ETV Bharat / sports

IPL 2023 Final : ఆ సెంటిమెంట్​ రిపీట్​ అయితే.. విజయం 'చెన్నై'దే!

author img

By

Published : May 28, 2023, 4:29 PM IST

IPL 2011 Winner
2011 ఐపీఎల్​ టైటిల్ గెలిచిన చెన్నై

IPL 2023 Final Coincidence : ఐపీఎల్ 16వ సీజన్​లో చివరిదైన ఫైనల్ మ్యాచ్​ మరికొద్దిసేపట్లో ప్రారంభంకానుంది. టోర్నీ లీగ్​ దశలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన టాప్ 2 జట్లే ఫైనల్​ ఆడనున్నాయి. ఈ క్రమంలో చెన్నై ఐదోసారి విజేతగా నిలవటం ఖాయమని ధోనీ అభిమానులు ధీమాగా ఉన్నారు. అయితే వారి నమ్మకానికి కారణం లేకపోలేదు. అదేంటంటే..

IPL 2023 Final : చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి టైటిల్ నెగ్గుతుందని సీఎస్కే ఫ్యాన్స్ ఓ లాజిక్​ను ఆధారంగా ఎక్స్​పెక్టేషన్స్​ పెట్టుకుంటున్నారు. అలాగే సీఎస్కే సారథి ధోనీకి కూడా ఫైనల్ మ్యాచ్​ జరగనున్న మే 28 వ తేదితో మంచి అనుబంధం ఉంది. ఇంతకీ అసలు సంగతేంటి అంటే..

IPL 2011 Final Csk vs Rcb : సరిగ్గా 12 ఏళ్ల కింద 2011 ఐపీఎల్​లోనూ చెన్నై ఫైనల్ మ్యాచ్​ ఆడింది. అప్పటి పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్​లో ఉండగా.. చెన్నై రెండో స్థానంలో నిలిచింది. ఈ ఇరు జట్ల మధ్య జరిగిన క్వాలిఫయర్- 1లో సీఎస్కే గెలిచి నేరుగా ఫైనల్ చేరింది. క్వాలిఫయర్- 1లో ఓడిన ఆర్​సీబీ, క్వాలిఫయర్- 2లో ముంబయి ఇండియన్స్​ను చిత్తుచేసి ఫైనల్​కు చేరింది. ఫైనల్​​లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 205 పరుగులు చేసింది. ఇక ఆర్​సీబీని 147 స్కోరుకే పరిమితం చేసిన చెన్నై వరుసగా రెండో టైటిల్ నెగ్గి రికార్డు సృష్టించింది.

ఇక ప్రస్తుత ఐపీఎల్​ చూస్తే దాదాపు అదే సినారియో రిపీట్ అయింది! ఆదివారం ఫైనల్ మ్యాచ్​ ఆడనున్న గుజరాత్, చెన్నై జట్లు ఈ సీజన్​లో టాప్​ రెండు స్థానాల్లో నిలిచాయి. ఇందులో టేబుల్ టాపర్ గుజరాత్..​ క్వాలిఫయర్- 1లో సీఎస్కే చేతిలో పరాజయం పాలైంది. దీంతో జీటీ .. క్వాలిఫయర్ - 2 ఆడాల్సి వచ్చింది. అప్పటిలాగే ఇప్పుడు కూడా లీగ్ టేబుల్ టాపర్ గుజరాత్, ముంబయి ఇండియన్స్ మధ్య క్వాలిఫయర్ - 2 మ్యాచ్ జరిగింది. టేబుల్ టాపర్ గెలిచి ఫైనల్​కు వెళ్లగా.. ముంబయి ఇంటి బాట పట్టింది.

అయితే ఈ రెండు సీజన్ల మధ్య ఉన్న కామన్ పాయింట్.. అప్పుడు ఇప్పుడు చెన్నై టేబుల్​లో రెండో స్థానంలో ఉంది. ఈ రెండు సీజన్లలోను క్వాలిఫయర్- 1లో ఆడిన సీఎస్కే టేబుల్ టాపర్​ను చిత్తుచేసింది. క్వాలిఫయర్​ -1లో భంగపడ్డ అప్పటి ఆర్​సీబీ, ఇప్పటి జీటీ ఈ రెండూ కూడా క్వాలిఫయర్​ -2 లో ముంబయితోనే తలపడాల్సి రావటం గమనార్హం. 2011లో సక్సెస్​ఫుల్​గా ఆర్​సీబీ ఫైనల్​ చేరినా అదృష్టం వరించలేదు. అలాగే ఈ ప్రెడిక్షన్ ఆధారంగా చెన్నై గుజరాత్​ను ఓడిస్తుందంటూ.. ఈ కో- ఇన్సిడెన్స్​లు మళ్లీ జరుగవచ్చన్న ఆశతో అభిమానులు ఎదురుచూస్తున్నారు.

IPl 2011 Winner Csk
2011 ఐపీఎల్​ టైటిల్ గెలిచిన చెన్నై

ICC WC 2011 Seniment : ఇక మరోవైపు ఇంకో సెంటిమెంట్ కూడా సీఎస్కే ఫ్యాన్స్​లో ఆశలు రేకెత్తిస్తోంది. 2011, 2023 సీజన్​ల ఫైనల్ మ్యాచ్​లు మే 28వ తేదినే ఉన్నాయి. కాగా ఈ రెండు సంవత్సరాల్లో ఐసీసీ నిర్వహిస్తున్న వన్డే ప్రపంచ కప్​నకు భారత్​ ఆతిధ్యమివ్వనుండటంతో చెన్నై ఫ్యాన్స్​ 'అన్నీ మంచి శకునములే' అంటూ సోషల్ మీడియాలో సంబరాలు మొదలు పెట్టేశారు. ఇకపోతే అహ్మదాబాద్​ వేదికగా ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ ఆదివారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభంకానుంది. టైటిల్​పై అటు చెన్నై ఇటు గుజరాత్ జట్లు కన్నేశాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.