ETV Bharat / sports

'ఇప్పటికైనా గుర్తించినందుకు థ్యాంక్యూ.. నేనేంటో చూపిస్తా'

author img

By

Published : May 23, 2022, 6:40 PM IST

pujara england test
పుజారా ఇంగ్లాండ్​ టెస్టు

Pujara england test: తన ప్రదర్శనను గుర్తించి ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌కు ఎంపిక చేసిన సెలక్షన్​ కమిటీకి ధన్యవాదాలు తెలిపాడు టెస్టు స్పెషలిస్ట్​ బ్యాటర్​ ఛెతేశ్వర్​ పుజారా. ఈ మ్యాచ్​లో బాగా ఆడేందుకు కృషి చేస్తానని చెప్పాడు.

Pujara england test: టీమ్‌ఇండియా టెస్టు స్పెషలిస్టు బ్యాటర్​ ఛెతేశ్వర్‌ పుజారా ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌కు ఎంపికైనందుకు సంతోషం వ్యక్తం చేశాడు. గత కొంత కాలంగా ఫామ్‌లో లేని అతడిని సెలెక్షన్‌ కమిటీ ఈ ఏడాది మార్చిలో శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో పక్కన పెట్టింది. అయితే, తర్వాత భారత్‌లో టీ20 లీగ్‌ జరుగుతున్న సమయంలోనే పుజారా ఇంగ్లాండ్‌లోని కౌంటీ క్రికెట్‌లో పాల్గొన్నాడు. ససెక్స్‌ టీమ్‌ తరఫున అక్కడ నాలుగు మ్యాచ్‌ల్లో రెండు ద్వితశకాలు, రెండు శతకాలు బాది అందరి దృష్టినీ ఆకర్షించాడు. దీంతో తిరిగి లయ అందుకున్న అతడిని సెలెక్షన్‌ కమిటీ ఆదివారం ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌కు ఎంపిక చేసింది.

ఈ నేపథ్యంలోనే ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన పుజారా.. "జులైలో ఇంగ్లాండ్‌తో జరిగే ఏకైక టెస్టుకు నన్ను ఎంపిక చేయడం బాగుంది. కౌంటీ క్రికెట్‌లో నా ప్రదర్శనను గుర్తించినందుకు సంతోషం. అక్కడ బరిలోకి దిగి మైదానంలో పరుగులు చేయడం ద్వారా.. అది ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌కు ముందు నన్ను మంచి స్థితిలో ఉంచుతుందనే నమ్మకంతో ఉన్నా. ఎప్పటిలాగే ఈసారి కూడా మంచి ప్రాక్టీస్‌తో ముందుకు సాగి జట్టు విజయానికి కృష్టి చేయాలనుకుంటున్నా" అని పుజారా పేర్కొన్నాడు. కాగా, గతేడాది ఇంగ్లాండ్‌ పర్యటనలో టీమ్‌ఇండియా కరోనా కేసుల కారణంగా చివరి టెస్టు ఆడలేకపోయింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 2-1 ఆధిక్యంలో నిలిచింది. అప్పుడు వాయిదా పడిన మ్యాచ్‌ను ఈ ఏడాది జులై 1 నుంచి 5 వరకు నిర్వహించేందుకు రెండు జట్ల బోర్డులు అంగీకరించాయి.

ఇదీ చూడండి: జాతీయ జట్టులోకి ఉమ్రాన్​.. పుజారా, హార్దిక్​ రిటర్న్​.. కెప్టెన్​గా రాహుల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.