని తెలిపాడు.

Rashid Khan, Afghanistan cricketer
రషీద్ ఖాన్, అఫ్గానిస్థాన్ క్రికెటర్

కొవిడ్​తో అల్లాడుతున్న భారత్​కు పలువురు క్రికెటర్లు మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెటర్లు కమిన్స్​, బ్రెట్​ లీ, సచిన్ తెందుల్కర్​ తమ వంతుగా సాయం ప్రకటించగా.. తాజాగా అఫ్గానిస్థాన్​ బౌలర్​ రషీద్​ ఖాన్​ కూడా ఈ జాబితాలో చేరాడు. భారత్​కు మద్దతు ప్రకటిస్తూ ఉన్న ఓ వీడియోను ట్వీట్​ చేశాడు. ప్రస్తుత ఐపీఎల్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు రషీద్​.

"ఈ కష్ట సమయంలో అఫ్గానిస్థాన్​లోని ప్రతి కుటుంబం భారత్​కు మద్దతుగా ఉంటుంది. దయచేసి అందరూ సురక్షితంగా ఉండండి. సామాజిక దూరం పాటించండి. తప్పనిసరిగా మాస్క్​ ధరించండి."

-రషీద్ ఖాన్, అఫ్గానిస్థాన్​ క్రికెటర్​.

కరోనాతో పోరాడుతున్న భారత్​కు ఆసీస్​ క్రికెటర్లు పాట్ కమిన్స్​ రూ.37.36 లక్షలు, బ్రెట్​ లీ ఒక బిట్​ కాయిన్​, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ ఒక కోటి రూపాయలు విరాళమిచ్చారు. దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లోని ఆక్సిజన్​ సరఫరా కోసం ఈ మొత్తాలను ఉపయోగించాలని వారు కోరారు.

ఇవీ చదవండి: కరోనా బాధితుల కోసం ఐపీఎల్ జీతమిచ్చేసిన క్రికెటర్

ఈ విజయాన్ని వారికి అంకితమిస్తున్నా: పంత్​

ఐపీఎల్​ ఫ్రాంఛైజీ కోల్​కతా నైట్ రైడర్స్​ కూడా తమ వంతుగా సాయం ప్రకటించింది. రాజస్థాన్ రాయల్స్​, దిల్లీ క్యాపిటల్స్​ కూడా ఇదే బాటలో నడిచాయి.

ఇవీ చదవండి: 'పీఎం కేర్స్​'కు ఆసీస్​ పేసర్​ కమిన్స్ విరాళం

బ్రెట్​ లీ దాతృత్వం- భారత్​కు బిట్​కాయిన్ సాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.