ETV Bharat / sports

IPL 2023 : టెస్ట్ మ్యాచ్​లా గుజరాత్ ఇన్నింగ్స్​.. ఫ్లైయింగ్ కిస్​తో కృనాల్ సెలబ్రేషన్స్​

author img

By

Published : Apr 22, 2023, 7:07 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్​ 2023లో భాగంగా లఖ్​నవూ సూపర్‌ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్​ తమ ఇన్నింగ్స్​ను పూర్తి చేసింది. ఆ వివరాలు..

IPL 2023 Gujarat titans vs Lucknow super giants
IPL 2023 : టెస్ట్ మ్యాచ్​లో గుజరాత్ఇ​.. ఫ్లైయింగ్ కిస్​తో కృనాల్ సెలబ్రేషన్స్​

ఇండియన్ ప్రీమియర్ లీగ్​ 2023లో భాగంగా లఖ్​నవూ సూపర్‌ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ గుజరాత్‌ టైటాన్స్‌ పేలవ ప్రదర్శన చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్​కు దిగిన గుజరాత్​.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్‌ వృద్ధిమాన్‌ సాహా (47; 37 బంతుల్లో 6x4), కెప్టెన్‌ హార్దిక్ పాండ్య (66; 50 బంతుల్లో 2x4, 4x6) రాణించారు. ఇక శుభ్‌మన్‌ గిల్‌ డకౌట్‌ కాగా విజయ్‌ శంకర్‌ (10), అభినవ్‌ మనోహర్‌ (3), మిల్లర్‌ (6) విఫలమయ్యారు.

అయితే వీరు తమ ఇన్నింగ్స్‌ ఆరంభంలో చాలా నిదానంగా ఆడారు. దీంతో మ్యాచ్‌ను వీక్షిస్తున్న ప్రేక్షకులకు విసుగు వచ్చింది. ముఖ్యంగా హార్దిక్​.. ఇన్నింగ్స్‌ ఆరంభంలో బ్యాటింగ్‌ చేసిన విధానం మరీ స్లోగా అనిపించింది. వికెట్‌ స్లోగా ఉన్నప్పుడు ఫస్ట్​ బ్యాటింగ్‌ చేయాల్సిన అవసరం ఏముందని ఫ్యాన్స్‌ అడుగుతున్నారు. గుజరాత్‌ ఇన్నింగ్స్‌ను చూస్తుంటే టెస్ట్‌ మ్యాచులా ఉందని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇన్నింగ్స్‌ ఆఖర్​లో మాత్రం హార్దిక్ దూకుడు ప్రదర్శించకపోతే.. ఐపీఎల్‌ హిస్టరీలో అత్యంత స్వల్ప స్కోర్‌ నమోదయ్యేది అని చెబుతున్నారు. వాస్తవానికి ఈ స్లో ట్రాక్‌పై పరుగులు చేయడం చాలా ఇబ్బందిగా ఉండడంతోనే హార్దిక్​.. ఆరంభంలో కాస్త నిదానంగా ఆడాల్సి వచ్చింది. సాహా వేగంగా పరుగులు చేద్దామనుకున్నా కుదరలేదు. ఈ క్రమంలోనే అతడు ఔటయ్యాడు. ఇక గుజరాత్‌ బ్యాటర్లను కట్టడి చేయడంలో లఖ్​నవూ బౌలర్లు మంచి ప్రదర్శన చేశారు. నవీన్‌ ఉల్‌ హాక్‌ (4-0-19-1), కృనాల్‌ పాండ్య (4-0-16-2), స్టోయినిస్‌ (3-0-20-2), అమిత్‌ మిశ్రా (2-0-9-1) మంచిగా బంతులు సంధించారు.

ఫ్లైయింగ్ సెలబ్రేషన్స్​.. ఇక ఈ మ్యాచ్​లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. గుజరాత్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ డకౌట్‌ అయినప్పుడు.. కృనాల్‌ పాండ్య చేసుకున్న సెలబ్రేషన్‌ వైరల్‌గా మారింది. కృనాల్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ సెకండ్​ బాల్​ను గిల్‌ లాంగాఫ్‌ దిశగా ఆడాడు. అయితే అక్కడే ఉన్న బిష్ణోయి దాన్ని క్యాచ్‌ పట్టుకున్నాడు. దీంతో గిల్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. అప్పుడు కృనాల్​.. ఆకాశంవైపు చూస్తూ ప్లైయింగ్‌ కిస్‌తో సెలబ్రేషన్‌ చేసుకున్నాడు.

స్టోయినిస్​ వంద వికెట్లు.. ఈ మ్యాచ్‌లో మిల్లర్‌ వికెట్‌ తీయడంతో మార్కస్‌ స్టోయినిస్‌ ఓ మార్క్​ను అందుకున్నాడు. టీ20ల్లో వంద వికెట్లను పూర్తి చేసుకున్నాడు. 225 టీ20 మ్యాచ్‌ల్లో అతడీ ఘనత సాధించాడు. గుజరాత్‌ ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌ వేశాడు స్టోయినిస్‌.. ఆ ఓవర్​లో లాస్ట్ బాల్​కు మిల్లర్‌ భారీ షాట్‌కు యత్నించి దీపక్‌ హుడాకు క్యాచ్‌ ఇచ్చి ఔట్ అయ్యాడు. అంతకముందు గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య వికెట్‌ను తీశాడు. అలా ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక స్టోయినిస్‌ అంతర్జాతీయ కెరీర్‌ విషయానికొస్తే.. 60 వన్డేల్లో(1326 పరుగులు, 40 వికెట్లు) 51 టీ20ల్లో(803 పరుగులు,18 వికెట్లు) ఆడాడు.

ఇదీ చూడండి : 2023 వరల్డ్​కప్​లో టీమ్​ఇండియా​ వికెట్​కీపర్​ అతడేనా?.. ఛాన్స్​ కొట్టేశాడుగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.