ETV Bharat / sports

'ఆ సమయంలో వార్నర్​కు అండగా ఉంది సన్​రైజర్సే.. మర్చిపోకండి'

author img

By

Published : Dec 4, 2021, 6:42 AM IST

David Warner latest news, irfan oathan on david warner, ఇర్ఫాన్ పఠాన్ డేవిడ్ వార్నర్, డేవిడ్ వార్నర్ లేెటెస్ట్ న్యూస్
David Warner

Irfan Pathan on David Warner: ఐపీఎల్​ రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా సన్​రైజర్స్ హైదరాబాద్..​ విలియమ్సన్, సమద్, ఉమ్రన్ మాలిక్​ను అట్టిపెట్టుకుంది. కొన్నేళ్లుగా జట్టును ముందుండి నడిపించిన వార్నర్​కు మాత్రం మొండిచేయి చూపింది. దీనిపై అభిమానులు ఫ్రాంచైజీపై తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా ఈ విషయంపై స్పందించిన మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.. సన్​రైజర్స్​కు మద్దతుగా నిలిచాడు.

Irfan Pathan on David Warner: ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు తాము రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ఫ్రాంచైజీలు ప్రకటించాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (రూ.14 కోట్లు, అన్‌క్యాప్డ్ ప్లేయర్స్‌ అబ్దుల్‌ సమద్(రూ.4 కోట్లు), ‌ఉమ్రాన్‌ మాలిక్‌ (రూ.4 కోట్లు)లను రిటెయిన్‌ చేసుకుంది. అయితే, సన్​రైజర్స్ మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ను ఆ జట్టు అట్టిపెట్టుకోలేదు. దీంతో ఆరెంజ్‌ ఆర్మీ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో సన్‌రైజర్స్‌ యాజమాన్యంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక్క సీజన్‌లో రాణించకపోయినంత మాత్రాన ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా అని మండిపడుతున్నారు. ఈ అంశంపై టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ స్పందిస్తూ.. సన్‌రైజర్స్ యాజమాన్యానికి మద్దతుగా నిలిచాడు.

"ఒక విదేశీ ఆటగాడి రిటెయిన్‌ గురించి ఫ్రాంచైజీ తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. కానీ వాళ్లందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి. తన సొంత దేశం అతనిని ఆడకుండా నిషేధించినప్పుడు అదే ఫ్రాంచైజీ ఆ ఆటగాడికి అండగా నిలిచిందని గుర్తుంచుకోవాలి" అని ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు. 2018లో బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న వార్నర్‌ ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

ఇవీ చూడండి: Ind vs Nz Test: కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.