ETV Bharat / sports

'కేన్​' అవుట్​పై సన్​రైజర్స్​ నిరసన.. బీసీసీఐకి చేరిన పంచాయతీ

author img

By

Published : Apr 2, 2022, 1:57 PM IST

Kane Williamson Catch: రాజస్థాన్​ రాయల్స్​తో మ్యాచ్​లో సన్​రైజర్స్​ సారథి కేన్​ విలియమ్సన్​.. వివాదాస్పద క్యాచ్​ అవుట్​ గురించి తెలిసిందే. బంతి నేలకు తాకినట్లుగా రీప్లేలో కనిపిస్తుండగా.. తాజాగా ఆ థర్డ్​ అంపైర్​ నిర్ణయంపై సన్​రైజర్స్​ నిరసనగళం వినిపిస్తోంది.

kane williamson catch at IPL 2022
kane williamson catch at IPL 2022

Kane Williamson Catch: ఐపీఎల్​ 2022 సీజన్​ను ఓటమితో ప్రారంభించిన సన్​రైజర్స్​ హైదరాబాద్​.. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. తొలి మ్యాచ్​లో రాజస్థాన్​ రాయల్స్​ చేతిలో 61 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 211 పరుగుల లక్ష్యఛేదనలో రెండో ఓవర్లోనే కేన్​ కెప్టెన్​ కేన్​ విలియమ్సన్​ ఔటయ్యాడు. అయితే అదే వివాదాస్పదంగా మారింది. కీపర్​ సంజు శాంసన్​ చేతుల్లో పడి మిస్సైన బంతిని.. స్లిప్​లో ఉన్న దేవ్​దత్​ పడిక్కల్​ అందుకున్నాడు. అయితే.. దాన్ని పలు మార్లు పరిశీలించిన థర్డ్​ అంపైర్​.. విలియమ్సన్​ను ఔట్​గా ప్రకటించాడు. దీనిపై ఎస్​ఆర్​హెచ్​ సహా క్రికెట్​ అభిమానులు ఆగ్రహానికి గురవుతున్నారు. రీప్లేలో బంతి స్పష్టంగా నేలకు తాకినట్లుగా కనిపిస్తుందని కామెంట్లు చేస్తున్నారు.

అయితే.. థర్డ్​ అంపైర్​ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సన్​రైజర్స్​ హైదరాబాద్​ ఫ్రాంఛైజీ ఈ అంశంపై బీసీసీఐకి ఇప్పటికే లేఖ రాసినట్లు సమాచారం. మ్యాచ్​ అయిపోయాక.. రిఫరీకి కెప్టెన్​ ఇచ్చే నివేదికలో కూడా దీని గురించి ప్రస్తావించినట్లు ఫ్రాంఛైజీ ధ్రువీకరించింది. 'అవును. మేం బీసీసీఐకి లేఖ రాశాం. అసలు ప్రాసెస్​ ఏంటంటే.. ఈ అంశంపై కోచ్​ ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. దాన్ని అనుసరిస్తాం.'' అని సన్​రైజర్స్​ యాజమాన్యం పేర్కొంది. మ్యాచ్​ అనంతరం.. సన్​రైజర్స్​ హెడ్​ కోచ్​ టామ్​ మూడీ కూడా దీనిపై స్పందించాడు. రీప్లేలో చూశాక అసలు విషయం తెలిసిందని, అసలు థర్డ్​ అంపైర్​ దేనిని పరిగణనలోకి తీసుకొని అవుట్​ ఇచ్చాడో అని ఆశ్చర్యపోయాడు.

ముంబయిలోని ఎంసీఏ స్టేడియంలో మార్చి 29న జరిగిన ఈ మ్యాచ్​లో టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన రాయల్స్​.. కెప్టెన్​ సంజూ శాంసన్​ (50), పడిక్కల్​ (41) చెలరేగడం వల్ల నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి.. 210 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో సన్​రైజర్స్​ తేలిపోయింది. మార్​క్రమ్​ (57), సుందర్ (40)​ మినహా ఏ ఒక్కరూ బ్యాటింగ్​లో రాణించలేదు. దీంతో ఎస్​ఆర్​హెచ్​ ప్రదర్శన పట్ల తీవ్ర నిరాశకు గురైన అభిమానులు.. సామాజిక మాధ్యమాల్లో జట్టును దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

ఇవీ చూడండి: 'ఆ నలుగురు బ్యాటింగ్‌లో అస్సలు కంగారు పడరు'

అసలే ఓటమి బాధలో సన్​రైజర్స్​.. కెప్టెన్​కు భారీ షాక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.