ETV Bharat / sports

దిల్లీ X ముంబయి: మూడో గెలుపు ఎవరిదో?

author img

By

Published : Apr 20, 2021, 5:31 AM IST

చెన్నైలోని చెపాక్​ స్టేడియం వేదికగా మంగళవారం దిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్​ల్లో చెరో రెండు మ్యాచ్​ల్లో గెలిచిన ఇరుజట్లు విజయం కోసం వ్యూహాలను రచిస్తున్నాయి. ​రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్​ ప్రారంభం కానుంది.

Mumbai Indians vs Delhi Capitals
దిల్లీ X ముంబయి

ఐపీఎల్​లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. మంగళవారం దిల్లీ క్యాపిటల్స్​, ముంబయి ఇండియన్స్​​ మధ్య మ్యాచ్​ జరగనుంది. ఇప్పటికే చెరో మూడు మ్యాచ్​లు ఆడిన ఇరుజట్లు.. రెండు మ్యాచ్​ల్లో నెగ్గాయి. ఈ మ్యాచ్​లో గెలిచి పాయింట్ల పట్టికలో మెరుగయ్యేందుకు టీమ్​లు వ్యూహాలను రచిస్తున్నాయి.

బౌలింగ్​ దళమే జట్టు బలం!

ముంబయి ఇండియన్స్​ ఆడిన గత రెండు మ్యాచ్​ల్లోనూ తక్కువ స్కోరును డిఫెండ్​ చేసుకుంటూ వరుసగా రెండు విజయాలను నమోదు చేసింది. ఈ జట్టు విజయంలో బౌలర్లదే కీలకపాత్ర అని చెప్పుకోవాలి. ఇదే బౌలింగ్​ బలంతో హ్యాట్రిక్​ గెలుపును దక్కించుకునేందుకు సంసిద్ధమవుతోంది రోహిత్​ సేన.

ఈ జట్టులో టాప్​ ఆర్డర్​ బ్యాట్స్​మన్​ రాణిస్తున్నా.. మిడిల్​ ఆర్డర్​లోని బ్యాట్స్​మెన్​ తడబాటుకు గురవుతున్నారు. దీని వల్ల జట్టు తక్కువ స్కోరుకే పరిమితమయ్యి.. ఆ తర్వాత ప్రత్యర్థిని కట్టడి చేయడంలో బౌలర్లపై ఎక్కువ భారం పడుతుంది. అయితే ఈ సారి మిడిల్​ ఆర్డర్​లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంది. టాప్​ ఆర్డర్​ విఫలమైనా.. మిడిల్​ ఆర్డర్​ నిలకడగా రాణించి జట్టుకు ఎక్కువ స్కోరు రాబడితే విజయం ఖాయమే!

ధావన్​ మంత్రంతో..

ఓపెనర్​ శిఖర్​ ధావన్​.. దిల్లీ క్యాపిటల్స్​ జట్టుకు విలువైన ఆటగాడు. ఆదివారం పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో నిలకడగా బ్యాటింగ్ చేసి 92 పరుగులు నమోదు చేశాడు. ఈ స్కోరుతో దిల్లీ క్యాపిటల్స్​ జట్టు విజయం సాధించడంలో అతడి ఇన్నింగ్స్​ కీలకపాత్ర పోషించింది. టోర్నీలో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్​మన్​గా 186 పరుగులతో శిఖర్​ ధావన్​ ఆరెంజ్​ క్యాప్​ రేసులో ముందున్నాడు.

శిఖర్​ ధావన్​, పృథ్వీషాతో దిల్లీ క్యాపిటల్స్​ ఓపెనింగ్​ బ్యాటింగ్​ అద్భుతమైన ఫామ్​లో ఉంది. కానీ, మిడిల్​ ఆర్డర్​లోని స్టీవ్​ స్మిత్​ ఆదివారం జరిగిన మ్యాచ్​లో మెచ్చుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. కానీ, ముంబయి లాంటి జట్టుపై ఆధిక స్కోరు నమోదు చేసినట్టయితే.. రోహిత్​సేనను కట్టడి చేయడానికి దిల్లీ బౌలింగ్​ దళానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అయితే ఈసారి అనుభవజ్ఞులైన అమిత్​ మిశ్రా, ప్రవీణ్​ దూబేతో పాటు షామ్స్​ ములానిలను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

జట్లు (అంచనా)..

ముంబయి ఇండియన్స్​: రోహిత్ శర్మ (కెప్టెన్), డికాక్​, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, కీరన్ పొలార్డ్, మార్కో జాన్సెన్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, రాహుల్ చాహర్.

దిల్లీ క్యాపిటల్స్: రిషబ్​ పంత్ (కెప్టెన్), శిఖర్​ ధావన్, పృథ్వీషా, మార్కస్​ స్టోయినిస్, లలిత్ యాదవ్, క్రిస్​ వోక్స్, రవిచంద్రన్​ అశ్విన్, కగిసో రబాడా, ఆవేశ్ ఖాన్, స్టీవ్​ స్మిత్, లక్మన్ మెరివాలా.

ఇదీ చూడండి: ఆ క్రికెటర్లతో పాటు వార్నర్​, విలియమ్సన్ ఉపవాసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.