ETV Bharat / sports

రాణించిన వార్నర్.. కోల్​కతాపై దిల్లీ విజయం

author img

By

Published : Apr 28, 2022, 11:29 PM IST

Updated : Apr 28, 2022, 11:39 PM IST

IPL 2022 KKR Vs DC
IPL 2022 KKR Vs DC

IPL 2022 KKR Vs DC: ఐపీఎల్​ 15వ సీజన్​లో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది దిల్లీ జట్టు. కోల్​కతాతో జరిగిన మ్యాచ్​లో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

IPL 2022 KKR Vs DC: ఐపీఎల్​ 15వ సీజన్​లో వరుసగా ఐదో ఓటమిని చవిచూసింది కోల్​కతా జట్టు. దిల్లీతో జరిగిన మ్యాచ్​లో నాలుగు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ లీగ్‌లో దిల్లీ నాలుగో విజయం నమోదు చేసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. అనంతరం దిల్లీ ఆరు వికెట్లను కోల్పోయి 19 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. డేవిడ్ వార్నర్ (42), లలిత్ యాదవ్ (22), రోవ్‌మన్ పావెల్ (33*), అక్షర్ పటేల్ (24) రాణించారు.

17 పరుగులకే రెండు వికెట్లను చేజార్చుకున్న దిల్లీని వార్నర్, లలిత్ ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి 65 పరుగులు జోడించారు. అయితే కోల్‌కతా బౌలర్లు పుంజుకుని స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లను తీయడంతో రేసులోకి వచ్చింది. అయితే అక్షర్‌ పటేల్‌తోపాటు పావెల్ కోల్‌కతా ఆశలను వమ్ము చేశాడు. ఇంకో 29 పరుగులు జోడించి అక్షర్‌ రనౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. అనంతరం వచ్చిన శార్దూల్‌ (8*) తో కలిసి పావెల్ మరో వికెట్‌ పడనీయకుండా దిల్లీని విజయతీరాలకు చేర్చాడు. బౌలర్లలో ఉమేశ్‌ యాదవ్‌ 3.. హర్షిత్‌ రాణా, సునిల్‌ నరైన్ చెరో వికెట్ తీశారు.

ఇవీ చదవండి: ఐపీఎల్​.. నాకు చాలా భయమేస్తోంది: హార్దిక్

ఐపీఎల్​లో ఆ ప్లేయర్ల హవా... టీమ్ఇండియాకు మళ్లీ ఆడతారా?

Last Updated :Apr 28, 2022, 11:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.