ETV Bharat / sports

ఐపీఎల్​లో తొలి సింగపూర్​ ఆటగాడు

author img

By

Published : Aug 22, 2021, 5:06 AM IST

Updated : Aug 22, 2021, 6:37 AM IST

జట్టులో మార్పులు చేసిన ఆర్సీబీ.. సింగపూర్​ ఆటగాడు టిమ్​ డేవిడ్​ను తీసుకుంది. అతడి పేరు ప్రకటించినప్పటి నుంచి ఆ ప్లేయర్​ గురించి ఆరా తీయడం ప్రారంభించారు అభిమానులు. ఇంతకీ అతడు ఎవరు? అతని రికార్డులు ఏంటి?

tim david
టిమ్ డెవిడ్

ఐపీఎల్​ రెండో దశకు రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టులో భారీ మార్పులు చేసింది. కోచ్​ సహా పలువురు కీలక ఆటగాళ్ల స్థానంలో కొత్తవారిని భర్తీ చేసింది. న్యూజిలాండ్​ ఆటగాడు ఫిన్​ అలెన్​ స్థానంలో సింగపూర్​ ఆటగాడు టిమ్​ డేవిడ్​ను ​తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ పేరు వెలుగులోకి వచ్చినప్పుటి నుంచి అభిమానులు అతని గురించి వెతకడం మొదలెట్టారు. ఆర్​సీబీ కీలకంగా భావిస్తున్న ఈ సింగపూర్​ ఆటగాడు.. ఐపీఎల్​లో ఆడటం ఇదే తొలిసారి.

టిమ్​ డేవిడ్.. 1996 మార్చి 16న జన్మించాడు. ​ఇప్పటివరకు అంతర్జాతీయంగా 14 టీ20లు ఆడాడు. వీటిలో నాలుగు అర్ధశతకాలు కూడా ఉన్నాయి. 46.50 సగటుతో 558 పరుగులు చేశాడు. టిమ్.. 158.52తో అత్యధిక​ టీ20 స్ట్రైక్​ రేట్​ను నమోదు చేశాడు. లిస్ట్​ ఏ మ్యాచ్​లు, రాయల్​ లండన్ వన్​డే కప్​ 2021లతో టిమ్​కు గుర్తింపు వచ్చింది. రాయల్​ వన్​డే కప్​లో వరుసగా మూడు మ్యాచ్​లలో 140*, 52*, and 102 పరుగులు చేశాడు. 15 లిస్ట్​ఏ మ్యాచ్​లు అడిన టిమ్​.. 709 పరుగులు చేశాడు.

టిమ్​ ఇప్పటికే పలు దేశీయ టోర్నీలకు ఆడుతున్నాడు. బిగ్​బాష్​ లీగ్, కరీబియన్​ ప్రీమియర్​ లీగ్​, పాకిస్థాన్ సూపర్​ లీగ్​లలో టిమ్​ ఆటగాడిగా కొనసాగాడు. టిమ్​ తండ్రి రోడెరిక్​ డేవిడ్​ కూడా సింగపూర్​కు క్రికెటర్​గా సేవలు అందించారు.

ఇదీ చదవండి:రాజస్థాన్​కు షాక్​.. ఐపీఎల్​కు బట్లర్​ దూరం

Last Updated :Aug 22, 2021, 6:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.