ETV Bharat / sports

IPL 2023 KKR VS GT : అరుదైన దృశ్యం.. బ్యాటింగ్​.. బౌలింగ్​.. ఫీల్డింగ్​.. ఆ ముగ్గురు ఒకటే..!

author img

By

Published : Apr 29, 2023, 7:34 PM IST

Updated : Apr 29, 2023, 7:51 PM IST

ఐపీఎల్​ 2023 సీజన్‌లో భాగంగా కోల్​కతా నైట్ రైడర్స్​- గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్​లో ఓ అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

IPL 2023 KKR VS GT match
IPL 2023 KKR VS GT match

ఇండియన్ ప్రీమియర్​ లీగ్​ 2023 సీజన్‌లో భాగంగా కోల్​కతా నైట్ రైడర్స్​- గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్​లో ఓ అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. దీంతో ఈ అరుదైన సంఘటన సోషల్​మీడియాలో ట్రెండింగ్​గా మారింది. అదేంటంటే.. ఐపీఎల్‌లో హాఫ్ సెంచరీ బాదిన తొలి ఆఫ్గానిస్థాన్​ క్రికెటర్‌గా నిలిచిన కెకేఆర్ ఓపెనర్​ రెహ్మానుల్లా గుర్బాజ్.. తాజా ఇన్నింగ్స్​లో ​39 బంతుల్లో 81; 5x4, 7x6 మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి మరో అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. అంతకుముందు మహ్మద్ నబీ, ముజీబ్ వుర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ వంటి అఫ్గానిస్థాన్​కు చెందిన స్టార్​ ప్లేయర్లు.. ఐపీఎల్‌లో 50 ప్లస్ స్కోరును నమోదు చేయలేకపోయారు. ఇకపోతే గతేడాది కేకేఆర్‌లో ఉన్న రెహ్మనుల్లా గుర్భాజ్.. అప్పుడు ఒక్క మ్యాచ్‌లో కూడా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. కానీ ఈ సారి చోటు సంపాదించుకున్న అతడు హాఫ్ సెంచరీలతో చెలరేగుతున్నాడు.

అలా అఫ్గానిస్థాన్​ చెందిన ఇతడు తాజా మ్యాచ్​లో కేవలం 39 బంతుల్లోనే ఏడు సిక్సర్లు, ఐదు ఫోర్ల సాయంతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ.. 81 పరుగులు చేశాడు. ధాటిగా ఆడుతున్న అతడిని ఔట్‌ చేయడానికి గుజరాత్​ బౌలర్లు చాలా శ్రమించారు. అయితే నూర్‌ అహ్మద్‌ ఎట్టకేలకు గుర్బాజ్‌ను పెవిలియన్ పంపించాడు. ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ సెకండ్​ బాల్​ను గుర్బాజ్‌.. డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా భారీ షాట్‌ ఆడాడు. అయితే అక్కడే ఉన్న రషీద్‌ ఖాన్‌ అతడి క్యాచ్‌ పట్టుకున్నాడు.

అయితే ఇక్కడ విశేషమేమిటంటే.. బ్యాటింగ్‌ ఆడిన రెహ్మానుల్లా, బంతిని సంధించిన నూర్‌ అహ్మద్‌, క్యాచ్‌ అందుకున్న రషీద్‌ ఖాన్‌.. ఈ ముగ్గురు ఆటగాళ్లు ఒక దేశానికి చెందిన ప్లేయర్సే కావడం విశేషం. ప్రస్తుతం ఈ ముగ్గురు అఫ్గానిస్థాన్​​ జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలా బ్యాటింగ్‌ ఆడిన వ్యక్తి.. బౌలింగ్​ చేసిన ప్లేయర్​.. క్యాచ్‌ పట్టిన ఆటగాడు.. ఒకే దేశానికి చెందినవారు కావడం చాలా అరుదుగా చూస్తుంటాం. తాజాగా ఐపీఎల్‌.. ఈ అరుదైన దృశ్యానికి వేదిక అయింది.

  • What a coincidence happened with Rahmanullah Gurbaz wicket , Afghanistan batter got out by bowler noor ahmed and caught by Rashid khan all three are Afghani

    kisi ne sahi kaha h apne apne ke dusman hote h ! #KKRvGT #RashidKhan #Gurbaz#rinkusingh

    — Atif (@VGaming84766254) April 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రషీద్​ రెండో సారి ఇలా.. తాజా మ్యాచ్​లో రషీద్​ ఖాన్​ పేలవ ప్రదర్శన చేశాడు. 2018 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్​కు ప్రాతినిధ్యం వహించిన అతడు.. అప్పుడు పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఓ మ్యాచ్​లో ఏకంగా 55 పరుగులు సమర్పించుకున్నాడు. మళ్లీ ఇప్పుడు కేకేఆర్​ తరఫున ఆడుతున్న అతడు... తాజా మ్యాచ్​లో వికెట్ తీయకుండా 54 పరుగులు సమర్పించుకుని.. ఐపీఎల్‌లో రెండో సారి చెత్త ప్రదర్శన నమోదు చేశాడు.

ఇదీ చూడండి: IPL 2023 : రెహ్మానుల్లా గుర్బాజ్ మెరుపు ఇన్నింగ్స్​​​.. వెనక్కి పరిగెడుతూ మోహిత్ శర్మ డైవింగ్​ క్యాచ్​!

Last Updated : Apr 29, 2023, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.