ETV Bharat / sports

IPL 2022: రాజస్థాన్​తో నేడే సన్​రైజర్స్​ ఢీ.. శుభారంభం దక్కేనా?

author img

By

Published : Mar 29, 2022, 10:55 AM IST

IPL 2022
SRH vs RR

IPL 2022 SRH vs RR: ఐపీఎల్​ ఆరంభ సీజన్​లోనే కప్పును ముద్దాడిన రాజస్థాన్​ రాయల్స్.. మరో టైటిల్​ కోసం నిరీక్షణ కొనసాగిస్తూనే ఉంది. 2016లో ఛాంపియన్​గా నిలిచిన సన్​రైజర్స్​ హైదరాబాద్​ కూడా ఆ తర్వాత మరో టైటిల్​ గెలవలేదు. ఈ క్రమంలోనే రెండో టైటిల్​ వేటలో ఉన్న ఇరు జట్లు.. ప్రస్తుత 15 సీజన్​లో తమ తొలి మ్యాచ్​లో నేడు (మంగళవారం) బరిలోకి దిగనున్నాయి.

IPL 2022 SRH vs RR: జట్టు నిండా మ్యాచ్​ విన్నర్లతో నిండిన రాజస్థాన్​ రాయల్స్​.. సన్​రైజర్స్​ హైదరాబాద్​తో మంగళవారం తన తొలి మ్యాచ్​లో ఢీకొనబోతోంది​. పుణె వేదికగా సాయంత్రం 7.30 గంటలకు ఈ మాజీ ఛాంపియన్ల మధ్య మ్యాచ్​ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయో చూద్దా..

పటిష్ఠంగా రాయల్స్​..: రాయల్స్ భవితవ్యం.. కెప్టెన్​ సంజూ శాంసన్​ ఫామ్​పై అధికంగా ఆధారపడి ఉంది. రెండు, మూడు మ్యాచులకే పరిమితమవుతున్న అతడి మెరుపులు..​ సీజన్​ మొత్తం కొనసాగించాలని జట్టు​ ఆశిస్తోంది. ఇక విధ్వసంక జోస్​ బట్లర్​, దేవ్​దత్​ పడిక్కల్ రాణిస్తే ప్రత్యర్థికి కష్టమే. పవర్​ హిట్టర్ హెట్​మెయర్​, వాండర్​ డుస్సెన్​, జిమ్మీ నీషమ్​, రియాన్ పరాగ్​తో మిడిల్​ ఆర్డర్ బలంగా ఉంది.

IPL 2022 news
రాజస్థాన్​ రాయల్స్​ ఆటగాళ్ల ప్రాక్టీస్​

రవిచంద్రన్​ అశ్విన్​, యుజ్వేంద్ర చాహల్ చేరికతో బౌలింగ్​ దళం పటిష్ఠంగా కనబడుతోంది. గతేడాది ముంబయి తరఫున అద్భుత ప్రదర్శన చేసిన ట్రెంట్​ బౌల్ట్ నేతృత్వంలో ప్రసిద్ధ్ కృష్ణ, నవదీప్​ సైనీ కూడా కీలకంకానున్నారు.

కెప్టెన్​పైనే భారం..: హైదరాబాద్​కు.. అత్యుత్తమ బ్యాటర్, కెప్టెన్​ కేన్​ విలియమ్సన్​ అనుభవమే ప్రధాన అస్త్రం. వెస్టిండీస్​ ఆటగాడు నికోలస్​ పూరన్​, ప్రియం గార్గ్​, రాహుల్​ త్రిపాఠీ మిడిలార్డర్​ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. డెత్​ ఓవర్స్​ స్పెషలిస్ట్​ భువనేశ్వర్​ కుమార్​, యార్కర్ కింగ్ నటరాజన్​, ఉమ్రాన్​ మాలిక్​తో బౌలింగ్​ బలంగా ఉంది. వాషింగ్టన్ సుందర్​, శ్రేయస్​ గోపాల్​, జగదీశ్ సుచిత్​ కూడా కీలకమే.

IPL 2022 news
భువనేశ్వర్​ కుమార్​

హెడ్​ టు హెడ్​: ఇప్పటివరకు రాజస్థాన్, సన్​రైజర్స్​​ జట్లు 15 సార్లు తలపడ్డాయి. అందులో హైదరాబాద్​.. ఎనిమిది మ్యాచుల్లో గెలవగా.. రాయల్స్​​ ఏడు మ్యాచుల్లో విజయం సాధించింది.

ఇదీ చదవండి: 'అది మాకు కలిసొచ్చే అంశం.. ఐపీఎల్​ ట్రోఫీ మాదే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.