ETV Bharat / sports

తడబడిన ముంబయి.. దిల్లీ లక్ష్యం 138

author img

By

Published : Apr 20, 2021, 9:17 PM IST

Updated : Apr 20, 2021, 9:45 PM IST

దిల్లీ క్యాపిటల్స్​తో జరుగుతోన్న మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్​ నిర్ణీత 20 ఓవర్లలో 137 పరుగులు చేసింది. రోహిత్ (44) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడినా మిగతా వారు విఫలమయ్యారు.

Rohit, mishra
రోహిత్, మిశ్రా

దిల్లీ క్యాపిటల్స్​తో జరుగుతోన్న ఐపీఎల్ మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్​లో తడబడింది. రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్​తో మంచి ఆరంభం లభించినా.. వరుస వికెట్లు పడటం వల్ల తక్కువ స్కోర్​కే పరిమితమైంది. దిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి మెప్పించారు.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్​కు దిగిన ముంబయికి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ డికాక్ (1) తొందరగానే పెవిలియన్ చేరాడు. తర్వాత సూర్యకుమార్​తో కలిసి రోహిత్​ దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ రెండో వికెట్​కు 58 పరుగులు జోడించారు. ఫలితంగా తొలి పవర్​ప్లేలో 55 పరుగులు సాధించి పటిష్ఠ స్థితిలో కనిపించింది ముంబయి. కానీ ఆ సంతోషం ఏమాత్రం నిలవలేదు.

7వ ఓవర్లో సూర్యకుమార్ (24) ఆవేశ్​ ఖాన్ బౌలింగ్​లో కీపర్​కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం తొమ్మిదో ఓవర్లో ధాటిగా ఆడబోయి అమిత్ మిశ్రా బౌలింగ్​లో పెవిలియన్ చేరాడు కెప్టెన్ రోహిత్. అదే ఓవర్లో హార్దిక్ పాండ్యా (0) డకౌట్​గా వెనుదిరిగాడు. తర్వాత కృనాల్ (1), పొలార్డ్ (2) తీవ్రంగా నిరాశపర్చారు. అయితే ఈ వికెట్ల పతనానికి బ్రేక్ వేస్తూ ఇషాన్ కిషన్ (26), జయంత్ యాదవ్ (23) కాసేపు పోరాడారు. ఫలితంగా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది రోహిత్​సేన.

దిల్లీ బౌలర్లలో అమిత్ మిశ్రా 4 వికెట్లతో సత్తాచాటగా ఆవేశ్ ఖాన్ 2, రబాడ, లలిత్ యాదవ్, స్టోయినిస్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

Last Updated : Apr 20, 2021, 9:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.