ETV Bharat / sports

IPL 2023: దంచి కొట్టిన చెన్నై.. లఖ్​నవూపై విజయం

author img

By

Published : Apr 3, 2023, 11:01 PM IST

Updated : Apr 4, 2023, 6:13 AM IST

ఐపీఎల్​లో భాగంగా చెన్నై సూపర్​ కింగ్స్​, లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ జట్ల మధ్య మ్యాచ్​ రసవతర్తంగా సాగింది. అయితే ఈ మ్యాచ్​లో చెన్నై సూపర్​ కింగ్స్ విజయం సాధించింది.

ipl 2023
ipl 2023

ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో నాలుగుసార్లు ఛాంపియన్‌ అయిన చెన్నై సూపర్‌కింగ్స్‌.. ఇప్పుడు 16వ సీజన్‌లో బోణీ కొట్టింది. 12 పరుగుల తేడాతో లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్‌ను ఓడించింది. 218 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన లఖ్​నవూలో.. మేయర్స్‌ ఉన్నంతసేపు ఛేదన కష్టమేమీ కాదనే అనిపించింది. తమ ఫస్ట్​ మ్యాచ్​లో దిల్లీపై చెలరేగిపోయిన ఈ విండీస్‌ వీరుడు.. చెన్నై మీదా కూడా అదే దూకుడు ప్రదర్శించాడు. దొరికిన బంతిని దొరికినట్లుగా బాదుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. మేయర్స్‌ దెబ్బకు 2-5 మధ్య ఓవర్లలో వరుసగా 18, 13, 18, 17 పరుగులు వచ్చాయి. 5 ఓవర్లకే స్కోరు 73కు చేరుకుంది. అయితే పవర్‌ ప్లే చివరి ఓవర్లో బంతిని అందుకున్న మొయిన్‌ అలీ మేయర్స్‌ను దూకుడును అడ్డుకున్నాడు. మేయర్స్​ను మాత్రమే కాదు మిగతా వారిని ఔట్​ చేశాడు. ఓవర్‌కో వికెట్‌ చొప్పున పడగొట్టాడు. రాహుల్‌ (20), కృనాల్‌ (9), స్టాయినిస్‌ (21) అతడికి వికెట్లు సమర్పించుకోవడంతో లఖ్‌నవూ లక్ష్యానికి దూరమైంది. ఉన్నంతసేపు ధాటిగా ఆడిన పూరన్‌ (32; 18 బంతుల్లో 2×4, 3×6) కాస్త ఆశలు రేపినా.. అతను ఔటయ్యాక లఖ్‌నవూ పనైపోయింది. బదోని (23), గౌతమ్‌ (17 నాటౌట్‌)ల పోరాటం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది.

అంతకుముందు టాస్​ ఓడిన బ్యాటింగ్​కు దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. చెన్నై ఓపెనర్​ రుతురాజ్‌ గైక్వాడ్ (57; 31 బంతుల్లో 3×4, 4×6) మెరుపులు మెరిపించాడు. మరో ఓపెనర్​ డేవాన్‌ కాన్వే (47; 29 బంతుల్లో 5×4, 2×6) రాణించాడు. శివమ్‌ దూబె (27) క్రీజులో ఉన్నంత సేపు దూకుడుగా ఆడాడు. చివర్లో అంబటి రాయుడు (27) పర్వాలేదనంపించాడు. బెన్​స్టోక్ట్స్​, జడేజా నిరాశపరిచారు. ఆఖర్లో ధోనీ సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 3 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ధోనీ 2 సిక్స్‌లతో 12 పరుగులు చేశాడు. లఖ్​నవూ బౌలర్లో మార్క్​వుడ్​, బిష్ణోయ్‌ తలా మూడు వికెట్లు సాధించగా.. ఆవేశ్​ ఖాన్‌ ఒక్క వికెట్‌ పడగొట్టాడు.అవేశ్‌ ఖాన్ ఒక వికెట్ తీశాడు.

సీఎస్‌కే ఓపెనర్ల సరికొత్త చరిత్ర.. ఇదే తొలిసారి
సీఎస్​కే ఓపెనర్లు రుత్‌రాజ్‌ గైక్వాడ్‌, డేవాన్‌ కాన్వే విధ్వంసం సృష్టించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 110 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తద్వారా ఈ జోడీ ఓ అరుదైన ఘనతను తమ పేరిట లిఖించుకుంది. ఐపీఎల్‌లో సీఎస్‌కే తరపున అత్యధిక సార్లు సెంచరీ భాగస్వా‍మ్యం నమోదు చేసిన జోడీగా వీరిద్దరూ నిలిచారు. ఇప్పటి వరకు వీరిద్దరూ మూడు సార్లు సెంచరీ భాగస్వా‍మ్యం నెలకొల్పారు. ఇంతకుముందు వరకు ఈ రికార్డు మురళీ విజయ్, మైఖేల్ హస్సీ పేరిట ఉండేది. వీరిద్దరూ రెండు సార్లు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. తాజా మ్యాచ్‌తో ఈ రికార్డును గైక్వాడ్‌, కాన్వే బ్రేక్‌ చేశారు.

ధోనీ@5000
ఈ మ్యాచ్​లో చెన్నై కెప్టెన్​ ధోనీ.. అరుదైన ఘనతను సాధించాడు. లీగ్​ చరిత్రలో 5000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఐపీఎల్​లో 5000 పరుగులు పూర్తి చేసుకున్న ఏడో ప్లేయర్​గా రికార్డుకెక్కాడు. బెస్ట్​ ఫినిషనర్​గా పేరు సంపాదించిన మహి.. లీగ్​ చరిత్రలో 20వ ఓవర్‌లో 277 బంతుల్లో 49 ఫోర్లు, 55 సిక్సర్లతో బాదాడు.

Last Updated : Apr 4, 2023, 6:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.