ETV Bharat / sports

IPL2021: 8-9 రోజులు సరిగా నిద్రపోలేదు: అశ్విన్

author img

By

Published : May 28, 2021, 7:30 AM IST

తన కుటుంబ సభ్యుల కరోనా పాజిటివ్​గా తేలడం వల్ల సరిగా నిద్రపోలేకపోయానని దిల్లీ క్యాపిటల్స్ బౌలర్ అశ్విన్ అన్నాడు. అందుకే ఐపీఎల్​ను అర్ధంతరంగా వీడాల్సి వచ్చిందని చెప్పాడు.

I couldn't sleep 8-9 days while I was playing IPL 2021: ASHWIN
అశ్విన్

ఐపీఎల్ ఆడుతున్న సమయంలో తన కుటుంబ సభ్యులు కరోనా బారిన పడటం వల్ల తీవ్ర ఒత్తిడికి లోనయ్యానని, అందుకే లీగ్​ను వీడాల్సి వచ్చిందని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెప్పాడు.

"మా ఇంట్లో దాదాపుగా అంతా కొవిడ్​తో ఇబ్బందిపడ్డారు. సమీప బంధువుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం వల్ల ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని రోజులు లీగ్ అలాగే ఆడాను. 8 నుంచి 9 రోజులు సరిగా నిద్రపోలేదు. చాలా ఒత్తిడి అనుభవించాను. అందుకే అర్ధాంతరంగా లీగ్​ను వీడాల్సి వచ్చింది. మా కుటుంబ సభ్యులు కోలుకున్నాక తిరిగి ఐపీఎల్ ఆడేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే లీగ్ వాయిదా పడింది అని అశ్విన్ వివరించాడు.

ipl ashwin
రవిచంద్రన్ అశ్విన్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.