ETV Bharat / sports

ఉమ్రాన్​ను పక్కకు పెట్టడంపై మాజీ ఆల్​రౌండర్​ అసంతృప్తి - 'అతడి విషయంలో నా అంచనాలు తప్పాయి'

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 1, 2023, 2:02 PM IST

Irfan Pathan Comments On Umran Malik : దక్షిణాఫ్రికా టూర్​లో భాగంగా జరిగే సిరీస్​ మ్యాచ్​లకు ప్రకటించిన జట్లలో టీమ్​ఇండియా యంగ్​ పేసర్​ ఉమ్రాన్‌ మాలిక్‌కు అవకాశం కల్పించకపోవడంపై మాజీ ఆల్‌ రౌండర్‌ ఇర్ఫాన్​ పఠాన్ స్పందించాడు​. ఇంతకీ ఆయన ఎమన్నాడంటే..

Irfan Pathan Reacts After Selectors Ignore Umran Malik For South Africa Tour
Irfan Pathan Comments On Umran Malik

Irfan Pathan Comments On Umran Malik : దక్షిణాఫ్రికా పిచ్‌లపై ఆడి నిరూపించుకునేందుకు భారత యువ​ పేసర్​ ఉమ్రాన్‌ మాలిక్‌కు అవకాశం ఇవ్వకపోవడం పట్ల మాజీ ఆల్‌ రౌండర్‌ ఇర్ఫాన్​ పఠాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు​. భారత సెలక్టర్లు ఎంపిక చేసిన తుది జట్లపై మాజీ ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఎక్స్​ (ట్విట్టర్​)లో బహిరింగంగానే పోస్టు పెట్టాడు. ఈ ట్వీట్​లో ఉమ్రాన్​ మాలిక్​కు తన పూర్తి మద్దతును ప్రకటించాడు ఇర్ఫాన్​. 'కనీసం ఈ టూర్​కైనా ఉమ్రాన్‌ మాలిక్‌కు ఓ అవకాశం ఇచ్చి ఉండాల్సింది. గత 11 నెలల క్రితం టీమ్‌ఇండియాలో ఉన్న ప్లేయర్​కు ఈసారైనా జట్టులో స్థానం దక్కుతుందని అనుకున్నాను. కానీ అలా జరగలేదు' అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు ఈ మాజీ ఆల్​రౌండర్​.

  • I’m pretty sure the guy who was in the Indian team’s playing 11 few months back can surely find a place in India A side. #umranmalik

    — Irfan Pathan (@IrfanPathan) November 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Irfan Pathan Umran Malik : ఇప్పుడే కాదు గతంలోనూ అనేక సందర్భాల్లో ఉమ్రాన్‌ మాలిక్‌కు మద్దతుగా నిలిచాడు పఠాన్​. ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన ఈ కశ్మీరీ యువ పేసర్‌కు అక్కడ ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదని పేర్కొన్నాడు. ఈ విషయంపై కూడా అప్పట్లో ట్విట్టర్​ వేదికగా స్పందించాడు ఇర్ఫాన్​. 'ఐపీఎల్‌లోనే అత్యంత వేగవంతమైన బౌలరైన ఉమ్రాన్​ను రిజర్వు బెంచ్‌కే ఎందుకు పరిమితం చేశారో నాకర్థం కావడంలేదు. అతడిని ఎస్ఆర్​హెచ్​ ఫ్రాంఛైజీ సరిగ్గా వినియోగించుకోలేక పోయింది' అని రాసుకొచ్చాడు. ఇదిలా ఉంటే.. ప్రత్యర్ధి బ్యాటర్లకు ధారాళంగా పరుగులిచ్చేస్తాడనే అపవాదు ఉమ్రాన్‌పై ఇప్పటికీ ఉంది. అతడు ఎప్పుడూ లైన్‌ అండ్‌ లెంగ్త్‌ను కోల్పోవడం వల్లే ఈ పరిస్థితులు తలెత్తున్నాయని చాలా మంది అభిప్రాయం. వన్డేల్లో అతడి ఎకానమీ 6.54గా ఉండగా.. టీ20ల్లో మాత్రం ఏకంగా 10.48గా ఉంది.

ఉమ్రాన్​పై మాజీ కోచ్ ఫైర్​​..
Ravi Shastri On Umran Malik : వ్యాఖ్యాత, టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి అప్పట్లో ఉమ్రాన్​పై పలు కీలక కామెంట్స్​ చేశారు. 'ఉమ్రాన్‌ బౌలింగ్‌ను తానే అర్థం చేసుకొనేట్లుగా ప్రయత్నించాలి. ఆటను, ప్రత్యర్థి బ్యాటర్‌ను అర్థం చేసుకోవడం చాలా అవసరం. అతడు ఇప్పుడు ఆలోచిస్తున్న తీరు, అనుసరిస్తున్న విధానం అంతా తప్పని స్వయంగా తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు ఉమ్రాన్‌కు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా.. ఎప్పుడు బంతి వేగంపైనే ఆధారపడి దుమ్మురేపేద్దామనుకొంటాడు. కానీ, అతడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. గంటకు 150 కి.మీ వేగంతో బంతి వేస్తే.. ప్రత్యర్థి బ్యాటర్‌ దానిని గంటకు 250 కి.మీ వేగంతో బాదేస్తాడు. అందుకని ఆటను ముందుగా ఎలా మొదలు పెట్టాలో అతడు కచ్చితంగా తెలుసుకోవాలి. ఉమ్రాన్​ ఎందుకు విఫలమవుతున్నాడో కూడా కోచ్‌లు వీడియో ఫుటేజీల్లో చూపించే ఉంటారు. ఈ క్రమంలో అతడి ఆట తీరును మార్చుకోవాలని సూచనలు ఇవ్వండి' అని రవిశాస్త్రి వ్యాఖ్యానించారు.

అరుదైన ఘనత సాధించిన బంగ్లా బ్యాటర్​- కోహ్లీ, స్మిత్ రికార్డు సమం!

ఇంగ్లండ్‌ సిరీస్‌కు ఎంపిక చేశాక విండీస్‌ వికెట్‌కీపర్‌ సంచలన నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.