ETV Bharat / sports

IPL 2023: అసోంలో 'రాజస్థాన్- పంజాబ్​​'​ మ్యాచ్ ఎందుకు?.. ఈ స్టోరీ మీకు తెలుసా?

author img

By

Published : Apr 5, 2023, 3:44 PM IST

ఐపీఎల్​ 16వ సీజన్​లో భాగంగా రాజస్థాన్​ రాయల్స్​ జట్టు.. నేడు(బుధవారం) పంజాబ్​తో అసోంలో మ్యాచ్​ ఆడనుంది. అసలు అక్కడెందుకు ఐపీఎల్ మ్యాచ్ ఎందుకు జరుగుతోంది? ఈ మెగా లీగ్​లో నార్త్ ఈస్ట్ నుంచి టీమ్ లేకపోయినా అక్కడ ఈ మ్యాచ్ నిర్వహించడానికి కారణమేంటి?

Etv Bharatipl 2023 why rajasthan team home ground ipl match in assam guwahati
ipl 2023 why rajasthan team home ground ipl match in assam guwahati

క్రికెట్​ అభిమానులు.. ఎంతగానో మెచ్చే ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ అట్టహాసంగా ప్రారంభమైంది. పది జట్లు.. తమ బలాబలాలను చూపిస్తూ మ్యాచ్​లను ఆడుతున్నాయి. అయితే 15 ఏళ్లుగా భారత క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ఐపీఎల్.. తొలిసారి ఈశాన్య భారతంలో అడుగుపెడుతోంది. 2008లో లీగ్ ప్రారంభమైన తర్వాత మొదటి సారి ఈ సీజన్​లో అసోంలోని గువహటిలో ఉన్న బర్సపారా స్టేడియం రెండు మ్యాచ్​లకు వేదిక కానుంది.

అందులో ఒకటి బుధవారమే (ఏప్రిల్ 5) రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతోంది. మరో మ్యాచ్ ఏప్రిల్ 8న దిల్లీ క్యాపిటల్స్​తో రాజస్థాన్​ రాయల్స్ ఆడనుంది. అయితే ఎప్పుడూ లేనిది ఈసారి గువహటి.. ఐపీఎల్ మ్యాచ్​లకు ఎందుకు ఆతిథ్యమిస్తోందో తెలుసా?.. రాజస్థాన్ రాయల్స్ టీమ్ ఈ స్టేడియాన్ని తన సెకండ్ హోమ్​గా మార్చుకుంది. అంటే ఆ టీమ్ జైపుర్​తోపాటు గువహటిలోనూ హోమ్ మ్యాచ్​లు ఆడుతుంది. ఐదు మ్యాచ్​లు జైపుర్​లో, రెండు మ్యాచ్​లు గువహాటిలో జరుగుతాయి.

ipl 2023 why rajasthan team home ground ipl match in assam guwahati
గువహటి స్టేడియం

ఈశాన్య భారతంలో క్రికెట్ అభివృద్ధి కోసం రాజస్థాన్ రాయల్స్ నడుం బిగించింది. అందులో భాగంగానే గువహటిని తమ సెకండ్ హోమ్​గా ఎంచుకుంది. ఇక్కడ రెండు మ్యాచ్ లు ఆడాలని నిర్ణయించింది. నిజానికి ఐపీఎల్​ను నార్త్ ఈస్ట్​లోకి తీసుకురావడానికి అసోం క్రికెట్ అసోసియేషన్ తీవ్రంగా ప్రయత్నించింది. 2020లోనే రెండు మ్యాచ్​లు ఫిక్స్​ చేసింది. కానీ ఆ ఏడాది కరోనా కారణంగా ఐపీఎల్ యూఏఈకి తరలిపోయింది. ఈ ఏడాది మళ్లీ ఇంటా, బయట పద్ధతిలో మ్యాచులు నిర్వహించాలని నిర్ణయించడంతో గువాహటిలో మ్యాచ్​లు నిర్వహించే అవకాశం దక్కింది. అయితే రాజస్థాన్​ జట్టు.. గువహటిలో మ్యాచ్​లు నిర్వహించడమే కాకుండా అక్కడి యువ క్రికెటర్లకు కూడా అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించింది.

అయితే గువహటిలోని బర్సపారా స్టేడియంలో ఇప్పటికే పలు అంతర్జాతీయ మ్యాచ్​లు జరిగాయి. ఈ మధ్యే జనవరి 10న భారత్​, శ్రీలంక మధ్య వన్డే జరిగింది. గతేడాది అక్టోబర్ 2న టీమ్​ఇండియా- సౌతాఫ్రికా జట్ల మధ్య టీ20, 2018లో ఇండియా- వెస్టిండీస్ మధ్య వన్డే, 2017లో ఇండియా- ఆస్ట్రేలియా మధ్య టీ20 జరిగాయి. ఈశాన్య భారతదేశంలో అతిపెద్ద స్టేడియం అయిన బర్సపారాలో 40 వేల మంది మ్యాచ్ చూసే అవకాశం ఉంది.

మరోవైపు, లీగ్​లో రాజస్థాన్​ రాయల్స్​, పంజాబ్​ జట్లు తమ తొలి మ్యాచుల్లో విజయాలు సాధించాయి. సన్​రైజర్స్​తో జరిగిన మ్యాచ్​లో రాజస్థాన్​ జట్టు.. 72 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. కోల్​కతాతో తలపడిన పోరులో పంజాబ్​.. డక్​ వర్త్ లాయిస్ పద్ధతిలో గెలుపొందింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.