ETV Bharat / sports

ఎట్టకేలకు పాక్​తో టెస్టు సిరీస్​- పోరు అదిరేనా?

author img

By

Published : Sep 14, 2021, 9:23 PM IST

Updated : Sep 14, 2021, 10:48 PM IST

ఐసీసీ టీ20 ప్రపంచకప్​ అనంతరం ద్వైపాక్షిక సిరీస్​ కోసం పాకిస్థాన్​ క్రికెటర్లు బంగ్లాదేశ్​ పయనం కానున్నారు. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత పాక్​ టీమ్​ బంగ్లా గడ్డపై అడుగుపెట్టనుంది. ఆ సిరీస్​కు సంబంధించిన షెడ్యూల్​ను మంగవారం విడుదల చేశారు.

pakistan cricket news
పాకిస్థాన్

దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత బంగ్లాదేశ్​లో పర్యటించనుంది పాకిస్థాన్ క్రికెట్ జట్టు. బంగ్లాతో రెండు టెస్టులు, మూడు టీ20 మ్యాచ్​లు ఆడనున్నట్లు పాక్​ క్రికెట్ బోర్డు(పీసీబీ) మంగళవారం ప్రకటించింది. నవంబర్​, డిసెంబర్​లలో జరగనున్న ద్వైపాక్షిక సిరీస్​ను ఢాకా, ఛత్తోగ్రామ్​ వేదికగా నిర్వహించనున్నారు.

యూఏఈలో నవంబర్​ 14న టీ20 ప్రపంచకప్​ ముగిసిన వెంటనే పాక్​ జట్టు బంగ్లాకు పయనంకానుంది. నవంబర్​ 19న రెండు జట్ల మధ్య టీ20 సిరీస్​ ప్రారంభంకానుంది. అనంతరం ఛత్తోగ్రామ్​లో నవంబర్​ 26-30 మధ్య తొలి టెస్టు ఆడనున్నాయి. 2015 మే తర్వాత బంగ్లా గడ్డపై పాక్​ టెస్టు మ్యాచ్​ ఆడలేదు.

పూర్తి షెడ్యూల్..

తేదీమ్యాచ్ వేదిక
నవంబర్​ 19తొలి టీ20ఢాకా
నవంబర్ 20 రెండో టీ20ఢాకా
నవంబర్ 22మూడో టీ20ఢాకా
నవంబర్ 26-30 తొలి టెస్టుఛత్తోగ్రామ్
డిసెంబర్ 4-8 రెండో టెస్టుఢాకా

ఇదీ చూడండి: అంతర్జాతీయ క్రికెట్​కు మలింగ గుడ్​బై

Last Updated : Sep 14, 2021, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.