ETV Bharat / sports

ఆ బంతి దెబ్బకు ఖవాజా మైండ్‌ బ్లాక్‌.. ఇంగ్లాండ్​ పేసర్​ మామూలుగా ఆడలేదుగా!

author img

By

Published : Jul 6, 2023, 8:06 PM IST

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు మూడో టెస్ట్​ రసవత్తరంగా సాగుతోంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్​ పేసర్​ మార్క్‌ వుడ్‌ వేసిన ఓ బాల్ ప్రస్తుతం నెట్టింట హల్​చల్ చేస్తోంది. ఆ వీడియో మీ కోసం..

mark wood wicket
mark wood wicket

Mark Wood Wicket : ఇంగ్లండ్‌ పేసర్‌ మార్క్‌ వుడ్‌ దాటికి ఆసీస్​ ప్లేయర్​ ఉస్మాన్‌ ఖవాజా ఒక్కసారిగా షాకయ్యాడు. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు మూడో టెస్ట్​ ఆడుతున్నాయి. ఈ క్రమంలో తొలి రోజు ఆట ఎంతో రసవత్తరంగా సాగింది. టాస్‌ గెలిచిన స్టోక్స్‌.. ఆసీస్‌ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దీంతో అతని నమ్మకాన్ని నిజం చేస్తూ ఇంగ్లండ్‌ బౌలర్లు కూడా తమదైన స్టైల్​లో ఆడి.. తొలి సెషన్‌లోనే చెలరేగిపోయారు. లంచ్‌ బ్రేక్​ టైమ్​కి నాలుగు వికెట్లు తీసి ఆసీస్‌ను ఘోరంగా దెబ్బతీశారు.

అయితే ఈ మ్యాచ్​లో స్టువర్ట్‌ బ్రాడ్‌ రెండు వికెట్లు పడగొట్టినప్పటికీ.. మార్క్‌ వుడ్​ తీసిన వికెట్​.. మ్యాచ్​కు హైలైట్​గా నిలిచింది. యాషెస్‌ సిరీస్‌లో మార్క్‌ వుడ్‌కు ఇదే తొలి మ్యాచ్‌ కాగా.. ఇందులోనే గంటకు 90 మైళ్ల వేగంతో బంతులను విసురుతూ ఆసీస్‌ జట్టుకు చెమటలు పట్టించాడు. ఈ నేపథ్యంలోనే ఆసీస్‌ ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజాను ఔట్‌ చేసిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.

Mark Wood Fastest Over : క్రీజ్​లో ఉన్న ఖవాజాను ఔట్‌ చేసిన మార్క్​.. 13వ ఓవర్‌లో ప్రతీ బంతిని గంటకు 90 మైళ్ల వేగంతో విసరుతూ అందరిని ఆశ్చర్యపరిచాడు. గుడ్‌లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో వేస్తూ వచ్చి.. ఆఖరి బంతిని మాత్రం ఇన్‌స్వింగర్‌ వేశాడు. దీంతో బంతి ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకొని.. ఖవాజా కాళ్ల మధ్యల్లో నుంచి వెళ్లి లెగ్‌ స్టంప్‌ను తాకింది. 95 మైళ్ల వేగంతో దూసుకొచ్చిన ఆ బంతి దెబ్బకు స్టంప్‌ ఎగిరి కింద పడింది. ఇది చూసిన అభిమానులు ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. ఇక యాషెస్‌ చరిత్రలో మార్క్‌ వుడ్‌ వేసిన బంతి రెండో ఫాస్టెస్ట్‌ డెలివరీగా నిలిచింది. అంతకముందు ఆసీస్‌ స్టార్‌ మిచెల్‌ జాన్సన్‌ 2013 యాషెస్‌ సిరీస్‌లో గంటకు 97 మైళ్ల వేగంతో బంతిని విసిరి రికార్డెక్కాడు.

ఇక మ్యాచ్​ విషయానికి వస్తే.. లంచ్‌ బ్రేక్​ తర్వాత బ్యాటింగ్‌ ఆరంభించిన ఆసీస్‌ జట్టు మరో వికెట్​ను కోల్పోకుండా జాగ్రత్తగా ఆడుతుంది. ప్రస్తుతం 33 ఓవర్లలో నాలుగు వికెట్ల ఇక స్టువర్ట్‌ బ్రాడ్‌.. వార్నర్‌తో పాటు స్మిత్​ను ఔట్​ చేశాడు. ఇక మార్నస్‌ లబుషేన్‌ను.. క్రిస్‌ వోక్స్‌ పెవిలియన్‌ చేర్చాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.