ETV Bharat / sports

సీఎస్కేపై ముంబయి ఘన విజయం

author img

By

Published : Oct 23, 2020, 7:04 PM IST

Updated : Oct 23, 2020, 10:31 PM IST

టాస్ గెలిచిన ముంబయి.. చెన్నై బ్యాటింగ్
టాస్ గెలిచిన ముంబయి.. చెన్నై బ్యాటింగ్

22:25 October 23

చెన్నై జట్టును చిత్తుగా ఓడించింది ముంబయి ఇండియన్స్​. షార్జా వేదికగా జరిగిన మ్యాచులో పది వికెట్లు తేడాతో ఘన విజయం సాధించింది. 115లక్ష్యంతో బరిలో దిగిన ముంబయి... 12.2ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.  విజయంలో ఓపెనర్లుగా దిగిన డికాక్​(46) ఇషాన్​ కిషన్​(68) ఇద్దరు కలిసి అద్భుతమైన ఇన్నింగ్స్​తో లక్ష్యాన్ని సునాయసంగా అందుకున్నారు. బౌలర్లలో బౌల్డ్​(4), చాహర్​(2), బుమ్రా(2), కౌల్టర్​(1) వికెట్​ పడగొట్టారు. 

22:16 October 23

ముంబయి ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. వికెట్లు ఏమీ నష్టపోకుండా 11 ఓవర్లకు 108 పరుగులు చేశారు. క్రీజులో ఇషాన్ కిషన్​(66) , డికాక్​(40) ఉన్నారు. 

21:58 October 23

6 ఓవర్లకు ముంబయి వికెట్​ ఏమీ నష్టపోకుండా 52 పరుగులు చేసింది ముంబయి.  ఇమ్రాన్‌ తాహిర్‌ బౌలింగ్‌కు దిగాడు. 5 పరుగులు ఇచ్చాడు. పవర్‌ప్లేలో ముంబయి మంచి స్కోరే చేసింది. 8.67 రన్‌రేట్‌తో పరుగులు సాధించింది. ఇషాన్‌ కిషన్‌ (36), డికాక్‌(16) ఆచితూచి ఆడుతున్నారు.

21:50 October 23

ఐదు ఓవర్లు పూర్తయ్యేసరికి ముంబయి 47 పరుగులు చేసింది. క్రీజులో ఇషాన్​ కిషన్​ (34), డికాక్​(13) ఉన్నారు. 

21:45 October 23

3 ఓవర్లకు ముంబయి వికెట్​ ఏమీ నష్టపోకుండా 22 పరుగులు చేసింది.  చాహర్‌ 5 పరుగులే ఇచ్చాడు. డికాక్‌ (12) ఆచితూచి ఆడుతున్నాడు. అనవసర షాట్లకు పోవడం లేదు. ఐదో బంతికి బౌండరీకి తరలించాడు. కిషన్‌ (10) అతడికి తోడుగా ఉన్నాడు.


 

21:37 October 23

దూకుడుగా ముంబయి

115 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం రెండు ఓవర్లకు 17 పరుగులు చేసింది. డికాక్ (8), ఇషాన్ కిషన్ (9) క్రీజులో ఉన్నారు.

21:12 October 23

ముంబయి లక్ష్యం 115

ముంబయితో జరుగుతోన్న మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. ముంబయి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నారు. ఫలితంగా ఓ దశలో 3 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది చెన్నై. ధోనీ (16)తో సహా రాయుడు (2), డుప్లెసిస్ (1), జడేజా (7) దారుణంగా విఫలమయ్యారు. చివర్లో యువ ఆల్​రౌండర్ సామ్ కరన్ (52) అద్భుత ఇన్నింగ్స్​తో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ దక్కింది. ముంబయి బౌలర్లలో బౌల్ట్ 4 వికెట్లతో రాణించగా బుమ్రా 2, రాహుల్ చాహర్ 2, కల్టర్​నీల్ 1 వికెట్ దక్కించుకున్నారు.

21:00 October 23

నిదానంగా చెన్నై బ్యాటింగ్

చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ నిదానంగా సాగుతోంది. ముంబయి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. 18 ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై 8 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. సామ్ కరన్ (37), తాహిర్ (7) క్రీజులో ఉన్నారు.

20:17 October 23

ఏడు వికెట్లు కోల్పోయిన చెన్నై

ముంబయి బౌలర్ల దెబ్బకు చెన్నై బ్యాట్స్​మెన్ విలవిలలాడుతున్నారు. 8.5 ఓవర్లు పూర్తయ్యే సరికి 43 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది చెన్నై. ధోనీ (16), దీపర్ చాహర్ (0) వెనుదిరిగారు. 

19:59 October 23

ఐదు వికెట్లు కోల్పోయిన చెన్నై

ముంబయితో జరుగుతోన్న మ్యాచ్​లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్​మెన్ వరుసగా పెవిలియన్ బాట పడుతున్నారు. ప్రస్తుతం 5.2 ఓవర్లలో 21 పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయింది చెన్నై. జడేజా (7), డుప్లెసిస్ (1) కూడా ఔటయ్యారు.

19:40 October 23

తడబడుతోన్న చెన్నై

ఆదిలోనే సీఎస్కేకు ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 1.5 ఓవర్లలో 3 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. రుతురాజ్ గైక్వాడ్ (0), అంబటి రాయుడు (2), జగదీశన్ (0) నిరాశపర్చారు.

19:07 October 23

జట్లు

ముంబయి ఇండియన్స్

డికాక్, సౌరభ్ తివారి, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్ (కెప్టెన్), కృనాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్​నీల్, రాహుల్ చాహర్, బౌల్ట్, బుమ్రా

చెన్నై సూపర్ కింగ్స్

సామ్ కరన్, డుప్లెసిస్, రాయుడు, జగదీశన్, ధోనీ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, శార్డూల్ ఠాకూర్, హెజిల్​వుడ్, ఇమ్రాన్ తాహిర్

18:55 October 23

టాస్ గెలిచిన ముంబయి.. చెన్నై బ్యాటింగ్

ఈ సీజన్​లో ఘోరంగా విఫలమవుతోన్న చెన్నై సూపర్​కింగ్స్.. నేడు జరిగే మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​తో తలపడనుంది. ఇప్పటికే ఫ్లేఆఫ్స్​ నుంచి దాదాపుగా తప్పుకున్న సీఎస్కే.. ఈరోజు గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. రోహిత్ సేన మాత్రం టాప్ రేసులో నిలిచేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఈ మ్యాచ్​లో మొదట టాస్ గెలిచిన ముంబయి బ్యాటింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ ఈ మ్యాచ్​కు దూరమయ్యాడు. పొలార్డ్ కెప్టెన్​గా వ్యవహించనున్నాడు.

Last Updated : Oct 23, 2020, 10:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.