ETV Bharat / sports

బాబర్​​ అజామ్​ సూపర్ రికార్డు.. కానీ అతడిపై సహచర క్రికెటర్​ ఫైర్​!

author img

By

Published : Jun 11, 2022, 10:57 AM IST

పాకిస్థాన్​ కెప్టెన్​ బాబర్ అజామ్​ ఏ క్రికెటర్​కు సాధ్యం కాని ఓ రికార్డు సాధించాడు. మరోవైపు అతను చేసిన ఓ తప్పిదంతో విమర్శలకు గురయ్యాడు. అదేంటంటే..

babar azam
బాబర్​ అజామ్​

pak captain babar azam record: పాకిస్థాన్​ కెప్టెన్​ బాబర్ అజామ్​ అరుదైన రికార్డు సాధించాడు. వెస్టిండీస్​తో జరిగిన రెండో వన్డేలో 93 బంతుల్లో 77 పరుగులు చేశాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్​లో బాబర్​కు ఇది వరుసగా 9వ ఫిఫ్టీ ప్లస్​ స్కోరు కావడం విశేషం. గతంలో ఏ ఇతర బ్యాటర్​కు సాధ్యం కాని రికార్డు ఇది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో 196 రన్స్​ చేయడంతో బాబర్​ ఫిఫ్టీ ప్లస్ స్కోరు పరంపర మొదలైంది. ఆ తర్వాత మూడు, నాలుగో టెస్టు మ్యాచ్​ల్లో వరుసగా 66,55.. అనంతరం మూడు వన్డేల సిరీస్​లో 57,114,105*, ఓ టీ20 మ్యాచ్​లో 66 స్కోర్లలో ఆ సిరీస్​ ముగించాడు. ఇక ఇప్పుడు వెస్టిండీస్​తో జరుగుతున్న సిరీస్​లో భాగంగా తొలి రెండు వన్డేల్లో సెంచరీ, 77 రన్స్​ చేయడం విశేషం. ఈ క్రమంలోనే వన్డేల్లో కెప్టెన్​గా కేవలం 13 ఇన్నింగ్స్​లోనే వెయ్యి రన్స్​ చేసిన అరుదైన ఘనతను బాబర్​ సొంతం చేసుకున్నాడు. కాగా, కోహ్లీకి ఈ ఫీట్​ అందుకోవడానికి 17 ఇన్నింగ్స్​ పట్టడం గమనార్హం.

Imam ul haq run out: మరోవైపు ఈ రెండో మ్యాచ్​లో మిస్​కమ్యూనికేషన్​ ద్వారా ఓ తప్పిదం జరిగింది. కెప్టెన్​ బాబర్​ చేసిన చిన్న పొరపాటు వల్ల పాక్​ జట్టులోని మరో ప్లేయర్​ ఇమామ్​ ఉల్​ హక్​ రనౌట్​గా వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో ఇమామ్​ బ్యాట్​ను నేలకేసి బాది కోపంగా మైదానం నుంచి బయటకు వెళ్లాడు.

17 పరుగుల వద్ద ఫకర్​ జమాన్​ ఔటైన్​ తర్వాత బాబర్​ క్రీజులోకి వచ్చాడు. మరో ఓపెనర్​ ఇమామ్​తో కలిసి ఇన్నింగ్స్​ను నడిపించాడు. ఇద్దరి మధ్య రెండో వికెట్​కు 120 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. ఈ క్రమంలోనే బాబర్​ చేసిన చిన్న తప్పు వికెట్ పడేలా చేసింది. ఇన్నింగ్స్​ 28వ ఓవర్​లో అకీల్​ హొసేన్​ బౌలింగ్​కు​ రాగా.. ఇమామ్​ హక్​ మిడ్​వికెట్​ దిశగా ఆడి సింగిల్​కు ప్రయత్నించాడు. అయితే బంతి ఎక్కువ దూరం వెళ్లకపోవడం వల్ల బాబర్​ పరుగు తీయలేదు. అయితే అప్పటికే ఇమామ్​ సగం క్రీజు దాటి నాన్​స్ట్రైకర్​ ఎండ్​కు వచ్చేశాడు. బాబర్​ పిలుపుతో వెనక్కి వెళ్లినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బంతి అందుకున్న షై​ హోప్​ వికెట్లను గిరాటేయడం వల్ల ఇమామ్​ 72 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. దీంతో అతడు కోపంతో బ్యాట్​ కింద్​ కొట్టుకుంటూ మైదానం నుంచి వీడాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్​గా మారింది.

ఇదీ చూడండి: 'పంత్ ప్రమాదకరం.. కోహ్లీకి మంచి రోజులొస్తాయ్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.