ETV Bharat / sports

Kushal Malla Century : యువరాజ్ రికార్డు బద్దలు.. 9 బంతుల్లో హాఫ్ సెంచరీ.. టీ20ల్లో నేపాల్ ట్రిపుల్ సెంచరీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 27, 2023, 9:11 AM IST

Updated : Sep 27, 2023, 10:04 AM IST

Kushal Malla Century : ఆసియా క్రీడల్లో భాగంగా జరగుతున్న పురుషుల క్రికెట్​ ఈవెంట్​లో నేపాల్​ జట్టు రికార్డుల మోత మోగించింది. బుధవారం మంగోలియాతో జరుగుతున్న మ్యాచ్​లో ఆ జట్టు.. 314 పరుగులు చేసి టీ20ల్లో అత్యధిక స్కోరును నమోదు చేసింది. నేపాల్ ప్లేయర్​ కుశాల్ మల్లా ఏకంగా టీమ్ఇండియా కెప్టెన్​ రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు. మరో బ్యాటర్.. యువరాజ్​ను అధిగమించాడు.

Dipendra Singh Airee Stats
Dipendra Singh Airee Stats

Kushal Malla Century : ఆసియా క్రీడల్లో భాగంగా జరగుతున్న పురుషుల క్రికెట్​ ఈవెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా బుధవారం నేపాల్​- మంగోలియా జట్లు తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్​కు దిగిన నేపాల్.. అనేక రికార్డులను కొల్లగొట్టింది. 20 ఓవర్లలో ఏకంగా 314 పరుగులు సాధించింది. ఇందులో నేపాల్​ జట్టుకు చెందిన బ్యాట్స్‌మెన్ కుశాల్ మల్లా తన ఇన్నింగ్స్​లో ఓ అదురైన రికార్డును సృష్టించాడు. కుశాల్ 34 బంతుల్లోనే శతకం బాదేశాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాట్స్​మెన్​గా రికార్డుకెక్కాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో 35 బంతుల్లో సెంచరీ సాధించిన టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ డేవిడ్ మిల్లర్ రికార్డును బద్దలుకొట్టాడు.

Dipendra Singh Airee Stats : ఇక కుశాల్ ఈ రికార్డును తన పేరిట రాసుకోవడమే కాకుండా.. 50 బంతుల్లో 8 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో మొత్తం 137 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్​ను అందించాడు. దీంతో ఈ మ్యాచ్‌లో నేపాల్ జట్టు 3 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ఇక ఇదే మ్యాచ్​లో దీపేంద్ర సింగ్ ఆరి 9 బంతుల్లో అర్ధశతకాన్ని సాధించి చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో 12 బాల్స్​తో యువరాజ్​ నెలకొల్పిన ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును దీపేంద్ర బ్రేక్​ చేశాడు.

Nepal Vs Mongolia Asia Cup 2023 : మరోవైపు మంగోలియా జట్టుకు భారీ లక్ష్యాన్ని అందించిన నేపాల్​ జట్టు.. ఈ మ్యాచ్​లో అనేక రికార్డులు తన పేరిట రాసుకుంది. ఇప్పుడు నేపాల్​ చేసిన స్కోర్​.. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఓ జట్టు చేసిన అతిపెద్ద స్కోరు కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో మంగోలియా జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. నేపాల్ జట్టు మొదట బ్యాటింగ్‌కు వచ్చినప్పటికీ.. జట్టుకు మంచి ఆరంభం లభించలేదు. అయితే ఆ తర్వాత రంగంలోకి దిగిన కుశాల్ మల్లా.. కెప్టెన్ రోహిత్ పుడెల్ ధనాధన్ ఇన్నింగ్స్​ ఆడి స్కోర్​ బోర్డును పరుగులు పెట్టించారు. అలా కుశాల్ 137 పరుగులు, రోహిత్ 61 పరుగులు, దీపేంద్ర సింగ్ 52 పరుగులు చేశారు.

Fittest Cricketers in Asian Teams : విరాట్​ టు రోహిత్​.. ఈ ప్లేయర్లు ఆటలోనే కాదు ఫిట్​నెస్​లోనూ టాప్​ గురూ!

Asia Cup 2023 India VS Nepal : ఊహించిన దాని కన్నా నేపాల్ భారీ స్కోర్​.. భారత లక్ష్యం ఎంతంటే?

Last Updated : Sep 27, 2023, 10:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.