ETV Bharat / sports

'పంత్ ప్రమాదకరం.. కోహ్లీకి మంచి రోజులొస్తాయ్​'

author img

By

Published : Jun 11, 2022, 7:51 AM IST

Updated : Jun 11, 2022, 7:57 AM IST

IND VS SA: టీమ్​ఇండియా మాజీ కెప్టెన్‌ కోహ్లీకి మద్దతుగా నిలిచాడు రికీ పాంటింగ్. విరాట్​ త్వరలోనే ఫామ్​లోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలోని ఫాస్ట్‌, బౌన్సీ వికెట్లపై జరిగే టీ20 ప్రపంచకప్‌లో పంత్‌ అత్యంత ప్రమాదకరంగా మారతాడని పేర్కొన్నాడు.

panth kohli
పంత్ కోహ్లీ

Ricky ponting Kohli performance: టీమ్​ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ గత కొంతకాలంగా ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. గడిచిన మూడేళ్లలో అతడు ఏ ఫార్మాట్‌లో కూడా సెంచరీ చేయలేదు. దీంతో కోహ్లీ అలసిపోయాడని, అతడి పని అయిందని కొందరు విమర్శిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ కోహ్లీకి మద్దతుగా నిలిచాడు. ప్రతి ఆటగాడి జీవితంలో ఇలాంటి దశ ఉంటుందని, త్వరలోనే అతడు ఫామ్‌లోకి వస్తాడని పాంటింగ్‌ పేర్కొన్నాడు.

"దాదాపు 10-12 ఏళ్లపాటు విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు. ఆ సమయంలో అతడు విఫలమైన సందర్భాలు చాలా తక్కువ. అయితే భారత టీ20 లీగ్‌ జరిగినప్పుడు కోహ్లీ అలసటపై చాలా చర్చ జరిగింది. ఈ విషయంలో కోహ్లీ తనను తాను అంచనా చేసుకొని.. తనది టెక్నికల్ సమస్యా? లేక మానసిక సమస్యా? అనేది తేల్చుకోవాల్సి ఉంటుంది. అతడు మంచి ప్రొఫెషనల్ ప్లేయర్. కాబట్టి త్వరలోనే తిరిగి ఫామ్‌లోకి వచ్చేందుకు కష్టపడతాడని నమ్మకం ఉంది. ఇన్నాళ్ల అనుభవంలో నాకు తెలిసిన మరో విషయం ఏంటంటే.. ఆటగాళ్లు తాము అలసిపోయినట్లు అంగీకరించరు. ఎలాగోలా ట్రైనింగ్ టైంకు వచ్చేస్తారు. మ్యాచ్‌కు రెడీ అవుతారు. విశ్రాంతి తీసుకున్నప్పుడే తాము ఎంత అలసిపోయింది వాళ్లకు తెలిసి వస్తుంది" అని రికీ పాంటింగ్‌ పేర్కొన్నాడు. ప్రస్తుతం భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో కోహ్లీకి విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. జులై 1న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టులో కోహ్లీ ఆడనున్నాడు.

IND VS SA Panth: ఈ ఏడాది ఆస్ట్రేలియాలోని ఫాస్ట్‌, బౌన్సీ వికెట్లపై జరిగే టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఆటగాడు పంత్‌ అత్యంత ప్రమాదకరంగా మారతాడని ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్‌లో పరిస్థితులకు తగ్గట్లుగా పంత్‌ను పరుగుల ప్రవాహాన్ని కొనసాగించే ఆటగాడిగా వాడుకోవాలని అతను చెప్పాడు. ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌గా పాంటింగ్‌.. పంత్‌ ఆటను దగ్గర నుంచి చూసిన సంగతి తెలిసిందే. ‘‘పంత్‌ ఓ అద్భుతమైన ఆటగాడు. ప్రపంచాన్ని తన పాదాల చెంతకు తెచ్చుకునే అసాధారణమైన యువ బ్యాటర్‌. భారత్‌ తరపున అత్యంత ప్రమాదకారి. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో తయారుచేసే ఫ్లాట్‌, ఫాస్ట్‌, బౌన్సీ వికెట్లపై అతను చెలరేగగలడు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో చూడాల్సిన ఆటగాళ్లతో కచ్చితంగా అతనొకడు. పరుగుల ప్రవాహాన్ని కొనసాగించే ఆటగాడిగా అతణ్ని ఉపయోగించుకోవాలి. నేనైతే భారత బ్యాటింగ్‌ ఆర్డర్లో అతణ్ని అయిదో స్థానంలో ఆడిస్తా. కానీ ఏడెనిమిది ఓవర్ల ఆట మిగిలి ఉండి.. ఒకటి లేదా రెండు వికెట్లు పడ్డ సందర్భంలో అతణ్ని ముందు పంపించాలి. తనకు వీలైనంత సమయం ఇవ్వాలి. అతనో విధ్వంసక ఆటగాడు’’ అని పాంటింగ్‌ తెలిపాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌ల్లో 340 పరుగులే చేసిన పంత్‌ తన ప్రదర్శన పట్ల చిరాకు పడ్డాడని పాంటింగ్‌ వెల్లడించాడు. ‘‘ఈ సారి ఐపీఎల్‌లో పంత్‌ ఉత్తమ ప్రదర్శన చేయలేకపోయాడు. అందుకు అతనెంతో చిరాకు పడ్డాడు. ఎందుకంటే గతంలో కంటే కూడా ఉత్తమ బ్యాటర్‌గా అతనీ సీజన్‌లో అడుగుపెట్టాడు. కానీ అతను కోరుకున్న ఫలితం రాలేదు’’ అని పాంటింగ్‌ పేర్కొన్నాడు.

ఇదీ చూడండి: 'ఐపీఎల్ వారి పాట'కు రికార్డులు బద్దలు.. రూ. 45 వేల కోట్లకుపైనే!

Last Updated :Jun 11, 2022, 7:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.