ETV Bharat / sports

టాస్ గెలిచిన ముంబయి.. చెన్నై బ్యాటింగ్

author img

By

Published : May 1, 2021, 7:03 PM IST

Updated : May 1, 2021, 7:09 PM IST

mi, csk
ముంబయి, చెన్నై

ఐపీఎల్​ 14వ సీజన్​లో భాగంగా నేడు మంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్​లో మొదట టాస్ గెలిచి ముంబయి బౌలింగ్ ఎంచుకుంది.

ఐపీఎల్​లో రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య మ్యాచ్​కు రంగం సిద్ధమైంది. దిల్లీలోని అరుణ్​జైట్లీ స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పోరు జరగనుంది. ఈ మ్యాచ్​లో మొదట టాస్ గెలిచిన ముంబయి బౌలింగ్ ఎంచుకుంది.

పాయింట్ల పట్టికలో ముంబయి ఇండియన్స్ నాలుగో స్థానంలో ఉండగా​, చెన్నై సూపర్​ కింగ్స్​ అగ్రస్థాంలో కొనసాగుతోంది. రెండు జట్లూ అన్ని విభాగాలలో బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఆరేసి మ్యాచ్​లాడిన ఇరుజట్లలో రోహిత్ సేన మూడు పరాజయాలు, మూడు విజయాలతో ఉండగా.. ధోనీ సేన ఐదు విజయాలను ఖాతాలో వేసుకుంది.

ఈ మ్యాచ్​ కోసం ముంబయి జట్టు రెండు మార్పులు చేయగా, పాత జట్టుతోనే బరిలో దిగింది చెన్నై.

చెన్నై సూపర్ కింగ్స్

రుతురాజ్, డుప్లెసిస్, మొయిన్ అలీ, రైనా, రాయుడు, ధోనీ (కెప్టెన్), జడేజా, సామ్ కరన్, శార్దూల్ ఠాకూర్, శార్దూల్ ఠాకూర్, ఎంగిడి, దీపక్ చాహర్

ముంబయి ఇండియన్స్

రోహిత్ శర్మ (కెప్టెన్), డికాక్, సూర్యకుమార్, పొలార్డ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, నీషమ్, రాహుల్ చాహర్, ధావల్ కులకర్ణి, బుమ్రా, బౌల్ట్

Last Updated :May 1, 2021, 7:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.