ETV Bharat / sports

టీమ్​ఇండియాకు షాక్ - ప్రపంచకప్ మిగతా టోర్నీకి హార్దిక్​ దూరం - అతడి స్థానంలో ఎవరంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 4, 2023, 9:25 AM IST

Updated : Nov 4, 2023, 12:02 PM IST

ODI World Cup 2023 Hardik Pandya : టీమ్​ఇండియాకు, క్రికెట్ అభిమానులకు బిగ్ షాక్​ తగిలింది. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్​లో ఇప్పటికే గాయంతో జట్టుకు దూరమైన ఆల్​ రౌండర్​ హార్దిక్​ పాండ్యా.. ఇప్పుడు మిగతా మ్యాచ్​లకు కూడా దూరం కానున్నట్లు క్లారిటీ అయిపోయింది. హార్దిక్​ త్వరగా కోలుకుని మిగతా మ్యాచ్​లకు అందుబాటులో ఉంటాడనుకుంటే అది జరగలేదు. హార్దిక్​ ఇంకా కోలుకోకపోవడంతో విశ్రాంతి ఇచ్చి.. అతడి స్థానంలో ప్రసిద్ధ కృష్ణను తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ODI World Cup 2023 Hardik Pandya  ruled out
హార్దిక్ పాండ్య ప్రపంచ కప్​కు దూరం

ODI World Cup 2023 Hardik Pandya : టీమ్​ఇండియాకు, క్రికెట్ అభిమానులకు బిగ్ షాక్​ తగిలింది. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్​లో ఇప్పటికే గాయంతో జట్టుకు దూరమైన ఆల్​ రౌండర్​ హార్దిక్​ పాండ్యా(Hardik Injury Update).. ఇప్పుడు మిగతా మ్యాచ్​లకు కూడా దూరం కానున్నట్లు క్లారిటీ అయిపోయింది. హార్దిక్​ త్వరగా కోలుకుని మిగతా మ్యాచ్​లకు అందుబాటులో ఉంటాడనుకుంటే అది జరగలేదు. హార్దిక్​ ఇంకా కోలుకోకపోవడంతో విశ్రాంతి ఇచ్చి.. అతడి స్థానంలో ప్రసిద్ధ కృష్ణను తీసుకున్నట్లు ఐసీసీ నిర్వహకులు అధికారికంగా ప్రకటించారు.

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బంతిని ఆపే క్రమంలో హార్దిక్ గాయపడిన సంగతి తెలిసిందే. చీలమండ గాయం కావడం వల్ల అతడు చికిత్స కోసం జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లిపోయాడు. దీంతో మొదటగా.. మూడు మ్యాచ్‌లకు అతడు దూరమవుతాడని మేనేజ్‌మెంట్‌ చెప్పింది. కానీ గాయం తీవ్రత తగ్గకపోవడంతో ఇప్పుడు అతడికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించారు.

"ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమ్​ ఇండియాకు బ్యాడ్‌ న్యూస్. స్టార్‌ ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్య చీలమండ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. దీంతో టోర్నీలోని మిగతా మ్యాచ్‌లకు అతడు దూరం కానున్నాడు. పాండ్య ప్లేస్​లో ప్రసిధ్ కృష్ణను జట్టులోకి తీసుకున్నాం." అని ఐసీసీ అనౌన్స్ చేసింది. ఇక ఇదే విషయంపై హార్దిక్ కూడా స్పందించాడు. వరల్డ్​ కప్​లోని మిగతా మ్యాచ్​లకు దూరం కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. కానీ నేను జట్టుతో ఉంటాను. ప్రతి గేమ్​ ప్రతి బంతి ఆడేటప్పుడు వారిలో ఉత్సాహపరుస్తూ జోష్ నింపుతాను" అని చెప్పుకొచ్చాడు.

  • Hardik Pandya tweets, "Tough to digest the fact that I will miss out on the remaining part of the World Cup. I'll be with the team, in spirit, cheering them on every ball of every game..."

    Pandya has failed to recover from his ankle injury and will miss the remainder of the ICC… pic.twitter.com/zFMvdUQtTI

    — ANI (@ANI) November 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ODI World Cup 2023 TeamIndia Points Table : కాగా, ప్రస్తుతం టీమ్​ఇండియా ఏడు మ్యాచుల్లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్ పొజిషనల్​లో ఉంది. ఇప్పటికే సెమీస్‌ బెర్తును కూడా ఖరారు చేసుకుంది. ఆదివారం దక్షిణాఫ్రికాతో కోల్‌కతా వేదికగా కీలక మ్యాచ్ ఆడనుంది. ఇక లీగ్‌ దశలోని చివరి మ్యాచ్‌ను నెదర్లాండ్స్‌తో నవంబర్ 12న బెంగళూరు వేదికగా తలపడనుంది.

వరల్డ్ కప్ 2023 సెమీస్​ - ఈ రెండు గెలిస్తే ఆ నాలుగు ఔట్‌

మెగాటోర్నీలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్​గా అఫ్గాన్​​-సెమీస్ చేరేందుకు ఇంకా ఛాన్స్​!

Last Updated : Nov 4, 2023, 12:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.