ETV Bharat / sports

'ప్రపంచకప్​ గెలిస్తే పెళ్లి చేసుకుంటానని అనలేదు'

author img

By

Published : Oct 21, 2021, 3:51 PM IST

అఫ్గానిస్థాన్​ లెగ్​ స్పిన్నర్ రషీద్ ఖాన్(Rashid Khan News)​ పెళ్లిపై పలు రూమర్లు వచ్చాయి. 'మా జట్టు వరల్డ్​ కప్ గెలిస్తే పెళ్లి చేసుకుంటా' అని అతడు అన్నాడన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై క్లారిటీ ఇచ్చాడు రషీద్​ ఖాన్(Rashid Khan Marriage).

rashid khan
రషీద్ ఖాన్

టీ20 ప్రపంచకప్​ నేపథ్యంలో అఫ్గానిస్థాన్ స్టార్ లెగ్​ స్పిన్నర్ రషీద్​ ఖాన్(Rashid Khan News) పెళ్లి అంశంపై రూమర్లు వచ్చాయి. తమ జట్టు ప్రపంచకప్​ గెలిస్తే పెళ్లి చేసుకుంటానని రషీద్​(Rashid Khan Marriage) చెప్పినట్లు గుసగుసలు వినిపించాయి. దీనిపై స్పందించిన రషీద్​..​ ఇవన్నీ తప్పుడు మాటలని అన్నాడు. మెగా టోర్నీలో తమ జట్టు కోసం గొప్పగా బౌలింగ్ చేయడమే తన లక్ష్యమని చెప్పాడు.

"మొదట ఈ రూమర్లు వినగానే నేను షాక్​కు గురయ్యా. నిజానికి, ప్రపంచకప్​ గెలిస్తే పెళ్లి చేసుకుంటానని నేనెప్పుడూ అనలేదు. 2021, 2022.. టీ20 ప్రపంచకప్​, 2023 వరల్డ్​ కప్(50 ఓవర్లు) దృష్ట్యా.. రానున్న రోజుల్లో నేను మరిన్ని కీలక మ్యాచ్​లు ఆడాల్సి ఉందని మాత్రమే చెప్పా. నా ఫోకస్​ ఇప్పుడు క్రికెట్​పైనే ఉంది పెళ్లిపై కాదు."

-రషీద్ ఖాన్, అఫ్గానిస్థాన్ స్పిన్నర్.

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup 2021) గ్రూప్​ 2లో ఉన్న అఫ్గానిస్థాన్​ జట్టు అక్టోబర్ 25న షార్జా వేదికగా ఓ మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో రషీద్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే.. ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలోనూ ప్రపంచకప్​లో స్పిన్నర్లదే హవా ఉంటుందని రషీద్ అభిప్రాయపడ్డాడు.

టాప్​ 5 ఆటగాళ్లు వీరే..

టీ20లో టాప్​-5 ఉత్తమ ఆటగాళ్లను ఎంపిక చేశాడు రషీద్. విరాట్ కోహ్లీ, కీరన్ పొలార్డ్, కేన్ విలియమ్సన్, ఏబీ డివిలియర్స్, హార్దిక్ పాండ్యా టీ20ల్లో గొప్ప ఆటగాళ్లని అన్నాడు. కాగా, ఇందులో అతడి పేరు చెప్పుకోకపోవడం గమనార్హం.

ఇదీ చదవండి:

T20world cup 2021: 'ఇది స్పిన్నర్ల ప్రపంచకప్‌'

టీ20 ప్రపంచకప్​లో టీమ్‌ఇండియానే టైటిల్‌ ఫేవరెట్‌: స్మిత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.