ETV Bharat / sports

టీమ్​ఇండియాకు షాక్​ ​.. WTC ఫైనల్ ​నుంచి కేఎల్​ రాహుల్​ ఔట్

author img

By

Published : May 5, 2023, 5:16 PM IST

Updated : May 5, 2023, 5:53 PM IST

KL Rahul Injury : గాయం కారణంగా ఐపీఎల్​ నుంచి తప్పుకున్న టీమ్​ఇండియా బ్యాటర్​ కేఎల్ రాహుల్.. జూన్​లో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్​ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.

kl ruled out of ipl and wtc 2023
kl ruled out of ipl and wtc 2023

KL Rahul Injury : టీమ్​ఇండియాను గాయల బెడద వెంటాడుతునే ఉంది. ఇప్పటికే బుమ్రా, శ్రేయస్​ అయ్యర్​ జట్టుకు దూరమవగా.. తాజాగా కేఎల్​ రాహుల్​ ఈ జాబితాలో చేరాడు. ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ సీజన్ 16లో భాగంగా ఇటీవలె లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​, రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూర్​ మధ్య మ్యాచ్ జరిగిన మ్యాచ్​లో రాహుల్ తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రమైన నొప్పితోనే మ్యాచ్​ చివర్లో బ్యాటింగ్​కు వచ్చాడు. గాయం కారణంగా ఐపీఎల్​ నుంచి తప్పుకోగా.. ఇప్పుడు వరల్డ్​ టెస్ట్​ ఛాంపియన్​షిప్​నకూ దూరం అవుతున్నట్లు తెలిపాడు. కాగా తన వ్యక్తిగత వైద్యుల సూచన మేరకు రాహుల్ త్వరలోనే తొడకు సర్జరీ చేయించుకోనున్నాడు.

"బిసిసిఐ వైద్య బృందం సహాయంతో నేను నా తొడ గాయానికి శస్త్రచికిత్స చేయించుకోబోతున్నాను. కొన్ని వారాల్లో తిరిగి మైదానంలోకి రావడానికి ప్రయత్నిస్తా. ఇది చాలా కష్టమైన నిర్ణయం, కానీ ఇది సరైనదని నేను భావిస్తున్నాను. ఈ నిర్ణయం బాధిస్తుంది. లక్నో జట్టుకు కెప్టెన్‌గా మరింత బాధగా ఉంది. కీలకమైన సమయంలో జట్టును విడిచిపెట్టాల్సి వచ్చింది. అయితే, నా సహచరులు అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటారని భావిస్తున్నాను. బయటి నుంచి వారిని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తాను. ప్రతి మ్యాచ్‌ని చూస్తాను.

అలాగే, వచ్చే నెలలో ఓవల్‌ వేదికగా జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో నేను భాగం కాలేకపోతున్నా. త్వరలో టీమ్ఇండియా జెర్సీలో కనబడతానని బలంగా నమ్ముతున్నా. ప్రస్తుతం గాయం నుంచి కోలుకోవడంపై దృష్టి పెట్టాను. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. అభిమానుల ఆశీర్వాదంతో బలంగా తిరిగి వస్తాను. లఖ్​నవూ ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్, బీసీసీఐ, జట్టు సభ్యులు కష్ట సమయాల్లో మద్దతుగా నిలిచారు. మునుపటి కంటే ఫిట్‌గా ఉండి, మీ అందరి ప్రోత్సాహంతో జట్టులో చేరతాను. గాయానికి సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను మీతో పంచుకుంటాను' అని కేఎల్ రాహుల్ వెల్లడించాడు.

ఈ ఐపీఎల్​ సీజన్‌లో లఖ్‌నవూ జట్టు 10 మ్యాచ్‌లు ఆడింది. 11 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. లీగ్‌ దశలో మరో నాలుగు మ్యాచ్‌లను లఖ్​నవూ ఆడాల్సి ఉంది. మరోవైపు జూన్ 7 నుంచి జరిగే వరల్డ్​ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో టీమ్​ఇండియా తలపడనుంది. ఈ క్రమంలో కేఎల్ రాహుల్‌ స్థానంలో భారత జట్టులోకి సూర్యకుమార్‌ యాదవ్‌ను తీసుకొనే అవకాశం ఉంది.

Last Updated : May 5, 2023, 5:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.