ETV Bharat / sports

ECB: ఇంగ్లాండ్​ బౌలర్​పై చర్యలకు ఈసీబీ హామీ!

author img

By

Published : Jun 6, 2021, 12:39 PM IST

ఎనిమిదేళ్ల క్రితం ట్విట్టర్లో స్త్రీ వివక్ష, జాత్యంహకార వ్యాఖ్యలు చేసిన ఇంగ్లాండ్ బౌలర్​ ఒలీ రాబిన్​సన్​పై చర్యలు తీసుకోవడానికి ఆ దేశ క్రికెట్ బోర్డు సిద్ధమైనట్లు సమాచారం. నిషేధం లేదా జరిమానా విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ollie robinson, england cricketer
ఒలీ రాబిన్​సన్, ఇంగ్లాండ్ క్రికెటర్

ఇంగ్లాండ్​ యువ బౌలర్​ ఒలీ రాబిన్​సన్ (Ollie Robinson)​పై నిషేధానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎనిమిదేళ్ల క్రితం చేసిన ట్వీట్ల విషయంలో చర్యలు తీసుకోవడానికి ప్రస్తుతం ఇంగ్లాండ్ అండ్ వేల్స్​ క్రికెట్ బోర్డు(England and Wales Cricket Board) ముందుకు వచ్చింది. లార్డ్స్​ వేదికగా కివీస్​తో జరుగుతోన్న తొలి టెస్టు తర్వాత ఈ అంశంపై దర్యాప్తు చేయనుంది. రెండో టెస్టుకు అతని స్థానంలో మరో పేసర్​ను ఇంగ్లాండ్ తీసుకోనున్నట్లు సమాచారం.

ఒలీ రాబిన్​సన్​పై నిషేధం లేదా జరిమానా విధించే అవకాశం ఉంది. లేదా నిషేధంతో పాటు జరిమానా కూడా వేసే అవకాశం ఉంది. 2013లో స్త్రీ వివక్ష, జాత్యంహకార సందేశాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​లు పెట్టిన రాబిన్​సన్​.. ఇప్పుడు వాటి పర్యావసానాలు ఎదుర్కొంటున్నాడు.

ఇదీ చదవండి: 'ఆ ట్వీట్లు చేసినందుకు సిగ్గుపడుతున్నా!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.