ETV Bharat / sports

'రెండుసార్లు నా హార్ట్ బ్రేక్ అయ్యింది- కోలుకోడానికి కొన్ని రోజులు పట్టింది' - IPL 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 18, 2024, 12:33 PM IST

Virat Kohli Heart Break: ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్​కు కూడా హార్ట్ బ్రేక్ అయ్యిందట. తన 15ఏళ్ల కెరీర్​లో రెండుసార్లు గుండె బద్దలైందని రీసెంట్​గా చెప్పాడు.

Virat Kohli Heart Break
Virat Kohli Heart Break (Source: Associated Press)

Virat Kohli Heart Break: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 2024 ఐపీఎల్​లో టాప్ రన్​ స్కోరర్​గా కొనసాగుతున్నాడు. ఇక ఓవరాల్​గానూ ఐపీఎల్​లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ కూడా విరాటే. గత 15ఏళ్లుగా కెరీర్​లో అసాధారణ ప్రదర్శనతో దూసుకుపోతున్న విరాట్ అనేక రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్​తోపాటు డొమెస్టిక్ టోర్నీల్లోనూ విరాట్ కోహ్లీ సాధించిన ఘనతలు అనేకం. అయితే కెరీర్​ పరంగా ఇన్ని రికార్డులు, ప్రశంసలు అందుకున్నప్పటికీ రెండు సందర్భాల్లో తన హృదయం బద్దలైందని తాజాగా పేర్కొన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ 17లో బిజీగా ఉన్న విరాట్ జియో సినిమా ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఈ ఇంటర్వ్యూలో 2016 ఐపీఎల్​​, టీ20 వరల్డ్​కప్ టోర్నీల్లో తన హార్ట్​బ్రేక్ అయ్యిందంటూ చెప్పాడు.

'నా జీవితంలో 2016లో రెండుసార్లు గుండె బద్దలైంది. ఒకటి టీ20 వరల్డ్​కప్ కాగా, మరొకటి అదే సంవత్సరం జరిగిన ఐపీఎల్ ఫైనల్. ఈ రెండింట్లో ఓటమి నన్ను ఎంతో కుంగదీశాయి. టీమ్ఇండియాకు ప్రపంచకప్ అందించగలను అని అనుకున్నా అది నెరవేరలేదు. ఆ ఓటమి నుంచి కోలుకోవడానికి కొన్ని రోజులు పట్టింది' అని విరాట్ అన్నాడు.

అయితే 2016 వరల్డ్​కప్​లో టీమ్ఇండియా సెమీఫైనల్స్​ వరకు వెళ్లింది. సెమీస్​లో వెస్టిండీస్​ను ఢీ కొట్టిన భారత్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 192 పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికీ విండీస్ ఛేదించింది. ఈ మ్యాచ్​లో విరాట్ అజేయంగా 89 పరుగులు చేశాడు. ఓవరాల్​గా ఆ టోర్నీలో విరాట్ 273 పరుగులు చేశాడు.

ఇక అదే ఏడాది రెండు నెలల తర్వాత ఐపీఎల్​లో ఆర్సీబీ ఫైనల్​కు చేరింది. ఫైనల్స్​లో సన్​రైజర్స్​తో తలపడ్డ ఆర్సీబీ 8 పరుగుల తేడాతో ఓడింది. 209 పరుగుల ఛేదనలో ఆర్సీబీ 10.2 ఓవర్లకు 114-0తో పటిష్ఠ స్థితిలో ఉన్నప్పటికీ తర్వాత టపటపా వికెట్లు కోల్పోయి టైటిల్​ చేజార్చుకుంది. ఈ సీజన్​లో విరాట్ ఏకంగా 973 (నాలుగు సెంచరీలు సహా) పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ నెగ్గాడు. అన్ని పరుగులు సాధించినా టైటిల్ నెగ్గక పోవడం వల్ల విరాట్ నిరాశ చెందాడు.

వర్షం ముప్పు - ఆర్సీబీని సబ్‌ ఎయిర్‌ సిస్టమ్‌ కాపాడుతుందా? - IPL 2024 CSK VS RCB

'నా కూతురు అప్పుడే బ్యాట్ పట్టేసింది'- WPLకు వామిక, IPLలో అకాయ్? - IPL 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.