ETV Bharat / sports

RR Vs PBKS: గువాహటిలో ఫస్ట్​ IPL మ్యాచ్​.. టాస్​ ఎవరు గెలిచారంటే?

author img

By

Published : Apr 5, 2023, 7:03 PM IST

ఐపీఎల్​ 16వ సీజన్​లో ఇప్పటికే బోణీలు కొట్టిన రాజస్థాన్​, పంజాబ్​ జట్ల మధ్య మ్యాచ్​ ప్రారంభమైంది. అందులో భాగంగా టాస్​ గెలుచుకున్న రాజస్థాన్​ బౌలింగ్​ ఎంచుకుంది.

ipl 2023 punjab kings rajasthan royals match
ipl 2023 punjab kings rajasthan royals match

ఎట్టకేలకు అసోంలోని గువాహటి బర్సాపుర క్రికెట్‌ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ తొలి మ్యాచ్‌ ప్రారంభమైంది. పంజాబ్​ కింగ్స్​, రాజస్థాన్​ రాయల్స్​ తమ రెండో విజయం కోసం ఆరాటపడుతున్నాయి. అందులో భాగంగా టాస్​ గెలుచుకున్న రాజస్థాన్​..​ బౌలింగ్​​ ఎంచుకుంది. ప్రత్యర్థి పంజాబ్​కు బ్యాటింగ్​ అప్పగించింది.

2018లో జరగాల్సింది కానీ..
ఐపీఎల్‌ మ్యాచ్‌ల కోసం గువాహటి స్టేడియాన్ని అసోం క్రికెట్‌ అసోసియేషన్‌ 2018లో బీసీసీఐకి సిఫార్సు చేసింది. రెండేళ్ల తర్వాత 2020లో ఐపీఎల్‌ మ్యాచ్‌లను నిర్వహించేందుకు అనుమతినిచ్చింది. కానీ కరోనా కారణంగా టోర్నీ యూఏఈకి తరలిపోయింది. ఆ తర్వాత రెండేళ్లు కూడా హోం గ్రౌండ్స్‌లో మ్యాచ్‌లు జరగలేదు. ఇప్పుడు మరోసారి ఇంటా, బయటా తరహాలో లీగ్​ జరుగుతున్నందున.. రాజస్థాన్‌ తన రెండో హోం గ్రౌండ్‌గా గువాహటిని ఎంపిక చేసుకుంది. దీంతో ఇక్కడ రెండు మ్యాచ్‌లుకు అనుమతినిచ్చింది బీసీసీఐ.

ఇప్పటి వరకు రెండే..
ఇప్పటి వరకు గువాహటి మైదానంలో రెండు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు జరిగాయి. మూడో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు అయింది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌ కావడంతో అభిమానులకు ఫుల్‌ మజా రావడం ఖాయమని క్రికెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు ఒకసారి, లక్ష్య ఛేదనకు దిగిన జట్టు మరోసారి విజయం సాధించడం గమనార్హం.

ఈ మైదానంలో అత్యధికంగా దక్షిణాఫ్రికాపై భారత్‌ 237/3 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలోనూ దక్షిణాఫ్రికా దీటుగానే సమాధానం ఇచ్చింది. డేవిడ్ మిల్లర్ (106*) శతకం సాధించినప్పటికీ 16 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో ఆసీస్‌ చేతిలో 8 వికెట్ల తేడాతో టీమ్‌ఇండియా పరాజయం పాలైంది. కేవలం 118 పరుగులకే ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో ఆసీస్‌ కేవలం 2 వికెట్లను మాత్రమే కోల్పోయి విజయం సాధించింది.

పిచ్‌ రిపోర్ట్‌ ఇలా..
గువాహటి మైదానం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. అలాగే ఫాస్ట్‌ బౌలింగ్‌కు సహకరిస్తుందన్నారు. గతేడాది భారత్‌, దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో బ్యాటర్ల హవా కొనసాగింది. ఇరు జట్లూ 200కిపైగా పరుగులు సాధించాయి. ఇప్పుడు రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టులోనూ హిట్టర్లకు కొదవేం లేదు. తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌పై యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్ అర్ధశతకాలు బాదారు.

శిఖర్ ధావన్‌, భానుక రాజపక్స, సికిందర్ రజా, సామ్ కరన్‌తో కూడిన పంజాబ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ కూడా బలంగానే ఉంది. అయితే ఎస్‌ఆర్‌హెచ్‌పై విజయంతో ఊపు మీదున్న రాజస్థాన్‌ను అడ్డుకోవాలంటే పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్లు తీవ్రంగా కృషి చేయాలి. ఇరు జట్లూ తమ తొలి మ్యాచుల్లో విజయం సాధించడంతో ఈ మ్యాచ్‌ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.