ETV Bharat / sports

IPL 2023: రాకెట్​ స్పీడ్​లో మార్క్​ వుడ్​ బౌలింగ్​.. ఫాఫ్​​ డుప్లెసిస్​ భారీ సిక్సర్​..

author img

By

Published : Apr 11, 2023, 7:25 AM IST

ఐపీఎల్‌-2023 సీజన్‌లో భాగంగా రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు-లఖ్​నవూ సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన ఉత్కంఠ మ్యాచ్​లో మార్క్​వుడ్​ బౌలింగ్ అందర్నీ ఆకట్టుకోగా.. ఆర్సీబీ కెప్టెన్​ ఫాఫ్​ డుప్లెసిస్​ లాంగెస్ట్ సిక్సర్​ బాదాడు. ఆ వివరాలు..

IPL 2023 RCB VS Lucknow  Markwood 1 over 7 balls 150 km speed and Faf duplesis long sixer
IPL 2023: రాకెట్​ స్పీడ్​లో మార్క్​ వుడ్​ బౌలింగ్​.. ఫాఫ్​​ డుప్లెసిస్​ భారీ సిక్సర్​..

ఐపీఎల్‌-2023 సీజన్‌లో భాగంగా రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుతో జరిగిన ఉత్కంఠ మ్యాచ్​లో లఖ్​నవూ సూపర్ జెయింట్స్​ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్​లో లఖ్​నవూ పేసర్‌ మార్క్‌ వుడ్‌ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. తాజా సీజన్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచులు ఆడిన అతడు 9 వికెట్లు తీశాడు. అయితే ఆర్సీబీతో జరిగిన మ్యచ్​లో ఓ ఓవర్‌లో ఏకంగా రాకెట్​ స్పీడ్‌తో బౌలింగ్ వేశాడు. బెంగళూరు ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌లో మార్క్​వుడ్‌.. తాను వేసిన 7 బంతులు(వైడ్​తో పాటు)ను 150 కిలోమీటర్ల వేగాంతో సంధించి షాక్​కు గురి చేశాడు.

అతడు ఫస్ట్​ బాల్​ను 150కి.మి వేగంతో సంధించాడు. కానీ అది వైడ్​ బాల్​. ఆ తర్వాత బంతులను 153, 151, 150, 150, 151.7, 150కి.మిల వేగంతో వేసి ప్రత్యర్థి బ్యాట్లర్లను బెంబేలెత్తించాడు. ఇకపోతే అతడు తొలి ఓవర్‌లో 14 పరుగులు, రెండో ఓవర్‌లో 5 రన్స్​, మూడో ఓవర్‌లో 9 పరుగులు, నాలుగో ఓవర్‌లో 9 రన్స్​ సమర్పించుకున్నాడు. నాలుగో ఓవర్‌లో మ్యాక్స్‌వెల్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేసి ఓ వికెట్ తీశాడు. కాగా, ఓవర్‌లో ప్రతి బంతిని ఈ రేంజ్​ స్పీడ్​లో వేయడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఈ మధ్య కాలంతో గత మ్యాచుల్లోనూ ఇలానే నిప్పులు చెరిగే బౌలింగ్​ చేస్తున్నాడు.

లాంగెస్ట్ సిక్సర్..​ ఈ మ్యాచ్​లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ ఓ భారీ సిక్సర్​ బాదాడు. దాదాపు 115 మీటర్ల భారీ సిక్సర్​ను కొట్టాడు. ఈ సిక్స్‌ ఏకంగా మైదానం బయటకు దూసుకెళ్లింది. ఇది చూసిన స్టేడియంలోని అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. బిష్ణోయ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌ నాలుగో బాల్​ను.. డుప్లెసిస్‌ ఈ మాన్‌స్టర్‌ సిక్సర్‌ను బాదాడు. ఐపీఎల్‌-2023 సీజన్​లో ఇదే అత్యంత భారీ సిక్సర్‌. మొత్తంగా ఐపీఎల్‌ హిస్టరీలో ఇది 10వ భారీ సిక్సర్‌గా నిలిచింది. ఐపీఎల్‌ అరంగేట్రం సీజన్‌(2008) సమయంలో సీఎస్కే ప్లేయర్​ ఆల్బీ మోర్కెల్‌(125 మీటర్లు), 2013లో పంజాబ్‌ ప్లేయర్​ ప్రవీణ్‌ కుమార్‌(124 మీటర్లు), 2011లో గిల్‌క్రిస్ట్‌(122 మీటర్లు), 2010లో ఉతప్ప(120 మీటర్లు), 2013 గేల్‌(119), 2009లో యువరాజ్‌ సింగ్(119), 2008లో రాస్‌ టేలర్‌(119), 2016లో బెన్‌ కట్టింగ్‌(117 మీటర్లు), 2013లో గంభీర్‌(117 మీటర్లు) సిక్సర్‌ బాదారు.

ఇకపోతే ఈ థ్రిల్లర్​ మ్యాచ్​లో పూరన్‌ (62; 19 బంతుల్లో 4×4, 7×6), స్టాయినిస్‌ (65; 30 బంతుల్లో 6×4, 5×6), బదోని (30; 24 బంతుల్లో 4×4) చెలరేగడంతో ఒక్క వికెట్‌ తేడాతో బెంగళూరుపై లఖ్​నవూ గెలిచింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బెంగళూరు బౌలర్లలో సిరాజ్​, పర్నెల్​ తలో మూడు వికెట్లు తీశారు. హర్షల్ పటేల్ 2, కర్ణ్​ ఒక వికెట్​ పడగొట్టాడు. అంతకుముందు ఆర్సీబీ ఇన్నింగ్స్​లో కోహ్లి(61) డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్‌ కూడా దంచేశారు.

ఇదీ చూడండి: IPL 2023: ఉత్కంఠ మ్యాచ్​లో ఆర్సీబీపై లఖ్​నవూ విజయం.. పూరన్‌, స్టాయినిస్‌ విధ్వంసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.