ETV Bharat / sports

శ్రీలంకతో కీలక పోరు - మ్యాచ్‌కు వర్షం ముప్పు - న్యూజిలాండ్‌ నిలిచేనా?

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 9, 2023, 9:51 AM IST

Updated : Nov 9, 2023, 12:26 PM IST

Newzealand Vs Srilanka World Cup 2023 : వన్డే ప్రపంచకప్​లో మంచి ఫామ్​లో ఉండి.. ఆ తర్వాత డీలా పడింది న్యూజిలాండ్ జట్టు. అయితే మరికొద్ది గంటల్లో శ్రీలంకను ఢీకొట్టనుంది. ఈ క్రమంలో కివీస్​ జట్టు సెమీస్​ అవకాశాలు ఎలా ఉన్నాయంటే..

Newzealand Vs Srilanka World Cup 2023
Newzealand Vs Srilanka World Cup 2023

Newzealand Vs Srilanka World Cup 2023 : గత రెండు ప్రపంచకప్​ల్లో రన్నరప్​గా నిలిచి.. ఈ కప్​లోనూ అత్యుత్తమ ప్రదర్శించింది న్యూజిలాండ్​ జట్టు. కానీ అక్కడి నుంచి వరుసగా నాలుగు ఓటములతో సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. దీంతో ఇప్పుడు సెమీస్​లోకి వెళ్లాలంటే.. తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో గురువారం శ్రీలంకను ఢీకొట్టనుంది. కేవలం గెలుపు కాదు ఈ మ్యాచ్‌లో ఆ జట్టుకు ఘనవిజయం అవసరం.

అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ప్రత్యర్థి కంటే ముందు కివీస్‌ను వరుణుడు భయపెడుతున్నాడు. మరొకొద్ది గంటల్లో జరగనున్న మ్యాచ్​కు వర్షం ముప్పుందని వాతావరణ శాఖ సమాచారం. దీంతో ఇప్పుడు లంకపై ఓడినా లేకుంటే వాన కారణంగా మ్యాచ్‌ రద్దయినా కివీస్‌కు కష్టమే.

మరోవైపు ప్రపంచకప్‌లో భారత్​కు ప్రత్యర్థి ఎవరు అన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన భారత్‌.. 8 పాయింట్లతో సమానంగా ఉన్న పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, అఫ్గానిస్థాన్‌ల నుంచి ఓ జట్టుతో సెమీస్‌లో తలపడనుంది. ఆ తర్వాత మరో సెమీస్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఢీకొట్టనున్నాయి.

ఇక గురువారం శ్రీలంకపై విజయం సాధిస్తే న్యూజిలాండ్‌ (0.398) సెమీస్​కు చేరడం దాదాపు ఖాయం. ఎందుకంటే ఆ జట్టు రన్‌రేట్‌ పాకిస్థాన్‌ (0.036), అఫ్గాన్‌ (-0.338) కంటే మెరుగ్గా ఉంది. ఒకవేళ శ్రీలంకతో జరగనున్న మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయితే.. కివీస్‌కు అవకాశం ఉంటుంది. కానీ పాక్‌, అఫ్గాన్‌ తమ చివరి మ్యాచ్‌ల్లో ఓడిపోవాల్సి ఉంటుంది.

మరోవైపు అఫ్గాన్‌ ముందుకు వెళ్లాలంటే దక్షిణాఫ్రికాపై నెగ్గాల్సిఉంటుంది. పాక్‌, కివీస్‌ ఓడిపోవాలి. ఈ ముక్కోణపు రేసులో మిగతా రెండు జట్లతో పోలిస్తే పాక్‌కే కాస్త ప్రయోజనం ఉంది. ఎందుకంటే కివీస్‌, అఫ్గాన్‌ మ్యాచ్‌ల తర్వాత పాక్‌ ఆడుతుంది. ఒకవేళ నెట్‌ రన్‌రేట్‌ పరిగణలోకి వస్తే ఎంత తేడాతో గెలవాలనేది పాక్​కు కూడా ముందే తెలిసిపోతుంది.

పాక్​ గెలిస్తే.. వేదికలో మార్పు!
ఒకవేళ పాకిస్థాన్‌ సెమీస్‌ చేరితే.. రానున్న సెమీస్​ మ్యాచ్​కు వేదికలు మారనున్నాయి. నిజానికి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్‌, నాలుగో స్థానంలో నిలిచే జట్టుతో వచ్చే బుధవారం వాంఖెడే వేదికగా సెమీస్‌ ఆడాల్సి ఉంది. కానీ ప్రత్యర్థిగా పాకిస్థాన్‌ వస్తే మాత్రం ఈ మ్యాచ్‌ ముంబయికి బదులు కోల్‌కతాలో జరుగుతుంది. షెడ్యూల్​ను విడుదల చేసినప్పుడే ఐసీసీ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. మ్యాచ్‌ల కోసం ముంబయి వెళ్లేందుకు పాకిస్థాన్‌ నిరాకరించడమే అందుకు కారణం. ఇక దక్షిణాఫ్రికా,ఆస్ట్రేలియా మధ్య మరో సెమీస్‌ ముంబయిలో జరుగుతుంది.

'శ్రీలంకకు వస్తే రాళ్లతో కొడతాం'- షకీబ్‌కు మ్యాథ్యూస్ సోదరుడి వార్నింగ్!

మ్యాచ్ తర్వాత రచిన్​ను కలవడానికి తాతయ్య ట్రై - కానీ ఐసీసీ అలా చేయడం వల్ల!

Last Updated : Nov 9, 2023, 12:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.