ETV Bharat / sports

టెస్టు​ క్రికెట్లో మరో సంచలనం.. సచిన్​ రికార్డును బద్దలుగొట్టే ప్లేయర్​ అతడే!

author img

By

Published : Jun 17, 2023, 1:23 PM IST

Joe Root vs Sachin Tendulkar : క్రికెట్​ చరిత్రలో అసాధారణ ఘనత సాధించాడు టీమ్​ఇండియా మాజీ దిగ్గజం సచిన్ తెందూల్కర్. 'గాడ్​ ఆఫ్​ క్రికెట్​'గా అభిమానులు అభివర్ణించే ఈ మాస్టర్​ బ్లాస్టర్​.. టెస్టుల్లోనే 15,921 పరుగులు చేశాడు. అయితే, ఇటీవల ఇంగ్లాండ్​ క్రికెటర్​ జో రూట్ కూడా​ టెస్టుల్లో 11,000 పరుగులు పూర్తి చేయడం వల్ల.. అతడే సచిన్​ రికార్డును బ్రేక్​ చేస్తాడని చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో జో రూట్​ ఆ రికార్డును బద్దలుగొడతాడు అనడానికి ప్రధాన కారణాలను ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

joe root vs sachin tendulkar
joe root vs sachin tendulkar

Joe Root vs Sachin Tendulkar : క్రికెట్​లో.. ఆటగాళ్ల అసాధారణమైన ప్రతిభ బయటపడే వరకు.. వారు రికార్డులు సాధించలేరు. అలాంటి అసాధారణమైన ప్రతిభ కనబరిచి.. ప్రపంచ క్రికెట్​ చరిత్రలో గొప్ప బ్యాటర్​గా టీమ్​ఇండియా మాజీ ఆటగాడు సచిన్ తెందుల్కర్​ నిలిచాడు. 200 టెస్టులు ఆడిన సచిన్​.. 15,921 స్కోరుతో టెస్ట్​ క్రికెట్​లోనే అత్యధిక పరుగులు సాధించి.. ఓ బెంచ్​మార్క్​ను నెలకొల్పాడు. సచిన్​ నమోదు చేసిన ఈ రికార్డును ఎవరు బద్దలుగొడతారు అని కొన్ని సంవత్సరాలుగా చర్చ జరుగుతోంది.

Joe Root Test Runs : అయితే, ఇంగ్లాండ్​ స్టార్ బ్యాటర్​ జో రూట్​ 11,000 పరుగులు పూర్తి చేశాడు. ఇటీవల లార్డ్స్​ వేదికగా ఐర్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో జో రూట్​.. వేగంగా అర్ధసెంచరీ పూర్తి చేశాడు. తాజాగా బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో​ వేదికగా ప్రారంభమైన యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్టులో మొదటి రోజు జోరూట్​ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 152 బంతుల్లో 118 స్కోర్​ చేసిన జో రూట్‌ తన శతకంతో స్టేడియంను ఓ ఊపు ఊపేశాడు. దీంత ఇంగ్లాండ్​ తరఫున్​ టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్​గా నిలిచి.. మరో ఇంగ్లాండ్ ప్లేయర్​ అలిస్టర్​ కుక్​, శ్రీలంక బ్యాట్​ కుమార సంగక్కరను వెనక్కి నెట్టాడు. దీంతోపాటు తన టెస్ట్​ కెరీర్​లో 30వ సెంచరీని సాధించి డాన్​ బ్రాడ్​మాన్​ రికార్డును బద్దలుగొట్టాడు.
దీంతో అతడే సచిన్​ తెందూల్కర్​ రికార్డును బ్రేక్​ చేస్తాడని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు రూట్​ అసాధారణమైన ప్రతిభ, మంచి ఫామ్​తో నిలకడగా ప్రదర్శనలు చేస్తుండటం వల్ల ఆ చర్చకు మరింత బలం చేకూరుతోంది. జోరూట్​.. సచిన్​ రికార్డును బద్దలుగొడతాడు అనడానికి ప్రధాన కారణాలివే.

నిలకడ, పరుగులు తీసే సామర్థ్యం..
సచిన్​ తెందూల్కర్​ రికార్డును బ్రేక్​ చేయగల సామర్థ్యం ఉన్న ఆటగాళ్లలో జో రూట్ ముందు వరసలో ఉన్నాడు. దానికి ప్రధానం కారణం అతడి నిలకడ, కచ్చితంగా పరుగులు రాబట్టగల సామర్థ్యం. జో రూట్​ టెస్టు క్రికెట్​లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. వేగంగా పరుగులు రాబట్టాడు. అతడికి మంచి టెక్నిక్​ ఉంది. ఎలాంటి బౌలింగ్​ పరిస్థితుల్లో అయినా.. తన వైడ్​ రేంజ్​ షాట్లతో పరుగులు సాధిస్తాడు.

Joe Root Stats : అర్ధసెంచరీలను నిలకడతో సెంచరీల వైపు పరుగులు పెట్టిస్తాడు. ప్రతినిత్యం పరుగుల ఆకలితో పరితపిస్తాడు. ఈ కారణాలే సచిన్ రికార్డుకు ప్రమాదంగా మారాయి. టెస్టుల్లో రూట్ ఇప్పటివరకు 50.24 సగటుతో పరుగులు చేశాడు. అలా అతడి కెరీర్​ మొదటి నుంచి అద్భుతమైన నిలకడ ప్రదర్శించాడు. అయితే, రూట్​ ఇదే నిలకడ కొనసాగిస్తే.. దాదాపు 98 ఇన్నింగ్స్​ అంటే 49 టెస్టుల్లో మిగతా 4,917 పరుగులు పూర్తి చేసే అవకాశం ఉంది.

ఏజ్​ అడ్వాంటేజ్​..
Joe Root Age : రూట్​ వయసు ఇప్పుడు 32 ఏళ్లే. దీని ప్రకారం అతడు ఇంకా కొన్నేళ్లు మంచి క్రికెట్​ ఆడతాడు. అయితే, సచిన్​ టెస్టుల నుంచి 40 ఏళ్ల వయసులో రిటైర్మెంట్​ ప్రకటించాడు. అంటే.. రూట్​కు ఇప్పుడు వయసు అడ్వాంటేజ్​ ఉంది​. రిటైరయ్యే గ్యాప్​లో సచిన్ రికార్డు బ్రేక్​ చెయ్యెచ్చు.

రూట్ ఇదే విధంగా ఫామ్, ఫిట్​నెస్​ ప్రదర్శిస్తే భవిష్యత్​లో ఎక్కువ మ్యాచ్​లు ఆడుతూ పరుగులు సాధించే అవకాశం ఉంది. జో రూట్​ నైపుణ్యం, అంకితభావం, వయసు కలిస్తే సచిన్​ను చేరుకునే కల సాకారమవుతుంది. దీంతోపాటు 2025 నుంచి 2027 డబ్ల్యూటీసీ చక్రంలో ఇంగ్లాండ్​ 21 టెస్టు మ్యాచ్​లు అడుతుంది. దీంతో పరుగులు సాధించడానికి జోరూట్​కు మంచి అవకాశం లభిస్తుంది.

దృష్టంతా దానిపైనే..
ప్రస్తుతం జోరూట్​ దృష్టి అంతా టెస్టు ఫార్మాట్​పైనే ఉంది. ప్రస్తుతం అతడి సహచర ప్లేయర్లు అన్ని ఫార్మాట్లలో ఆడుతూ ఫ్రాంచైజీ క్రికెట్​లో స్థిరపడిపోతున్నారు. వారికి భిన్నంగా జోరూట్​ అప్పుడప్పుడు ఫ్రాంచైజీ క్రికెట్​లో మెరుస్తున్నప్పటికీ.. తన ఫామ్​, రథమ్​పై ప్రధానంగా దృష్టి పెడుతున్నాడు.

రూట్ ఇప్పటికీ ఇంగ్లాండ్ వన్డే జట్టులో ఉన్నప్పటికీ.. అతడి ఆటతీరుతో టెస్టు ఫార్మాట్‌ను ఇష్టపడుతున్నాడని తెలుస్తోంది. అతడి వన్డే కెరీర్ ముగిసిన తర్వాత.. టెస్ట్​ క్రికెట్ ఆడటానికి రూట్​ ఎక్కువ సమయం వెచ్చించే అవకాశం ఉంది. దీంతో ఇతర ఫార్మాట్లలో ఆడకపోవడం వల్ల.. గాయపడే ప్రమాదం కూడా తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితులుంటే సచిన్ రికార్డును బద్దలుగొట్టడానికి మార్గం సుగమం అవుతుంది. అయితే, క్రికెట్​ గాడ్​గా ఫ్యాన్స్ అభివర్ణించే సచిన్​ తెందూల్కర్​ రికార్డును అధిగమించడానికి ఇంకా సమయం పడుతుంది. రూట్​.. ఆ ఘనత సాధిస్తాడా లేదా అన్న దానికి కాలమే సమాధానం చెబుతుంది. కానీ, జోరూట్​ ప్రతిభ, సంకల్పం మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.