ETV Bharat / sports

జాతి వివక్ష: మరో క్రికెటర్​ సస్పెండ్​ కానున్నాడా?

author img

By

Published : Jun 8, 2021, 2:07 PM IST

వివాదాస్పద ట్వీట్లపై క్రమశిక్షణ ఉల్లంఘన చర్యల కింద చేపట్టిన విచారణలో భాగంగా ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు మరో ఆటగాడిని విచారించిందని సమాచారం. అయితే అతడు ఎవరనేది తెలియలేదు.

ecb
ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు

వివాదాస్పద ట్వీట్లపై క్రమశిక్షణ ఉల్లంఘన చర్యల కింద చేపట్టిన విచారణలో భాగంగా ఎనిమిదేళ్ల క్రితం స్త్రీ వివక్ష, జాత్యంహకార సందేశాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​లు చేశాడని ఇంగ్లాండ్​ యువ బౌలర్​ ఒల్లీ రాబిన్​సన్ (Ollie Robinson)​ను సోమవారం అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసింది ఈసీబీ. ఇందులో భాగంగానే ఇప్పుడు ఆ దేశానికి చెందిన మరో ఆటగాడిని విచారించినట్లు అక్కడి ఓ ప్రముఖ వార్త సంస్థ తెలిపింది. అయితే ఆ ఆటగాడు ఎవరనేది ఈసీబీ తెలపలేదని వెల్లడించింది. ఆ క్రికెటర్ జాతివివక్ష వ్యాఖ్యలు చేసిన సమయంలో ​అండర్​ 16 కేటగిరిలో ఉన్నాడని పేర్కొంది.

"ఒల్లీ రాబిన్​సన్​పై చర్య అనంతరం మరో ఆటగాడు కూడా అలాంటి ట్వీట్స్​ చేశాడని మాకు సమాచారం అందింది. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నాం. త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తాం" అని ఓ ఈసీబీ అధికారి తెలిపినట్లు సదరు వార్తా సంస్థ వెల్లడించింది.

రాబిన్​సన్​ 2012-13.. 19ఏళ్ల వయసులో స్త్రీ వివక్ష, జాత్యంహకార వ్యాఖ్యలు చేసినట్లు విచారణలో తేలడం వల్ల ఈసీబీ అతడిని అంతర్జాతీయ క్రికెట్​ ఆడకుండా సస్పెన్షన్​ విధించింది. కాగా, లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్​తో జరిగిన మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్​ల్లో 7 వికెట్లతో సత్తాచాటాడు రాబిన్​సన్. మొదటి ఇన్నింగ్స్​లో 42 పరుగులు కూడా చేశాడు. ఇదే ఇతడికి టెస్టుల్లో మొదటి మ్యాచ్ కావడం గమనార్హం.

ఇదీ చూడండి: అంతర్జాతీయ క్రికెట్ నుంచి రాబిన్​సన్​ సస్పెండ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.