ETV Bharat / sports

CSK Vs LSG: దుమ్మురేపిన గైక్వాడ్​, కాన్వే.. లఖ్​నవూకు భారీ టార్గెట్​

author img

By

Published : Apr 3, 2023, 9:25 PM IST

Updated : Apr 3, 2023, 10:07 PM IST

చెపాక్​ స్టేడియంలో లఖ్​నవూతో జరుగుతున్న మ్యాచ్​లో చెన్నై ఇన్నింగ్స్​ పూర్తయింది. 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు సాధించింది. ప్రత్యర్థికి 218 పరుగుల టార్గెట్​ను నిర్దేశించింది.

ipl 2023 CSK Vs LSG
ipl 2023 CSK Vs LSG

చెన్నై చెపాక్​ స్డేడియం అంతా పసుపు మయంగా మారింది. ధోనీ సేన అభిమానులు కేరింతలతో స్టేడియం హోరెత్తింది. అయితే ఐపీఎల్​ 16వ సీజన్​లో భాగంగా.. ఆ స్టేడియంలో నాలుగేళ్ల మ్యాచ్​ జరుగుతోంది. లఖ్​నవూతో జరుగుతున్న మ్యాచ్​లో చెన్నై టీమ్​ ఇన్నింగ్స్​ ముగిసింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు సాధించింది. ప్రత్యర్థి లఖ్​నవూ జట్టుకు 218 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చెన్నై బ్యాటర్లలో రుతురాజ్​ గైక్వాడ్(57)​ మెరుపు షాట్లతో అలరించాడు. హాఫ్​ సెంచరీతో మెరిశాడు. మరో ఓపెనర్​ కాన్వే కూడా రాణించాడు. శివమ్​, మెయిన్​ అలీ, అంబటి రాయుడు పర్వాలేదనిపించారు. బెన్​స్టోక్ట్స్​, జడేజా నిరాశపరిచారు. ఆఖర్లీ ధోనీ సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 3 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ధోని 2 సిక్స్‌లతో 12 పరుగులు చేశాడు. లఖ్​నవూ బౌలర్లో మార్క్​వుడు, బిష్ణోయ్‌ తలా మూడు వికెట్లు సాధించగా.. ఆవేశ్​ ఖాన్‌ ఒక్క వికెట్‌ పడగొట్టాడు.

ధోనీ@5000
ఈ మ్యాచ్​లో చెన్నై కెప్టెన్​ ధోనీ.. అరుదైన ఘనతను సాధించాడు. లీగ్​ చరిత్రలో 5000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఐపీఎల్​లో 5000 పరుగులు పూర్తి చేసుకున్న ఏడో ప్లేయర్​గా రికార్డుకెక్కాడు. బెస్ట్​ ఫినిషనర్​గా పేరు సంపాదించిన మహి.. లీగ్​ చరిత్రలో 20వ ఓవర్‌లో 277 బంతుల్లో 49 ఫోర్లు, 55 సిక్సర్లతో బాదాడు.

ధోనీ బ్యాటింగ్​.. జియోలో..
మరోవైపు, ధోనీ బ్యాటింగ్​ కోసం నేటి మ్యాచ్​లో అనేక మంది అభిమానులు ఎదురుచూశారు. ఆఖర్లో ధోనీ క్లీజులోకి వచ్చాడు. అయితే లఖ్​నవూతో జరుగుతున్న మ్యాచ్​లో ధోనీ బ్యాటింగ్​ను 1.7 కోట్ల మంది వీక్షించారు. గుజరాత్​తో జరిగిన మ్యాచ్​లో ధోనీ ఇన్నింగ్స్​ను 1.6 కోట్ల మంది చూశారు.

ఊహించని గెస్ట్..
అయితే చెన్నై ఇన్నింగ్స్ ఆరంభానికి ముందు మైదానంలోకి ఊహించని అతిథి వచ్చింది. దాంతో ఆట ప్రారంభానికి ఆలస్యం కాగా.. సెక్యూరిటీ సిబ్బంది పరుగులు పెట్టారు. ఇంతకీ ఆ అతిథి ఎవరంటే శునకం. సెక్యూరిటీ కళ్లు గప్పిన ఓ శునకం.. మైదానంలోకి దూసుకొచ్చింది. దాంతో ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. ఆ శునకాన్ని బయటకు వెళ్లగొట్టేందుకు సెక్యూరిటీ సిబ్బంది నానా కష్టాలు పడ్డారు. చివరకు దాన్ని రౌండప్ చేసి బయటకు వెళ్లగొట్టారు. అయితే ఈ శునకం చెపాక్ స్టేడియంలోనేదేనని తెలుస్తోంది. ఇటీవలే చెన్నై వేదికగా భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో వన్డేలోనూ ఇదే శునకం మైదానంలోకి వచ్చి ఆటకు అంతరాయం కలిగించింది. తాజా ఘటనతో ఈ విషయాన్ని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

Last Updated : Apr 3, 2023, 10:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.